Vastu Shastra : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి తలుపు ఏ రంగులో ఉంటే మంచిది?

Vastu Shastra : వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో జరిగే శుభాలు, అశుభాలు ఇంటి తలుపు రంగు వలన కూడా కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అందువలన కొత్త ఇల్లు కట్టుకున్న వారు అయినా.. .

By: jyothi

Published Date - Mon - 19 September 22

Vastu Shastra : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి తలుపు ఏ రంగులో ఉంటే మంచిది?

Vastu Shastra : వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో జరిగే శుభాలు, అశుభాలు ఇంటి తలుపు రంగు వలన కూడా కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అందువలన కొత్త ఇల్లు కట్టుకున్న వారు అయినా..లేక పాత ఇంటికి కొత్తగా రంగులు వేయించుకోవాలని భావించే వారు ఎటువంటి రంగును వాడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఈ కలర్స్ అస్సలు వాడొద్దు..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం గుండానే సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుందట.. అందుకే ఇంటి తలుపునకు మంచి రంగును వాడాలని చెబుతున్నారు. లేనియెడల దుష్పప్రభావం ఇంట్లోని అందరిపై తన ప్రభావాన్ని చూపుతుందట.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన వస్తువులను సరైన దిశలో ఉంచాలి. దీనివలన ఇంటి సభ్యులు అనేక విధాలుగా ప్రయోజనం పొందుతారు.

ఇంట్లో వస్తువులు వాస్తు ప్రకారం లేకుంటే వ్యతిరేక ప్రభావం కూడా కలుగుతుంది.అందుకే ఇంటి ప్రధాన ద్వారం గురించి వాస్తు శాస్త్రంలో అనేక నియమాలు పేర్కొనబడ్డాయి. వీటిని పాటించడం ద్వారా మీ జీవితంలో అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చును. ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు ,పడమర దిశలో ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేస్తే ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయట.

మీ ఇంటి ప్రధాన ద్వారం దక్షిణ దిశలో మార్చాలనుకుంటే ప్రధాన ద్వారం వద్ద వాస్తు పిరమిడ్‌ను ఉంచితే చాలు.దోషం ఏమైనా ఉంటే పోతుంది.
అంతేకాకుండా ఇంటి మెయిన్ డోర్ చుట్టూ బాత్రూమ్ ఉండరాదు.ఇక అన్నింటికంటే ముఖ్యమైనది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం రంగు ఎల్లప్పుడూ లేత పసుపు, లేత గోధుమరంగు లేదా చెక్కతో ఉండాలి.ప్రకాశవంతమైన రంగులు వాడితే ఏం కాదు.కానీ కాంతివంతంగా ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.మీ ఇంటి మెయిన్ డోర్‌కి ఎప్పుడూ కాంతివంతమైన రంగులు వేయాలి.డార్క్ కలర్స్ అస్సలు వాడరాదు.

Read Also : Apple iPhone 14 Series : ఐ ఫోన్ 14 హోం డెలివరీ ..అదెలాగంటే?

Read Also : Crime News : ప్రియుడి మోజులో పడి భర్తకు కరెంట్ షాక్..

Related News