Vastu Tips : శాస్త్రం ప్రకాం ఇతరులకు ఈ వస్తువులను ఇవ్వొద్దు..తెలుసా?

Vastu Tips : మన దేశంలో ప్రస్తుతం ఆధునిక పోకడలు చాలా ఎక్కువయ్యాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే, ఇప్పటికీ కొందరు మాత్రం పూర్వీకుల నుంచి తమకు తెలిసిన ఆచార, సంప్రదాయ వ్యవహారాలను పాటిస్తున్నారు. అనేక కట్టుబాట్లు, వ్యవహారాలు అలా ఇంకా అమలులో ఉన్నాయి. ఇకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం, పెద్దలు చెప్పినట్లు కొన్ని వస్తువులను ఇతరులకు అస్సలు ఇవ్వొద్దు. అవేంటో తెలుసుకుందాం. చాలా మంది పెద్దలు చెప్పిన ఆచార, వ్యవహారాలను ఇప్పుడు పాటించడం లేదు. […].

By: jyothi

Published Date - Fri - 26 November 21

Vastu Tips : శాస్త్రం ప్రకాం ఇతరులకు ఈ వస్తువులను ఇవ్వొద్దు..తెలుసా?

Vastu Tips : మన దేశంలో ప్రస్తుతం ఆధునిక పోకడలు చాలా ఎక్కువయ్యాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే, ఇప్పటికీ కొందరు మాత్రం పూర్వీకుల నుంచి తమకు తెలిసిన ఆచార, సంప్రదాయ వ్యవహారాలను పాటిస్తున్నారు. అనేక కట్టుబాట్లు, వ్యవహారాలు అలా ఇంకా అమలులో ఉన్నాయి. ఇకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం, పెద్దలు చెప్పినట్లు కొన్ని వస్తువులను ఇతరులకు అస్సలు ఇవ్వొద్దు. అవేంటో తెలుసుకుందాం.

చాలా మంది పెద్దలు చెప్పిన ఆచార, వ్యవహారాలను ఇప్పుడు పాటించడం లేదు. కానీ, పెద్దలు చెప్పిన వాటిల్లో , పూర్వీకులు అవలంభించిన పద్ధతుల్లో కొంత శాస్త్రీయత ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా, వాస్తు శాస్త్రం ప్రకారం.. ఈ పనులు అస్సలు చేయొద్దట. జనరల్‌గా మనం ఏదేని అర్జెంట్ వర్క్ విషయమై బయటకు వెళ్తున్నపుడు మన దగ్గర లేని వస్తువులను ఇతరులను అడిగి తీసుకెళ్తుంటాం. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం..పొరపాటున కూడా ఇతరుల వద్ద నుంచి అటువంటి వస్తువులను తీసుకెళ్లొద్దు. పండితులు ఆ విషయాలను చెప్తున్నారు.

ఇతరులు మంచి బట్టలు వేసుకున్నపుడు వాటిని చూసి మనం చాలా బాగున్నాయని కొన్ని సార్లు తీసేసుకుంటాం కూడా. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం.. అలా ఇతరుల బట్టలను అస్సలు తీసుకోవద్దు. అలానే మన బట్టలనూ ఇతరులకు ఇవ్వొద్దు. అలా చేయడం వలన ప్రతికూల శక్తి ఎంటర్ అవుతుంది. ఇతరులు ధరించిన వస్త్రాలను పొరపాటున కూడా మనం ధరించొద్దు. అలా ధరించినట్లయితే మనం అనుకున్న పని పూర్తి కాదు. మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో ఆ పని మధ్యలోనే ఆగిపోతుంది.

bed room

bed room

ఇకపోతే బ్యాంకులోనో , రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లోనో లేదా ఇంకేదైనా ప్రదేశంలో మన వర్క్ పూర్తి చేసే సమయంలో సిగ్నేచర్ కోసమో లేదా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడం కోసమో ఇతరుల నుంచి పెన్ను తీసుకున్నపుడు అది కంపల్సరీగా తిరిగిచ్చేయాలి. లేనట్లయితే వాటి ద్వారా మీ జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి పొరపాటున కూడా ఇతరుల పెన్నులను మీరు వాడొద్దు. అలా చేయడం వలన మీకు లేనిపోని సమస్యలు వచ్చే చాన్సెస్ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కంపల్సరీగా ఇతరుల వస్తువులను విధిగా వారికి అప్పజెప్పాలి.

sankham

sankham

మనం ఏదేని పని నిమిత్తం బంధువుల ఇళ్లకో, లేదా స్నేహితుల ఇళ్లకో వెళ్లినపుడు పొరపాటున కూడా వారి బెడ్రూంలో పడుకోకూడదు. అలా చేయడం వలన మీ పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందులు తలెత్తుతాయి. మీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇంకా ఎక్కువయ్యే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇతరుల ఇళ్లలోకి వెళ్లినపుడు వారి వ్యక్తిగత గదులలోనికి వెళ్లొద్దు. లక్ష్మీదేవి సంకేతంగా ఉండేటువంటి శంఖాన్ని ఇతరులకు ఇవ్వొద్దు. ఇతరుల నుంచి మీరు తీసుకోవద్దు. అలా చేయడం వలన మీరు ఆర్థికంగా నష్టపోతారు. అలా చేయడం వలన లక్ష్మీదేవిని వేరే వారికి ఇచ్చినట్లుగా భావించబడి మీ ఆస్తి మొత్తం కూడా ఐస్ మాదిరిగా కరిగిపోతుందట.ఒకవేళ శంఖాన్ని ఎవరికైనా ఇస్తే వారు తిరిగి ఇచ్చినపుడు గంగాజలంలో శుద్ధి చేసిన తర్వాతనే తీసుకోవాలి. లేకపోతే మీ లైఫ్‌లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇంకా పెరిగే చాన్సెస్ ఉంటాయి.

Tags

Latest News

Related News