Aeroplane Gurudwara : సాధారణంగా ఆలయానికి వెళ్లే భక్తులు కొబ్బరికాయలు, పాలు తీసుకెళ్తుంటారు. వాటిని తీసుకెళ్లి దేవుడికి సమర్పించి తమ కోరికలను కోరుతుంటారు. అలా దేవుడి ప్రతిమకు పూజలు చేస్తుంటారు. కానీ, మనం తెలుసుకోబోయే ఈ టెంపుల్స్‌లో నైవేద్యాలు డిఫరెంట్‌గా ఉంటాయి. దేవుడి ప్రతిమకు బదులుగా ఎలుక, విమనాలకు పూజలు చేస్తుంటారు. ఆ ఆలయాలు ఎక్కడున్నాయంటే..
రాజస్థాన్ రాష్ట్రంలోని డెష్నోక్ డిస్ట్రిక్ట్‌లోని కర్ణిమాత టెంపుల్. ఈ టెంపుల్‌ను మౌజ్ టెంపుల్ అంటుంటారు. అనగా ఎలుక ఆలయంగా స్థానికంగా బాగా ప్రసిద్ధి గాంచింది.
ఈ టెంపుల్‌లో దేవుడి విగ్రహాలు అంటూ ఏమీ ఉండబోవు. ఎలుకలనే పూజిస్తుంటారు. ఇకపోతే సాధారణంగా మనందరం ఎలుకలను ఇళ్లలోనో లేదా ఇతర ప్రదేశాలలోనో చూస్తుంటాం. అవి నలుపు రంగు కలిగి ఉంటాయి. అయితే, ఈ టెంపుల్‌లోని ఎలుకలు తెలుపు రంగు కలిగి ఉండటం విశేషం.
తెల్ల ఎలుకలను చూసి భక్తులు పవిత్రంగా భావిస్తుంటారు. ఈ టెంపుల్‌లో 20 వేలకు మించి ఎలుకలుంటాయి. ఈ ఎలుకలకు భక్తులు పెద్ద గిన్నెలలో పాలు పోసి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అలా ఎలుకలకు పాలు పోసి తమ కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. జలంధర్‌లో మరో విచిత్రమైన టెంపుల్ ఉంది. దాని పేరు ‘ఏరో ప్లేన్ గురుద్వారా’. ఈ ఆలయంల షహీద్ బాబా నిహాల్ సింగ్ జ్ఞాపకార్థం కట్టించగా, ఇది జలంధర్ దగ్గర్లోని తాలిహాన్ అనే విలేజ్‌లో ఉంది. ఈ టెంపుల్‌లో వివిధ రకలా పరిమాణాల్లో విమానాల బొమ్మలుంటాయి. అలా విమనాల ఆకృతులనే దేవుళ్లుగా పూజిస్తుంటారు. స్థానికంగా దీనిని ఏరోప్లేన్ గురుద్వారా అని పిలుస్తుంటారు.
Aeroplane Gurudwara
కేరళలోని మన్నారాసాలలో ఒక విచిత్రమైన ఆలయం ఉంది. ఈ టెంపుల్ పేరు నాగరాజ ఆలయం కాగా, ఇందులో నాగుపాముల బొమ్మలే పూజలు అందుకోవడం విశేషం. ప్రతీ రోజు భక్తులు ఆలయంలో వందకు పైగా బొమ్మలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. కేరళలోని అతి పెద్ద సర్పాలయాల్లో ఇది ఒకటి. కాగా, పిల్లలు కావాలనుకునే స్త్రీలు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. తమ కోరికలు నెరవేరగానే పాము బొమ్మలను తీసుకొచ్చి టెంపుల్‌లో సమర్పిస్తుంటారు. అయితే, ఇతర ప్రాంతాల్లో పాము పుట్టల వద్దనో లేదా నాగు పాము విగ్రహాలు ఉన్న ఆలయాల్లో పూజలు చేస్తుండటం మనం చూడొచ్చు. కానీ, ఇలా పాము బొమ్మలను ఆలయంలో సమర్పించి, వాటికి పూజలు చేయడం కొంతమందికి విచిత్రంగా అనిపించొచ్చు. అయితే, ఇలా చేయడం స్థానికంగా బాగా ప్రసిద్ధి గాంచింది.
ఇకపోతే భారత ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఆలయం ఉందండోయ్.. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో మోడీకి సెపరేంట్ టెంపుల్ ఉంది. మోడీ అభిమానులు ఈ గుడిని కట్టించగా, ఆయన అభిమానులు పూల మాలలతో మోడీ విగ్రహానికి పూజలు చేస్తుంటారు.