Favorite Flowers of God : దేవుళ్లను ఈ పూలతో పూజిస్తేనే ప్రతిఫలం.. ఏ భగవంతుడికి ఏ పువ్వంటే ఇష్టమంటే..?

Favorite Flowers of God : భక్తులు దేవుడిని పూజిస్తుంటారు. ఇందుకుగాను వారు దేవాలయాలకు వెళ్లి తమ కోరికలు నెరవేర్చాలని కొబ్బరి కాయలు కొడుతుంటారు. ఈ క్రమంలోనే దేవుడికి ప్రీతిపాత్రమైన వస్తువులను తీసుకెళ్లి సమర్పిస్తుంటారు. అలా తీసుకెళ్లాల్సిన వాటిలో ముఖ్యమైనవి పువ్వులు. కాగా, ప్రతీ దేవుడికి ఓ ప్రీతికరమైన పువ్వు ఉంది. ఏ దేవుడికి ఏ పూలంటే ఇష్టమో ఇక్కడ తెలుసుకుందాం. దేవుడికి ఇష్టమైన పూలతో పూజిస్తేనే తగిన ప్రతిఫలముంటుందని పెద్దలు చెప్తున్నారు. అలా ఇష్టమైన పూలను […].

By: jyothi

Updated On - Wed - 24 November 21

Favorite Flowers of God : దేవుళ్లను ఈ పూలతో పూజిస్తేనే ప్రతిఫలం.. ఏ భగవంతుడికి ఏ పువ్వంటే ఇష్టమంటే..?

Favorite Flowers of God : భక్తులు దేవుడిని పూజిస్తుంటారు. ఇందుకుగాను వారు దేవాలయాలకు వెళ్లి తమ కోరికలు నెరవేర్చాలని కొబ్బరి కాయలు కొడుతుంటారు. ఈ క్రమంలోనే దేవుడికి ప్రీతిపాత్రమైన వస్తువులను తీసుకెళ్లి సమర్పిస్తుంటారు. అలా తీసుకెళ్లాల్సిన వాటిలో ముఖ్యమైనవి పువ్వులు. కాగా, ప్రతీ దేవుడికి ఓ ప్రీతికరమైన పువ్వు ఉంది. ఏ దేవుడికి ఏ పూలంటే ఇష్టమో ఇక్కడ తెలుసుకుందాం.

Favorite Flowers of God

Favorite Flowers of God


దేవుడికి ఇష్టమైన పూలతో పూజిస్తేనే తగిన ప్రతిఫలముంటుందని పెద్దలు చెప్తున్నారు. అలా ఇష్టమైన పూలను కానుకగా దేవుడికి సమర్పించి తమ కోరికలు నెరవేర్చాలని ప్రార్థిస్తే భగవంతుడు తన అనుగ్రహమిచ్చి కోరికలు నెరవేరుస్తాడని పెద్దలు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏయే దేవుడికి ఏ పూలు ఇష్టమంటే.. ఆంజనేయుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం. ఎప్పడూ పరిమళం వెదజల్లే మల్లెపూలను హనుమంతుడికి సమర్పించి పూజలు చేస్తే చక్కటి ఫలితాలుంటాయి. మల్లెపువ్వులను అందించే మొక్కను ఔషధ మొక్కగా భావిస్తుంటారు.

Favorite Flowers of God

Favorite Flowers of God


జ్ఞానానికి చిహ్నమైన మోదుగ పూలను సరస్వతీ దేవికి సమర్పించాలి. సరస్వతీ దేవికి మోదుగ పుష్పం అంటే చాలా ఇష్టం. ఈ పుష్పంతో అమ్మవారిని పూజించినట్లయితే చక్కటి ఆశీర్వచనాలు కలుగుతాయి. తల్లి అనుగ్రహం పొంది జ్ఞానం కూడా వస్తుంది. విఘ్నరాయడు విఘ్నేశ్వరుడికి ఎర్రజిల్లేడు పూలంటే చాలా ఇష్టం. ఈ పూలతో గణనాథుడిని పూజిస్తే స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.

medhuv flower for sarswathi devi

medhuv flower for sarswathi devi


రొమాంటిక్ గాడ్ శ్రీకృష్ణుడికి తులసి పూలు సమర్పించాలి. విష్ణువు, కృష్ణుడు ఇద్దరికీ తులసి పూలంటే చాలా ఇష్టం. కాబట్టి తులసి పూలను ఈ దేవుళ్లకు సమర్పించాలి. తులసితో విష్ణు పూజ చేస్తే కనుక పుణ్యఫలం లభిస్తుంది. ఇకపోతే కాళీ, చాముండేశ్వరీ దేవీలకు ఎర్ర మందారాలు అంటే చాలా ఇష్టం. వారికి ఈ పూలను సమర్పించి తమ కోరిక నెరవేర్చాలని కోరుకున్నట్లయితే తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయి.

tulasi flowers for lord vishnu and lord sri krishna

tulasi flowers for lord vishnu and lord sri krishna


లక్ష్మీ పూజ సమయంలో తప్పకుండా తామర పువ్వు ఉపయోగించాలి. తామరపువ్వును కమలం అని కూడా పిలుస్తారు. సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా కమలాన్ని భావిస్తారు. విష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది పారిజాత పుష్పం..కాగా, ఈపువ్వుతో పూజ చేస్తే చక్కటి ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ పువ్వును స్వర్గం నుంచి భూలోకానికి భగవంతుడు తీసుకొచ్చాడని పురాణాల్లో ఉందని పెద్దలు చెప్తున్నారు. భగవంతుడికి పూజలు చేసే సమయంలో భక్తులు ఇలా ఏ దేవుడికి ఏ పూలు అంటే ఇష్టమో ..వాటిని పర్టికులర్‌గా తీసుకెళ్తే కనుక చక్కటి ప్రయోజనాలుంటాయి. దేవుళ్లకు ఇష్టమైన పూలు సమర్పించి కోరికలు కోరుకున్నట్లయితే అవి తప్పకుండా నెరవేరుతాయని పండితులూ చెప్తున్నారు.

lotus for goddess lakshmi devi

lotus for goddess lakshmi devi

Tags

Latest News

Related News