Sri Bhagavad Ramanuja: కొన్ని వేల ఏళ్లుగా ఆ పార్ధివ దేహం అక్కడ సజీవంగా ఉంది. ఇది సాధ్యపడే విషయమేనా.? కానీ సాధ్యమైంది. టెక్నాలజీ బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో కొన్ని కెమికల్ లేపనాలు పూయడం ద్వారా పార్ధివ దేహాన్ని కొన్ని రోజులు భద్రపరచి ఉంచవచ్చునేమో. అదీ ఓ ఐస్ బాక్సులో ప్యాక్ చేయడం ద్వారా. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోతున్న మిస్టరీ విషయానికి వస్తే, ఆ పార్ధివ దేహానికి ఎలాంటి ఐసు బాక్సులూ వాడలేదు. అలా అని ఎలాంటి రసాయన పూతలూ పూయలేదు. ఓ నాలుగు స్థంభాల మండపంలోగాలి, వెలుతురు తగిలేలా ఓపెన్ గానే ఉంచారు. ఇంతకీ ఎవరిది ఆ పార్ధివ దేహం.? ఎందుకు అక్కడ అలాగే ఉంచారు.? అంటే, భగవత్ శ్రీ రామానుజాచార్యుల హిస్టరీ మీకు తెలియాల్సిందే. స్వయానా భగవత్ స్వరూపుడు ఆయన. 120 ఏళ్లు జీవించి ఉన్నారు. పద్మాసనం వేసుకుని కూర్చుని, ప్రవచనం చెబుతూనే అవతారం పరిసమాప్తి చేశారాయన. తన దేహాన్ని విడిచి, మహా విష్ణువులో ఐక్యమైపోయారు.
అదే పద్మాసనంలో ఆయన పార్ధివ దేహం అలాగే ఉండిపోయింది కొన్ని వేల ఏళ్లుగా. ఒళ్లు గగుర్పొడిచే నిగూఢ రహస్యమే కదా ఇది. ఒకటి కాదు, రెండు కాదు, వెయ్యేళ్లుగా కనుల ముందు కనిపిస్తున్న అంతు పట్టని ఆధ్యాత్మిక రహస్యమిది. వైజ్నానిక శాస్త్రానికే సవాల్ విసిరిన సంఘటన ఇది. ప్రకృతి ధర్మాన్ని తలదన్ని నిలిచిన నిలువెత్తు నిజం.
శ్రీ భగవత్ రామానుజార్యల జన్మ స్థలం..
చెన్నై పట్టణానికి 25 కిమీల దూరంలో శ్రీ పిరంబదూర్ అనే గ్రామంలో భగవత్ శ్రీ రామానుజాచార్యలు 1017 వ సంవత్సరంలో జన్మించారు. 6.11 అడుగుల పొడుగరిగా విశిష్ట అద్వైత మత గొప్పతనాన్నిదేశానికి అందించి 120 ఏళ్ల పాటు జీవించారాయన. ఆయన జీవిత కాలంలో ఎక్కువగా శ్రీరంగంలోనూ కాంచీపురంలోనూ, తిరుమలలోనూ గడిపారాయన.
ఇక చివరిగా ఆయన తన శరీరాన్నివిడిచి పెట్టి వెళ్లింది శ్రీరంగంలోనే. అక్కడే ఆయన పార్ధివ దేహం ఇప్పటికీ సజీవంగా ఉంది. సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు స్వయంభువుగా వెలిసిన శ్రీరంగంలోఇప్పటికీ ఆయన పార్థివ దేహం మనకు సాక్షాత్కరిస్తుంది. పరమ విశిష్టత కలిగిన వైష్ణవ క్షేత్రాల్లో శ్రీరంగం కూడా ఒకటి. అపురూపమైన శిల్ప చాతుర్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ ప్రాంగణంలోని ప్రతీ అణువణువు. కొన్ని భారీ ఆలయాల సముదాయం ఈ ఆధ్యాత్మిక మందిరం. ఇక్కడి అద్వితీయమైన శిల్ప కళ భక్తులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఈ ఆలయానికి ఏడు ప్రాకారాలున్నాయి. వాటిలో నాలుగో ప్రాకారంలోని ఓ మంటపంపై శ్రీమత్ భగవాన్ రామానుజార్యుల వారి పార్ధివ దేహం పద్మాసనంలో మనకు దర్శనమిస్తుంది. చూస్తే అది ఓ శిలగానే అనిపిస్తుంది. కానీ, తాకితే, సజీవంగా ఉన్న మానవ శరీరం మాదిరి మెత్తగా తగులుతుంది. కొన్ని వేళ ఏళ్లు గడిచినా ఆయన పార్ధివ శరీరం సజీవంగా ఉండడానికి కారణాలు వెతకలేకపోయింది మన సైన్సు. ఎలాంటి కెమికల్ రసాయనాలూ పూయకుండా ఓ పార్ధివ దేహం అలా సజీవంగా ఉండడాన్ని నమ్మలేని నిజంగా మాత్రమే వదిలేయాల్సి వచ్చింది. కానీ, అది నిజంగా నిజం. శరీరం కాస్త కుంచించుకుపోయినా, కనుబొమ్మలు, కనుపాపలూ, గోళ్లలోని జీవత్వం హారతి వెలుగులో స్పష్టంగా దర్శనమిస్తుంది. రెండేళ్ల కోసారి కర్పూర కుంకుమ పువ్వు లేపనాన్ని ఉత్సవం చేసి, ఆ విగ్రహానికి పూస్తారు. మనిషి శరీరానికి పూత పూస్తున్నట్లుగా మెత్తని అనుభూతిని
కొన్ని వేల ఏళ్లుగా ఆ పార్ధివ దేహం అక్కడ సజీవంగా ఉంది. ఇది సాధ్యపడే విషయమేనా.? కానీ సాధ్యమైంది. టెక్నాలజీ బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో కొన్ని కెమికల్ లేపనాలు పూయడం ద్వారా పార్ధివ దేహాన్ని కొన్ని రోజులు భద్రపరచి ఉంచవచ్చునేమో. అదీ ఓ ఐస్ బాక్సులో ప్యాక్ చేయడం ద్వారా. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోతున్న మిస్టరీ విషయానికి వస్తే, ఆ పార్ధివ దేహానికి ఎలాంటి ఐసు బాక్సులూ వాడలేదు. అలా అని ఎలాంటి రసాయన పూతలూ పూయలేదు. ఓ నాలుగు స్థంభాల మండపంలోగాలి, వెలుతురు తగిలేలా ఓపెన్ గానే ఉంచారు. ఇంతకీ ఎవరిది ఆ పార్ధివ దేహం.? ఎందుకు అక్కడ అలాగే ఉంచారు.? అంటే, భగవత్ శ్రీ రామానుజాచార్యుల హిస్టరీ మీకు తెలియాల్సిందే. స్వయానా భగవత్ స్వరూపుడు ఆయన. 120 ఏళ్లు జీవించి ఉన్నారు. పద్మాసనం వేసుకుని కూర్చుని, ప్రవచనం చెబుతూనే అవతారం పరిసమాప్తి చేశారాయన. తన దేహాన్ని విడిచి, మహా విష్ణువులో ఐక్యమైపోయారు.