Bommavara Sundareswara Temple: దెయ్యాలు కట్టిన గుడి.. చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుందంతే..

Bommavara Sundareswara Temple ఆ దేవాలయాన్ని దేవతలు నిర్మించారట.. చాలా ఏళ్ల చరిత్ర ఉందట.. ఎంతో మహిమాన్వితమైనదట.. అంటూ కొన్ని దేవాలయాల గురించి మాట్లాడుకుంటుంటాం. లేకపోతే, పలానా రాజులు ఎంతో వైభవంగా ఆ గుడిని కట్టించాడట.. అని వింటుంటాం. అదీ కాకపోతే, కొందరు భక్తులే ఆ దేవాలయాలు కట్టించారట. అని మాట్లాడుకుంటుంటాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేవాలయాన్ని ఎవరు కట్టించారో తెలిస్తే షాకవ్వాల్సిందే. నిజంగా ఇలాంటి దేవాలయాలుంటాయా.? అని ఆశ్చర్యపోవాల్సిందే.   ఈ దేవాలయాన్ని దెయ్యాలు […].

By: jyothi

Published Date - Mon - 30 August 21

Bommavara Sundareswara Temple: దెయ్యాలు కట్టిన గుడి.. చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుందంతే..

Bommavara Sundareswara Temple ఆ దేవాలయాన్ని దేవతలు నిర్మించారట.. చాలా ఏళ్ల చరిత్ర ఉందట.. ఎంతో మహిమాన్వితమైనదట.. అంటూ కొన్ని దేవాలయాల గురించి మాట్లాడుకుంటుంటాం. లేకపోతే, పలానా రాజులు ఎంతో వైభవంగా ఆ గుడిని కట్టించాడట.. అని వింటుంటాం. అదీ కాకపోతే, కొందరు భక్తులే ఆ దేవాలయాలు కట్టించారట. అని మాట్లాడుకుంటుంటాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేవాలయాన్ని ఎవరు కట్టించారో తెలిస్తే షాకవ్వాల్సిందే. నిజంగా ఇలాంటి దేవాలయాలుంటాయా.? అని ఆశ్చర్యపోవాల్సిందే.

 

ఈ దేవాలయాన్ని దెయ్యాలు నిర్మించాయట. నమ్మలేని నిజం కదా. కానీ, నమ్మి తీరాల్సిందే. కర్ణాటకలోని బొమ్మవరె అనే ఊరిలో ఈ దేవాలయం ఉంది. అక్షరాలా దెయ్యాలే ఈ దేవాలయాన్ని నిర్మించాయట. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దాదాపు 600 సంవత్సరాల క్రితం ఆ ఊరిని దెయ్యాలు పట్టి పీడించేవట. అక్కడి జనాలకు నిద్ర లేకుండా చేసేవట.ఆ దెయ్యాలకు భయపడి ఆ ఊరిలో అడుగు పెట్టాలంటే, బయటి గ్రామాల వాళ్లు హడలిపోయేవారట. అదే ఊళ్లో బుచ్చయ్య అనే మంత్రగాడు ఉండేవాడట. బుచ్చయ్య పేరుకు మంత్రగాడే అయినా, పరమ శివునికి అరి వీర భక్తుడట. దెయ్యాల బాధను తట్టుకోలేక, వాటి నుండి కాపాడమని, ఆ ఊరి జనం బుచ్చయ్యను వేడుకోగా..  కొన్ని ఏళ్ల పాటు పరమ శివుని ధ్యానం చేసి, దెయ్యాలను ఆవాహనం చేసుకునే మంత్ర, తంత్రాలను తెలుసుకున్నాడట. అలాగే, ఊరి జనాలకు దెయ్యాల భయం  పోయేందుకు ఆ ఊరిలో ఓ శివాలయం నిర్మించ తలపెట్టాడట. అనుకున్నదే తడవుగా, ఊరి జనం సహాయంతో శివాలయం నిర్మించాడట. కానీ, అక్కడ గుడి కట్టం ఇష్టం లేని దెయ్యాలు, రాత్రికి రాత్రే ఆ గుడిని ద్వంసం చేశాయట. దాంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బుచ్చయ్య, శివుని వరంతో, తన వద్ద ఉన్న శక్తినంతటినీ ఉపయోగించి ఆ దెయ్యాలను బంధించాడట.


బంధీలయిన దెయ్యాలు విడిచిపెట్టమని బుచ్చయ్యను వేడుకోగా, రెండు షరతుల మీద బుచ్చయ్య వాటికి విముక్తి ప్రసాదించాడట. అందులో ఒకటి ఆ దెయ్యాలు కూల్చిన గుడిని వారే తిరిగి నిర్మించాలనీ, రెండోది ఇంకెప్పుడూ ఆ ఊరి జనాలకు దెయ్యాల పీడ ఉండకూడదనే షరతులు పెట్టాడట. దాంతో రాత్రికి రాత్రే దెయ్యాలు ఆ గుడిని తిరిగి నిర్మించాయట.

అయితే, ఈ గుడిలో మరో విశేషముంది.. గుడి గోపురాలపై సహజంగా దేవతల విగ్రహాలుంటాయి. కానీ, ఈ గుడిలో మాత్రం అన్నీ దెయ్యాల బొమ్మలే ఉంటాయి. గుడి మాత్రమే నిర్మించి దెయ్యాలు అంతర్ధానమైపోగా, ఆ గుడిలో పరమ శివుని ప్రతిష్టాపన జరిగింది. సుందరేశ్వరస్వామి దేవాలయంగా ఆ దేవాలయం ప్రసిద్ధి చెందింది.

ఈ శివలింగానికీ ఓ ప్రత్యేకత ఉంది. మంచి నీటి బావి కోసం గుంత తీస్తుండగా, ఓ శివ లింగం బయట పడిందట. ఆ శివలింగం దాదాపు 8 అడుగుల ఎత్తుతో అంతి సుందరంగా, చూడగానే మనసుకు ఆహ్లాదాన్నీ, ఆనందాన్నీ కలిగించేలా, ప్రశాంతమైన వఛ్చస్సుతో మెరిసిపోతూ దర్శనమిచ్చిందట. ఈ ప్రత్యేకమైన శివ లింగం కారణంగానే ఈ గుడికి సుందరేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చిందనీ అంటుంటారు. అంతేకాదు, ఇంత ఎత్తైన శివ లింగం ఆ రాష్టంలో మరెక్కడా లేదని ప్రతీతి.

Latest News

Related News