Brahmababa Temple.. ఈ ఆల‌యంలో రావిచెట్టును పూజిస్తే మ‌న‌శ్శాంతి వ‌స్తుంద‌ట‌..

Brahmababa Temple.. ప్రపంచానికి భక్తి భావనను భారత్ పరిచయం చేసిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవాలయాలకు వెళ్లడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని, తద్వారా మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని ప్రజలు నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే టెంపుల్స్‌కు వెళ్తుంటారు. ప్రతీ రోజు మార్నింగ్ టైమ్స్‌లోనో లేదా ఈవినింగ్స్‌లోనూ దేవాలయాలను సందర్శించి దైవ దర్శనం చేసుకుంటారు. అయితే, భారత్‌లో సాధారణ ఆలయాలతో పాటు అరుదైన ఆలయాలు కూడా ఉన్నాయి. అరుదైన టెంపుల్స్‌లో కొన్ని టెంపుల్స్ వెరీ డిఫరెంట్‌వి కూడా […].

By: jyothi

Published Date - Fri - 22 October 21

Brahmababa Temple.. ఈ ఆల‌యంలో రావిచెట్టును పూజిస్తే మ‌న‌శ్శాంతి వ‌స్తుంద‌ట‌..

Brahmababa Temple.. ప్రపంచానికి భక్తి భావనను భారత్ పరిచయం చేసిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవాలయాలకు వెళ్లడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని, తద్వారా మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని ప్రజలు నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే టెంపుల్స్‌కు వెళ్తుంటారు. ప్రతీ రోజు మార్నింగ్ టైమ్స్‌లోనో లేదా ఈవినింగ్స్‌లోనూ దేవాలయాలను సందర్శించి దైవ దర్శనం చేసుకుంటారు. అయితే, భారత్‌లో సాధారణ ఆలయాలతో పాటు అరుదైన ఆలయాలు కూడా ఉన్నాయి. అరుదైన టెంపుల్స్‌లో కొన్ని టెంపుల్స్ వెరీ డిఫరెంట్‌వి కూడా ఉన్నాయి. అవేంటో ఈ స్టోరిలో తెలుసుకుందాం.

ఆలయాలకు వెళ్లి పూజలు చేయడం, దైవ దర్శనం చేసుకోవడం ద్వారా తమకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, తాము అనుకున్నది సాధిస్తామనేది భక్తుల నమ్మకం. ఈ క్రమంలోనే తమ కోరికలు తీర్చాలని కోరుతూ భక్తులు దేవుళ్లకు నైవేద్యాలు సమర్పించడంతో పాటు కానుకలు సమర్పిస్తుండటం మనం చూడొచ్చు. అలా తమ కోరికల కోసం డిఫరెంట్ టెంపుల్స్‌లో డిఫరెంట్ పూజలు కూడా చేస్తుంటారు భక్తులు.

అలా పూజలు చేయడం ద్వారా తమకు మనశ్శాంతి వస్తుందని, పుణ్యం వస్తుందని భావిస్తుంటారు. విచిత్రమైన టెంపుల్ ఒకటి జౌన్‌పూర్‌లో ఉంది. ఇందులో రావి చెట్టును పూజించడం స్పెషాలిటీ. కాగా, ఈ టెంపుల్ పేరు ‘బ్రహ్మబాబా ఆలయం’. స్థానికంగా బాగా ప్రసిద్ధి గాంచిన ఆలయంలో భక్తులు రావిచెట్టుకు పూజలు చేస్తుంటారు. పూజలో భాగంగా వారు రావి చెట్టుకు గడియారాలను కట్టి పూజలు చేస్తుంటారు. అలా రావిచెట్టుకు గడియారాలు కడితే కనుక తమ కోరికలు ఇట్టే నెరవేరుతాయని, బ్రహ్మదేవుడు తమ మొర ఆలకిస్తాడని భక్తుల నమ్మకం.

Brahmababa Temple.. there is pease off mind-1

Brahmababa Temple.. there is pease off mind-1

ముప్పై ఏళ్ల కిందట స్థానికంగా ఉండే ఓ ట్రక్ డ్రైవర్ డ్రైవింగ్ నేర్చుకోవడం కోసమై గడియారాన్ని రావి చెట్టుకు వేలాడదీశాడట. అలా ఆ తర్వాత డ్రైవింగ్ నేర్చుకున్నాడని, ఇక అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతుందని స్థానికులు చెప్తున్నారు. అయితే, స్థానికులు మాత్రమే కాకుండా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం రావిచెట్టుకు గడియారాలను కట్టి తమ కోరికలను తీర్చాలని బ్రహ్మదేవుడిని వేడుకుంటారు. అయితే, వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారు ఇలా గడియారాలను దేవుడికి సమర్పించడం గురించి తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. కానీ, ఆ తర్వాత స్థానిక నమ్మకాలను, దేవుడి మహిమను గురించి స్థానికుల ద్వారా తెలుసుకుని వారు కూడా బ్రహ్మదేవుడికి తమ కోరికలు విన్నవిస్తారని స్థానికులు అంటున్నారు. ఇకపోతే ఇటువంటి మాదిరి ఓ డిఫరెంట్ టెంపుల్ ఉజ్జయినిలో ఉంది.

ఇక్కడ కాలభైరవ ఆలయంలో విస్కీని నైవేద్యంగా సమర్పించడం విశేషం. కాగా, భక్తులందరూ విస్కీని ఆలయంలోకి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. అలా ఈ టెంపుల్‌లో కొలువుదీరిన అమ్మవారు విస్కీ దేవిగా ప్రసిద్ధి గాంచారు. అయితే, ఈ టెంపుల్ కాలభైరవుడిది. కాగా ఆయన ఉజ్జయిని నగర రక్షకుడిగా ఉంటాడని స్థానికులు చెప్తున్నారు. అమ్మ వారికి విస్కీని నైవేద్యంగా సమర్పించి తమ కోరికలు నెరవేర్చాలని కోరుకుంటే తప్పక ఆ కోరికలను అమ్మవారు నెరవేరుస్తారని నమ్మకం. ఇకపోతే ఈ టెంపుల్‌కు ప్రతీ రోజు వందలాది మంది భక్తులు వచ్చి అమ్మ వారికి విస్కీని నైవేద్యంగా సమర్పించడం విశేషం.

Tags

Latest News

Related News