Chilkur Balaji Temple : హుండీలే లేని ఈ బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్..

Chilkur Balaji Temple : సాధారణంగా ఏదేని చిన్న ఆలయంలో సైతం కంపల్సరీగా హుండీ ఉంటుంది. ఆలయ కమిటీ వారు కాని నిర్వాహకులు కాని హుండీలు ఏర్పరుస్తారు. హుండీలు లేని చోట చిన్న బిందెకు పసుపు వస్త్రం చుట్టి దానినే హుండీగా భావించి దేవుడి ముందర పెడుతారు. ఇక భక్తులు దేవుడిని సందర్శించుకున్న తర్వాత కానుకలు హుండీలో వేస్తుంటారు. అలా హుండీ అనేది కంపల్సరీగా ప్రతీ టెంపుల్‌లో ఉంటుంది. కానీ, ఈ ఆలయం మాత్రం అలా కాదు. […].

By: jyothi

Published Date - Fri - 5 November 21

Chilkur Balaji Temple : హుండీలే లేని ఈ బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్..

Chilkur Balaji Temple : సాధారణంగా ఏదేని చిన్న ఆలయంలో సైతం కంపల్సరీగా హుండీ ఉంటుంది. ఆలయ కమిటీ వారు కాని నిర్వాహకులు కాని హుండీలు ఏర్పరుస్తారు. హుండీలు లేని చోట చిన్న బిందెకు పసుపు వస్త్రం చుట్టి దానినే హుండీగా భావించి దేవుడి ముందర పెడుతారు. ఇక భక్తులు దేవుడిని సందర్శించుకున్న తర్వాత కానుకలు హుండీలో వేస్తుంటారు. అలా హుండీ అనేది కంపల్సరీగా ప్రతీ టెంపుల్‌లో ఉంటుంది. కానీ, ఈ ఆలయం మాత్రం అలా కాదు. ఇక్కడ హుండీ లేకపోవడమే వెరీ స్పెషల్.. ఆ ఆలయం ఎక్కడుందంటే..

Chilkur Balaji Temple 1

Chilkur Balaji Temple 1

తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి చేరువలోని మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది ఆ టెంపుల్.. అలా ఆ టెంపుల్‌కు చిలుకూరు బాలాజీ టెంపుల్ అని పేరొచ్చింది. ఈ ఆలయం వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండటం విశేషం. ప్రతీ రోజు ఇక్కడికి దేవుడి సందర్శనార్థం సుమారు ముప్పై వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. ఇక హాలీ డేస్‌లో అయితే ఏకంగా యాభై వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. ఇకపోతే ఈ ఆలయంలో వీఐపీ దర్శనాలు, టికెట్లు ఉండవు.

ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు ఇంకో స్పెషాలిటీ ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో వెంకటేశ్వరస్వామితో పాటు మహాశివుడు కూడా పూజలందుకుంటాడు. ఇది ఈ ఆలయ విశిష్టతని స్థానికులు చెప్తున్నారు. పురాణాల ప్రకారం..కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి మూడు చోట్ల వెలిశాడు. అందులో ఒకటి చిలుకూరు బాలాజీ టెంపుల్. కాగా, దీనిని తెలంగాణ తిరుమల అని పిలుస్తుంటారు. తెలంగాణ తిరుమల టెంపుల్‌గా చిలుకూరు బాలాజీ బాగా ఫేమస్ అయ్యారు కూడా. ఈ చిలుకూరు బాలాజీ ఆలయానికి దాదాపు ఐదొందల ఏళ్ల చరిత్ర ఉంది.

Chilkur Balaji Temple

Chilkur Balaji Temple

శ్రీదేవి, భూదేవి సమేతుడైన వెంకటేశ్వరస్వామి చిలుకూరు ఆలయంలో ఉంటాడు. కలియుగ దైవమైన బాలాజీకి ఈ ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలు..కోరికలు నెరవేరుతాయి. భక్తులు ప్రతీ రోజు వేల సంఖ్యలో ఇక్కడకు వచ్చి ప్రదక్షిణలు చేస్తుంటారు. తమ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి మళ్లీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు. ఇక ఈ బాలాజీకి వీసా గాడ్ అని మరో పేరు కూడా ఉంది. చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లే విద్యార్థులు వీసా కోసం ఇక్కడకు వచ్చి మొక్కుకున్న తర్వాత వీసాలు వచ్చాయట. అలా బాలాజీ వీసా గాడ్ అయిపోయాడు.

Chilkur Balaji Temple 2

Chilkur Balaji Temple 2

వీసాలు మంజూరు చేసే దేవుడిగా చిలుకూరు బాలాజీకి మంచి పేరుంది. ప్రతీ రోజు భక్తులతో కిటకిటలాడే ఈ టెంపుల్‌లో దేవుడు అందరికీ ఒకేలా దర్శనమివ్వడం ప్రత్యేకమైన విషయమని చెప్పొచ్చు. అన్ని దేవాలయాల్లో ఉన్నట్లుగా ఈ ఆలయంలో ప్రత్యేక దర్శనం, వీఐపీ టికెట్ అంటూ ఏమీ ఉండవు. అంతా నార్మల్‌గానే ఉంటుంది. ఈ టెంపుల్ ప్రాంగణంలోని రావిచెట్టుకు 350 ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని తాకితే మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

Tags

Latest News

Related News