మనిషి జీవితంలో శని పీడన పడని వారు ఉండరు. అయితే శని శాంతి కోసం దానాలు, జపాలు, పూజలు, ఇలాఅనేకం చేయాలని చెప్తుంటారు పండితులు అవన్నీ వాస్తవమే కానీ అందరికీ అవి సాధ్యం కావు అటువంటి వారు సులభంగా శనిబాధ నుంచి నివారణ పొందడానికి వినాయక ఆరాధన చేయాలి. అది ఎలా చేస్తే అయితే ఆయన అనుగ్రహం కోసం ఏం చేయాలో తెలుసుకుందాం…
గణపతికి గరిక పూజ చేయడం వలన శని బాధలు తొలగిపోతాయి. గణపతికి ప్రతిరోజూ గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే ఈతిబాధలు, సమస్యల నుంచి బయట పడతారు. శనిభగవానుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి. గరిక పత్రంతో శ్రీ మహా గణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి.
గరిక పత్రాన్ని నగదు ఉంచే ప్రదేశంలో పెడితే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది. దుర్గాదేవికి గరికతో పూజ చేస్తే రహస్య ప్రార్థనలు ఫలిస్తాయి. గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి. ఇది చాలా సులభమైన ఉపాయం. దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టనక్కర్లేదు. చాలా సులభంగా మనకు లభించే గరికతో గణేష్డుని ఆరాధించి అతి శ్రీఘ్రంగా శనిబాధల నుంచి విముక్తి పడవచ్చు. ఇది ఎందరో చేసి తమకు శనిబాధలు పోయాయని చెప్పారు. కాబట్టి మీరు భక్తి, శ్రద్ధలతో ఈ సులభ పరిహారాన్ని ఆచరించి శనిబాధల నుంచి విముక్తి పొందండి.