పూజ… పుష్పం.. వీటికి విడదీయరాని అనుబంధం. ముఖ్యంగా శివార్చన, విష్ణు అంటే కేశవుడిని ఆరాధించడానికి పూర్వీకులు అనేక ఆచారాలు ఏర్పాటుచేశారు. వీటిలో అనేక సమస్యలకు పరిష్కారాలు చూపించారు. ఏ పుష్పంతో శివుడికి అర్చన చేస్తే మంచిది, ఏం ఫలితం వస్తుంది అనే విశేషాలు అనేక పురాణాలలో ఉన్నాయి. వాటిలో నేడు శివకేశవులకు ప్రతీకరమైన పుష్పార్చనల గురించి తెలుసుకుందాం… శివుని ప్రతి రోజు ఒక జిల్లేడు పూవుతో పూజిస్తే పది బంగారు నాణెములు దానం చేసిన ఫలితం దక్కుతుంది. ఒక గన్నేరు పూవువెయ్యి జిల్లేడు పూలతో సమానం.
ఒక మారేడుదళం వెయ్యిగన్నేరు పూవులతో సమానం. ఒక తామరపూవు వెయ్యి మారేడుదళాల సమానం. ఒక పొగడపూవు వెయ్యి తామరపూవులతో సమానం. ఒక ములక పువు వెయ్యి పొగడపూవులతో సమానం ఒకతుమ్మిపూవు వెయ్యిములకపువులతో సమానం. ఒక ఉత్తరేణి పూవు వెయ్యి తుమ్మిపూలతో సమానం. ఒక ఉత్తరేణి పూవు వెయ్యి పొగడపూవులతో సమానం. ఒక దర్భపూవు వెయ్యి ఉత్తరేణిపూవులతో సమానం. ఒక జమ్మిపూవువెయ్యి దర్భపూవులతో సమానం. ఒక నల్లకలువ వెయ్యి జమ్మిపూవులతో సమానం. వెయ్యి నల్లకలువ పూవులతో చేసిన మాలను శివునికి సమర్పిస్తారో వారు కైలాసంలో నివసిస్తారు. మొగిలి -మాధవిమల్లి (మల్లె పూవు కాదు) అడవిమల్లి -సన్నజాజి – ఉమ్మెంత -దిరిసెన-సాల-మంకెనపూవులను శివ పూజలో వాడరాదు. మిగిలిన పూవులను శివ పూజలో వాడవచ్చు