మీ ఇంట్లో ధనలక్ష్మీ నిలవాలంటే ఇలా చేయండి !

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు దుఖానికి బాధలకు దూరంగా ఉండాలనుకుంటారు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి దుఃఖాలు సమస్యలు బాధలు రాకుండా ఉండాలంటే ఉప్పు దీపాన్ని వెలిగించడం మంచిది. ఈ దీపం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మీ సమస్యలన్నీ పోగొట్టడానికి ఒకే ఒక పరిష్కారం ఈ దీపం. […].

By: riyareddy

Updated On - Thu - 22 April 21

మీ ఇంట్లో ధనలక్ష్మీ నిలవాలంటే ఇలా చేయండి !

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు దుఖానికి బాధలకు దూరంగా ఉండాలనుకుంటారు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి దుఃఖాలు సమస్యలు బాధలు రాకుండా ఉండాలంటే ఉప్పు దీపాన్ని వెలిగించడం మంచిది. ఈ దీపం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మీ సమస్యలన్నీ పోగొట్టడానికి ఒకే ఒక పరిష్కారం ఈ దీపం. మన బాధలకు సమస్యలకు ముఖ్యమైన కారణం డబ్బు డబ్బు లేకపోవడం వల్ల ఇవన్నీ ముందుకు వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా బాగా లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో, మీలో ఉన్న చెడును తీసివేస్తుంది. మన ఇంట్లో ఉన్న చెడునంతటినీ తీసివేసి చైతన్యవంతమైన పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది. ఉప్పు దీపాన్ని వెలిగించి లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం వల్ల మన మనసులో ఉన్న కోరికలు తీరిపోతాయి. ఈ దీపాన్ని ఇంట్లోనే కాక వ్యాపార స్థలాల్లో వ్యాపార అభివృద్ధి కోసం వెలిగించుకోవచ్చు. రెండు పూటలా సరైన సమయానికి ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మనకు అంతా బాగుంటుంది. ఇంట్లోనే వెలిగించే ఈ ఉప్పు దీపం ప్రతిరోజు ఉదయాన్నే స్నానానంతరం శుభ్రమైన దుస్తులు ధరించి ఈ దీపాలను వెలిగించవచ్చు.

దీపం వెలిగించే విధానం

ఈ దీపాన్ని వెలిగించే విధానం.. ముందుగా ఒక రక్త మట్టి అంటే ఎరుపురంగు మట్టి ప్రమిదను తీసుకుని ఎలాంటి పగుళ్ళు లేకుండా నీటుగా ఉండే ప్రమిదలు తీసుకోండి. ఆ మట్టి ప్రమిదకు చుట్టూ పసుపుతో దానిని అలంకరించి ఆడవాళ్ళు దైవ దీపారాధన చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు గాజులు ధరించడం మంచిది. ఆ పసుపు రాసినప్పుడు మీదకు కుంకుమ బొట్లు పెట్టి ఒక ఇత్తడి లేదా రాగి లేదా వెండి ఏదో ఒక ప్లేటు తీసుకోండి. కానీ ఇనుము ప్లేటు, స్టీల్ ప్లేట్ పూజకు దీపారాధనకు పనికిరాదు. మనం భోజనం టిఫిన్ చేసే ప్లేట్, ప్లాస్టిక్, పింగాణి ప్లేట్లు పనికిరావు. ఇత్తడి ప్లేట్ను తీసుకున్న తర్వాత ఈ ప్లేట్ కు గంధము కుంకుమ బొట్లు పెట్టండి. ఈ ప్లేట్లో మట్టి ప్రమిదలు పెట్టండి. ఇప్పుడు ఉప్పును తీసుకొని  ఆ మట్టి ప్రమిదలో చుట్టూ కింద పోకుండా వేయాలి. ఈ ఉప్పును ప్రమిదలో వేసేటప్పుడు మాట్లాడకుండా అమ్మవారిని తలచుకుంటూ వేయండి. ఇప్పుడు ఈ ఉప్పు ప్రమిద మీదికి రెండు చిన్న మట్టి ప్రమిదలను తీసుకుని వాటిని కూడా పసుపుతో అలంకరించి కుంకుమ బొట్లు పెట్టండి. మొదట ఒక ప్రమిద కుట్టు మీద పెట్టి దాంట్లో అక్షింతలు వేసి దానిమీద అ ఇంకొక ప్రమీద పెట్టండి. ఈ పై ప్రమిదలో నువ్వుల నూనెను పోయండి. నువ్వుల నూనె అన్ని నూనెల కంటే శ్రేష్టమైనది. ఉప్పు దీపం వెలిగించేటప్పుడు ఈ నువ్వుల నూనె లక్ష్మీ అమ్మవారి కి ప్రీతికరమైనది కాబట్టి నువ్వుల నూనె తీసుకోవాలి. రెండు ఒత్తిని తీసుకొని వాటిని ఒక దగ్గర కలిపి దీపాన్ని వెలిగించండి. దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపుల్లలతో దీపాన్ని వెలిగించి, అగరవత్తితో వెలిగించడం మంచిది. అగరువత్తికి కూడా కుంకుమ బొట్టు పెట్టి వెలిగించండి. ఈ దీపాన్ని మీ మనస్సులో లక్ష్మీ అమ్మవారు స్వరూపంగా భావించుకొని మూడు వైపులా కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరించండి. ఏ పువ్వులు అందుబాటులో ఉంటే ఆ పువ్వుల ను తెచ్చి దీపానికి ఇత్తడి ప్లేట్ కు అలంకరించండి. ఈ విధంగా దీపం వెలిగించి మనస్ఫూర్తిగా నమ్మకంతో శ్రద్ధగా మనసులో ఉన్న బాధ చెప్పుకుంటారు. ఇలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి ఆర్థిక సమస్య లేకుండా దూరమవుతాయి. అమ్మవారు మనల్ని ఈ విధంగా అనుగ్రహిస్తుంది. ఈ ఉప్పు దీపం వెలిగించడం వల్ల చాలామంది అనేక రకాల దోషాల నుంచి బయట పడతారు. సమస్యలు బాధలు తీరుతాయి. మంచి అద్భుతమైన పరిష్కారం. ఈ దీపాన్ని వెలిగించడం శుక్రవారం మంచిది. రోజు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో వెలిగించడం మొదలు పెట్టండి. ఈ దీపం వెలిగించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి, దారిద్ర్యం నుంచి అనేక రకాల బాధల నుంచి సమస్యల నుంచి బయటపడతారు. ఇది అన్నింటికీ చక్కటి పరిష్కారం ఇన్ని రోజులు అని నియమం ఏది ఉండదు. మనకు వీలైనప్పుడు వీలైనన్ని రోజులు వెలిగించవచ్చు. మగవారైనా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఈ దీపాన్ని ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో వెలిగించడం మంచిది. ఎందుకంటే అప్పుడు దేవతలు విహరిస్తుంటారు. ఈ ఉప్పు శుక్రవారం రోజు మొదలు పెట్టినప్పుడు దీపాన్ని తిరిగి మళ్లీ శుక్రవారం రోజు ఉప్పును మార్చాలి. ఈ తీసేసిన ఉప్పును ఎవరూ తొక్కని ప్రాంతంలో లేదా గిన్నెలో పోసి నీళ్లు పోయడం మంచిది. ఇప్పుడు ఈ ఉప్పు ప్రమిదను శుభ్రం చేసి ఇ మళ్లీ ఇంతకు ముందు లాగే అలంకరించి బొట్లు పెట్టి మళ్లీ దీపం ప్రమిద పెట్టి వెలిగించడం మొదలుపెట్టాలి. ఈ పై ప్రమిదల ఒత్తులను రోజుకు రోజు మార్చుకుంటూ కొత్త వత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. ఈ విధంగా వెలిగించడం వల్ల లక్ష్మీ అమ్మవారు నిలుస్తుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో గృహంలో విద్యలో ఉన్న కష్టాలన్నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు లక్ష్మీ అమ్మవారిని పూజించండి.
చదవాల్సిన శ్లోకాలు
‘’నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి, సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే’’ అని మనసులో తలచుకోండి.
‘’దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్ధన
దీపేన హరతే పాపం త్రికాల సంధ్య నమోస్తుతే’’ అని అనుకుంటూ దీపాన్ని వెలిగించండి.

Latest News

Related News