సోమవతి అమావాస్య ఎం చేయాలి ?

సోమవారం, అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. సోమవతి అమవాస్య 2021 ఏప్రిల్12న వచ్చింది. దీనిని చైత్ర అమావాస్య అని కూడా అంటారు. హిందూధర్మం ప్రకారం సోమవతి అమావాస్య రోజున ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం చేయడం అనేది చాలా ఉత్తమం, విశేషం. సోమవతి అమావాస్య రోజున వారి పెద్దలను పూజించడం ద్వారా ఇంట్లో సంతోషం, ఆరోగ్యం లభిస్తాయని పూర్వీకుల నమ్మకం. ఈరోజు చేయకూడని పనులు.. సోమవతి అమవాస్య రోజున నదిలో స్నానం చేసిన తరువాత తమ […].

By: riyareddy

Updated On - Thu - 22 April 21

సోమవతి అమావాస్య ఎం చేయాలి ?

సోమవారం, అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. సోమవతి అమవాస్య 2021 ఏప్రిల్12న వచ్చింది. దీనిని చైత్ర అమావాస్య అని కూడా అంటారు. హిందూధర్మం ప్రకారం సోమవతి అమావాస్య రోజున ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం చేయడం అనేది చాలా ఉత్తమం, విశేషం. సోమవతి అమావాస్య రోజున వారి పెద్దలను పూజించడం ద్వారా ఇంట్లో సంతోషం, ఆరోగ్యం లభిస్తాయని పూర్వీకుల నమ్మకం.

devotional news in telugu

devotional news in telugu

ఈరోజు చేయకూడని పనులు..

సోమవతి అమవాస్య రోజున నదిలో స్నానం చేసిన తరువాత తమ పెద్దలను, పితృదేవతలను పూజించాలి. పేదవారికి ధానధర్మాలు చేయడం చేయాలి. ఈరోజు జీవ హింస చేయకూడదు. శాంతియుతంగా ఈరోజును గడపాలి. కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.

శివాభిషేకం విశేష ఫలితాలు !

సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ప్రాతఃకాలంలో తలస్నానం చేసి శివుడికి పంచామృతాలతోనూ, గంగాజలంతో లేదా శుద్ధ జలంతో అభిషేకించాలి. తర్వాత శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో ఆరాధన చేయాలి. సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం. వీలు కుదరకపోతే కనీసం శివపంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల పితృదోషాలు, పోతాయి. అదేవిధంగా ఆరోగ్యం, ఐశ్యర్యం లభిస్తాయి.

Latest News

Related News