హిందువులు 108 సంఖ్యకు ఎందుకంత ప్రాధాన్యం ఇస్తారు ?

సనాతనధర్మం హిందూమతానికి మూలం. దీనిలో అనేక రహస్యాలను, విశ్వవిశేషాలను పేర్కొన్నారు. దీనిలో 108 సంఖ్య గురించి తెలుసుకుందాం.. ఈ సంఖ్యకు ఎందుకీ ఇంతటి ప్రాధాన్యం..? అని పరిశీలిస్తే.. మన ప్రాచీన రుషులు, మునులు గొప్ప ఖగోళ, గణాంకవేత్తలు. ప్రస్తుతం మనం వాడుతున్నసంఖ్యా వ్యవస్థను అందించినది వారే.ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న 108 సంఖ్యకు ప్రాధాన్యాన్ని వారే సంతరించి పెట్టారు. అసలు సంఖ్యలన్ని 0-9 వరకే. ఎంత పెద్ద సంఖ్య అయినా వీటి నుంచే వస్తుంది. 108 సంఖ్యను పరిశీలిస్తే.. […].

By: riyareddy

Published Date - Sat - 24 April 21

హిందువులు 108 సంఖ్యకు ఎందుకంత ప్రాధాన్యం ఇస్తారు ?

సనాతనధర్మం హిందూమతానికి మూలం. దీనిలో అనేక రహస్యాలను, విశ్వవిశేషాలను పేర్కొన్నారు. దీనిలో 108 సంఖ్య గురించి తెలుసుకుందాం.. ఈ సంఖ్యకు ఎందుకీ ఇంతటి ప్రాధాన్యం..? అని పరిశీలిస్తే.. మన ప్రాచీన రుషులు, మునులు గొప్ప ఖగోళ, గణాంకవేత్తలు. ప్రస్తుతం మనం వాడుతున్నసంఖ్యా వ్యవస్థను అందించినది వారే.ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న 108 సంఖ్యకు ప్రాధాన్యాన్ని వారే సంతరించి పెట్టారు. అసలు సంఖ్యలన్ని 0-9 వరకే. ఎంత పెద్ద సంఖ్య అయినా వీటి నుంచే వస్తుంది. 108 సంఖ్యను పరిశీలిస్తే.. 1+0+8=9. ఈ తొమ్మిది సంఖ్యకు పరిపూర్ణత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఏ సంఖ్యను 9 సార్లు హెచ్చించి, కూడినా వచ్చే సంఖ్య తొమ్మిదే. 27 నక్షత్రాలలో ఒక్కోదానికి నాలుగు పాదాలుంటాయి. 27 నక్షత్రాలు అగ్ని, భూమి, గాలి, నీరు అనే నాలుగు అంశాలపై విస్తరించి వుంటాయి. అంటే 27 x 4 = 108. తొమ్మిది గ్రహాలు 12 రాశుల ద్వారా ప్రయాణిస్తాయి. వాటిని గుణించగా అంటే 9 x 12 = 108 వస్తుంది.


ప్రతి దేవుడికి అష్టోతర నామాలను చదువుతాం. ఈ నామాలను చదవడం వల్ల మీమీ నక్షత్రాలకు సంబంధించిన దోషాలు, రాశులకు సంబంధించిన దోషాలు పోవడానికి వీటిని చదువుతారు. అంతేకాదు అందరూ నిత్యం చేసుకునే జపంలో వాడే జపమాల కూడా 108. జపసంఖ్యకు కూడా ప్రధానంగా ఈ సంఖ్యను వాడుతారు. సహస్రం చేసినా, లక్ష జపం చేసినా దానికి ప్రారంభం 108 మాల దగ్గర నుంచే. ఇలా ప్రతి ఒక్క ఆధ్యాత్మిక విషయానికి మూలమైన సంఖ్యగా, విశేషమైనదిగా దీన్ని భావిస్తారు.

Related News