కన్ను అదిరితే శకునాలు మీకు తెలుసా…?

శకునాలు… సాధారణంగా మానవులు అనేక రకాల శకునాలను నమ్ముతారు. ప్రయాణ సమయం, కొత్త పనులు ప్రారంభించడానికి ముందు శకునాలను పాటించేవారు నేటికి అనేక మంది ఉన్నారు. ఇలాంటి వాటిలో కన్ను అదరడం కూడా ఒక శకునం. ప్రస్తుతం కన్నుకు సంబంధించిన శకునం గురించి తెలుసుకుందాం…. అరోగ్యవంతులైన మానవ శరీరంలో అదరడం అనేది కొన్నిశకునాలకు సూచనగా పేర్కొంటారు. వీటికి సంబంధించిన అనేక అంశాలను పలు పురాణాలలో పేర్కొన్నారు. మానవులకు కన్ను అదరడం సాధారణమే. ఒక్కోసారి కుడికన్ను, ఒక్కోసారి ఎడమ […].

By: riyareddy

Published Date - Sat - 1 May 21

కన్ను అదిరితే శకునాలు మీకు తెలుసా…?

శకునాలు… సాధారణంగా మానవులు అనేక రకాల శకునాలను నమ్ముతారు. ప్రయాణ సమయం, కొత్త పనులు ప్రారంభించడానికి ముందు శకునాలను పాటించేవారు నేటికి అనేక మంది ఉన్నారు. ఇలాంటి వాటిలో కన్ను అదరడం కూడా ఒక శకునం. ప్రస్తుతం కన్నుకు సంబంధించిన శకునం గురించి తెలుసుకుందాం….
అరోగ్యవంతులైన మానవ శరీరంలో అదరడం అనేది కొన్నిశకునాలకు సూచనగా పేర్కొంటారు. వీటికి సంబంధించిన అనేక అంశాలను పలు పురాణాలలో పేర్కొన్నారు. మానవులకు కన్ను అదరడం సాధారణమే. ఒక్కోసారి కుడికన్ను, ఒక్కోసారి ఎడమ కన్ను అదురుతూ ఉంటుంది. సాధారణంగా కన్ను అదరడం గురించి చాలామంది పట్టించుకోరు ఇది శాస్త్రీయమా కాదా అనేది పక్కనబెడితే పూర్వకాలం నుంచి ఇదొక విశ్వాసంగా వస్తుంది. ఇది చాలా సందర్భాలలో నిజం కావడం కూడా జరిగిందని పలువురు పేర్కొంటున్నారు. పురుషులకు ఎడమ కన్ను.. మహిళలకు కుడి కన్ను అదరడం మంచిదికాదు అని పెద్దలు చెప్తారు. మహిళలకు కుడి కన్ను అదరగానే ఏదో కీడు జరగుతుందని మహిళలు ఆందోళన చెందుతారు.

రావణుడు అపహరించడానికి ముందు సీతమ్మవారికి కూడా కుడి కన్ను అదిరినట్టు కొన్ని ఆధ్యాత్మిక గ్రంధాలలో పేర్కొన్నాయి. పురుషునికి కుడి కన్ను, స్త్రీకి ఎడమ కన్ను అదిరితే మంచిది. పురుషునికి ఎడమకన్ను, స్త్రీకి కుడి కన్ను అదిరితే కీడు కలుగుతుంది. అదేవిధంగా స్త్రీ, పురుషులకు రెండు కన్నులు ఒకే సారి ఇద్దరికి శుభ6సూచకం. కింది పెదవి భాగం అదిరితే.. భోజన సౌఖ్యం, గడ్డం అదిరితే.. లాభం, ఇతరుల ద్వారా సహాయ సహకారాలు అందుతాయి. ఇక కుడి చెక్కిలి అదిరితే.. ధనప్రాప్తి, ఎడమచెక్కిలి అదిరితే.. చోర బాధలు, కుడి భుజం అదిరితే భోగ సంపదలు.. వంటి ఫలితాలుంటాయి. ఎడమ భుజం అదిరితే కష్టాలు ఎదురవుతాయి. రొమ్ము అదిరితే.. ధనలాభం, ధైర్యం, అరచేయి అదిరితే.. సంతాన ప్రాప్తి, గౌరవం కలుగుతుంది. కన్ను అదరడం గురించి కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాలలో రకరకాల నమ్మకాలు ఉన్నాయి. చైనా, హవాయి వంటి దేశాలలో దీనిపై రకరకాల విశ్వాసాలు ఉన్నాయి.

Latest News

Related News