దీపారాధన ఏలా చేస్తే సంపదలు మీ సొంతం ?

దీపం… జ్ఞానానికి ప్రతీక. సకల సంపదలకు దీపం ప్రతీక. సనాతన ధర్మంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యం ఇస్తారు. అయితే చాలామందికి దీపారాధన పై అనేక సందేహాలు. దీనితోపాటు ఏలా దీపారాధన చేస్తే సంపదలు మీ సొంతం అవుతాయో తెలుసుకుందాం…. ఎన్నివత్తులతో వెలిగించాలి ? దీపం ఎన్ని వత్తులతో వెలిగించాలో ప్రమాణం తెలుసుకుందాం.. ‘‘సాజ్యం త్రీవర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహా’’ అంటే మూడు వత్తులు కూడుకున్నది వాహిని నా యోజితం […].

By: riyareddy

Published Date - Sat - 17 April 21

దీపారాధన ఏలా చేస్తే సంపదలు మీ సొంతం ?

దీపం… జ్ఞానానికి ప్రతీక. సకల సంపదలకు దీపం ప్రతీక. సనాతన ధర్మంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యం ఇస్తారు. అయితే చాలామందికి దీపారాధన పై అనేక సందేహాలు. దీనితోపాటు ఏలా దీపారాధన చేస్తే సంపదలు మీ సొంతం అవుతాయో తెలుసుకుందాం….

ఎన్నివత్తులతో వెలిగించాలి ?

దీపం ఎన్ని వత్తులతో వెలిగించాలో ప్రమాణం తెలుసుకుందాం.. ‘‘సాజ్యం త్రీవర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహా’’ అంటే మూడు వత్తులు కూడుకున్నది వాహిని నా యోజితం మయా అంటే నా చేత అగ్నితో వెలిగించ దగినది. త్రైలోక్యం తిమిరాపహం నేను వెలిగించిన ఈ దీపం మూడు లోకాల్లో చీకటిని పోగొడుతుందని అర్థం. నాలో ఉన్న త్రిగుణాలుగాని అంటే రజోగుణం, తమోగుణం, సత్వగుణాలు.
వత్తులు సాధారణంగా.. రెండు రకాల వత్తులు ఉంటాయి. అవి అడ్డ వత్తులు నిలువు వత్తులు, నిలువు వత్తులు అంటే పువ్వు ఒత్తులు అంటే మొగ్గల్లా ఉంటాయి. తూర్పు దిక్కు వత్తులు వేసి దీపం వెలిగిస్తే సంపద, యశస్సు పెరుగుతుంది. ఉత్తరం దిక్కు వత్తులు వేసి వెలిగించి ఆరోగ్యం ఆర్థిక సంపద మెరుగుపడుతుంది. లక్ష్మీదేవి మన గృహంలో నిలుస్తుంది. ఒక వత్తిని వేయడం అశుభం సమయంలోనే వేస్తారు. ఈ రోజు దీపం వెలిగించేటప్పుడు రెండు లేదా మూడు వత్తులు వేయడం మంచిది. ఆ దీపాన్ని అగరవత్తితో గాని, కై ఒత్తి అంటే చిన్న పిల్లలకు పత్తిని చుట్టి నెయ్యిలో గాని, నూనెలోగాని ముంచి దీపాన్ని వెలిగిస్తారు. ఇది ఉత్తమం, అగరవత్తితో మధ్యమం. అగ్గిపుల్లతో వెలిగించడం అధమం. ఇత్తడి ప్రమిదలోని దీపం వెలిగించడం మంచిది లేదా వెండి ప్రమిదలో వెలిగించడం మంచిది. స్టీల్ ప్రమిద పనికిరాదు. ఈ దీపాన్ని ప్రతిరోజు ఏ ఇంట్లో అయితే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయము నందు వెలిగించినచో ఆ గృహంలో లక్ష్మీదేవి కొలువుంటుంది. దీపం వెలిగించేటప్పుడు మన దుస్తులు శుచి, శుభ్రత కలిగి ఉండడం మంచిది. దీపాన్ని వెలిగించే సమయంలో మనస్సు దైవ నామ స్మరణతో కూడుకొని ఉండటం మంచిది. ఈ దీపం వెలిగించడమే ఎన్నో పూజలు చేసిన విలువ ఈ ఒక్క దీపారాధనతో వస్తుంది.
దీపం వెలిగించేటప్పుడు చదువాల్సిన శ్లోకం:
‘‘దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్ధన
దీపేన హరతే పాపం ప్రాత సంధ్యా దీపం నమోస్తుతే’’
ఇక దిశల విషయానికి వస్తే దక్షిణం వైపు పెట్టే దీపం అశుభానికి సంకేతం. బేసి సంఖ్యలో ఒత్తులు వేయడం మంచిది 5 లేదా 9 వేయవచ్చు. పగిలి పత్తి వత్తులు మంచివి దీపాన్ని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె తో వెలిగించడం మంచిది. ఆవు నెయ్యితో ప్రతి రోజు దీపం పెట్టడం వల్ల కుటుంబ అభివృద్ధి చాలా మంచింది.

Latest News

Related News