చైత్రమాస విశేసాలు ఇవే !

తెలుగు మాసాలలో మొదటి మాసం చైత్రమాసం. ఈ మాసంలో వచ్చే విశేషాల గురించి తెలుసుకుందాం.. • చాంద్రమానంలో మొదటి మాసం చైత్ర మాసం. దీనిని మధుమాసం, వసంత మాసం అని కూడా పిలుస్తారు. ఋతువులలో మొదటిదైన వసంత ఋతువు ఈ మాసంతో ప్రారంభం అవుతుంది. శిశిర ఋతువులో ఆకులూ రాల్చే చెట్లు అన్ని చైత్రంలో చిగురిస్తాయి. అందుకే ఈ మాసాన్ని నవ చైతన్యానికి ప్రతీకగా చెబుతారు. ఈ మాసంలో వసంతానవరాత్రులు, శ్రీరామనవమి నవరాత్రులను ఆచరిస్తారు. • సూర్యుడు […].

By: riyareddy

Published Date - Sun - 18 April 21

చైత్రమాస విశేసాలు ఇవే !

తెలుగు మాసాలలో మొదటి మాసం చైత్రమాసం. ఈ మాసంలో వచ్చే విశేషాల గురించి తెలుసుకుందాం..
• చాంద్రమానంలో మొదటి మాసం చైత్ర మాసం. దీనిని మధుమాసం, వసంత మాసం అని కూడా పిలుస్తారు. ఋతువులలో మొదటిదైన వసంత ఋతువు ఈ మాసంతో ప్రారంభం అవుతుంది. శిశిర ఋతువులో ఆకులూ రాల్చే చెట్లు అన్ని చైత్రంలో చిగురిస్తాయి. అందుకే ఈ మాసాన్ని నవ చైతన్యానికి ప్రతీకగా చెబుతారు. ఈ మాసంలో వసంతానవరాత్రులు, శ్రీరామనవమి నవరాత్రులను ఆచరిస్తారు.


• సూర్యుడు కుంభరాశి నుండి మీనరాశి లోకి ప్రవేశిస్తాడు. దీనిని మీనసంక్రమణం అన్ని అంటారు. ఈ సంక్రమణం తరువాత ఉండే పదహారు ఘడియల కాలం ఎంతో పుణ్యకాలంగా చెప్పబడింది. ఈ నెల మొదటి రోజు నుండి మూడు, నాలుగు నెలలపాటు చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీటిని వితరణ చేయడం పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఇలా చేయడం వల్ల గొప్ప పుణ్యఫలం వస్తుంది.
చైత్రమాసంలో వచ్చే పండుగలు
– చైత్రశుద్ధ పాడ్యమి- ఉగాది,
– విదియ – అరుంధతీ వ్రతం, సౌభాగ్య గౌరీ వ్రతం
– తదియ – శివడోలోత్సవం,
– చవితి – గణేష దమనపూజ
– పంచమి –కూర్మకల్పం ప్రారంభం
– షష్టి- స్కంద షష్టి (కొన్నిప్రాంతాలలో ఆచరిస్తారు)
– సప్తమి- సూర్య దమనపూజ
– అష్టమి – భవానీ అష్టమి, అశోకాష్టమి
– నవమి – శ్రీరామనవమి, శ్రీసీతారామ కళ్యాణోత్సవం
– దశమి- ధర్మరాజదశమి
– ఏకాదశి- కామదైకాదశి, రుక్మిణీ పూజ
– చైత్రపూర్ణిమ – హనుమజ్జయంతి
– బహుళ పంచమి – మత్స్యజయంతి
– బహుళ త్రయోదశి- వరాహజయంతి
– అమావాస్య – మేష సంక్రాంతి
– ఇలా అనేక విశేషాలతో ఈ మాసం పూర్తవుతుంది.

Latest News

Related News