Shakuni Temple: శకుని మామ హీరోనా.? విలనా.? గుడి కట్టేసిన భక్తులున్నారు తెలుసా.?

Shakuni Temple: మహా భారతంలో  పాండవులు, కౌరవులు, శ్రీ క్రిష్ణుడుతో పాటు, అతి కీలకంగా చెప్పుకునే మరో పాత్ర ‘శకుని’. శకుని మామ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు పాండవులు, కౌరవులు.  కౌరవుల తల్లి అయిన గాంధారికి చిట్ట చివరి అన్నయ్యే శకుని. అలా కౌరవ, పాండవులకు మేనమామ ఆయన. సరే, ఇంతకీ శకుని గురించి ఏం తెలుసు.? అంటే, ఛటుక్కున కొన్ని విషయాలు చెప్పేయగలం. ఆయన పాచికలాటలో సిద్ధ హస్తుడు. ఆయన పాచిక వేస్తే అంతే సంగతి.. […].

By: jyothi

Published Date - Mon - 6 September 21

Shakuni Temple: శకుని మామ హీరోనా.? విలనా.?  గుడి కట్టేసిన భక్తులున్నారు తెలుసా.?

Shakuni Temple: మహా భారతంలో  పాండవులు, కౌరవులు, శ్రీ క్రిష్ణుడుతో పాటు, అతి కీలకంగా చెప్పుకునే మరో పాత్ర ‘శకుని’. శకుని మామ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు పాండవులు, కౌరవులు.  కౌరవుల తల్లి అయిన గాంధారికి చిట్ట చివరి అన్నయ్యే శకుని. అలా కౌరవ, పాండవులకు మేనమామ ఆయన. సరే, ఇంతకీ శకుని గురించి ఏం తెలుసు.? అంటే, ఛటుక్కున కొన్ని విషయాలు చెప్పేయగలం. ఆయన పాచికలాటలో సిద్ధ హస్తుడు. ఆయన పాచిక వేస్తే అంతే సంగతి.. అంతేకాదు, జూదంలోనూ మంచి హస్తవాసి గలవాడు. ఆయన కౌరవుల పక్షపాతి. శకుని కారణంగానే పాండవులు, కౌరవుల చేతిలో జూదంలో ఓడిపోయి అడవుల పాలయ్యారు.. ఇలాంటి విసయాలను ఎంతో సులభంగా చెప్పేస్తాం కదా.. అసలు శకుని ఎవరి పక్షపాతి.? ఆయన మోటో ఏంటీ.? తెలుసుకోవాలంటే, శకుని గురించి నికార్సయిన కొన్ని నిజాలు తెలుసుకోవాలి.

గాంధార వంశానికి చెందిన వాడు శకుని. ఆయనకూ కౌరవుల మాదిరి నూరు మంది అన్నదమ్ములున్నారు. ఒకే ఒక్క చెల్లెలు.. ఆమెనే గాంధారి. ధ్రుతరాష్ర్టుడి భార్య. చెల్లెలంటే ఎంతో ప్రేమున్న శకుని, ఆమె కోసమే బావ ధ్రుత రాష్ర్ఠుడి పక్కన చేరి, కురుక్షేత్ర యుద్ధానికి నాంది, ప్రస్థావన రచిస్తాడు.. అనుకుంటాం కదా.

నూరు మెతుకులు తిని  బతికిన శకుని..

గాంధారికి కుజ దోషం ఉండడంతో, ఆమెకు ఓ గొర్రెతో వివాహం చేసి, దాన్ని చంపేస్తారు. ఆ విషయం దాచి పెట్టి ధ్రుతరాష్ర్టుడికిచ్చి వివాహం చేస్తారు. కొంతకాలానికి ఆ నిజం తెలుసుకున్న ధ్రుతరాష్ర్టుడు , గాంధారి తండ్రి, శకునితో సహా, అతని నూరు మంది అన్నదమ్ములనూ కారాగారంలో బంధించి, రోజుకొక్క అన్నం మెతుకు ఇచ్చి చంపేయాలని శిక్ష విధిస్తాడు. అలా కురు వంశంపై పగ పెంచుకున్న గాంధారులు ఎలాగైనా ఆ పగ తీర్చుకోవాలనీ, కురు వంశ  నాశనం చూడాలని అనుకుంటారు. కానీ, ఎలా.? రోజుకొక్క అన్నం మెతుకు తిని ఎలా బతికి బట్ట కట్టేది.? పగ తీర్చుకునేది.? అందుకే, వారు ఓ ఉపాయానికి వస్తారు. వారందరిలోనూ మిక్కిలి తెలివైనోడు, రాజ నీతి, కుతంత్రాలు తెలిసినవాడైన శకునిని ఒక్కడినే బతికించాలనీ, తమ అందరి నూరు అన్నం మెతుకులనూ శకునికి ఒక్కడికే పెట్టి అతన్ని బతికిస్తారు.. అన్నదమ్ములు చనిపోతూ, శకునికి తమ పగ గుర్తుండేలా కాళ్లు విరగ్గొట్టేస్తారు. తండ్రి చనిపోతూ, తన వెన్నెముకను పాచికలుగా తయారు చేసి ఇస్తాడు. శకుని ఏది అనుకుంటే, అలాగే పడేలా ఆ పాచికలను తయారు చేస్తాడు.

కురు వంశంపై పగ తీర్చుకున్న శకుని..

జైలు శిక్ష అనంతరం తన రాజ్యానికి తిరిగి పోనని, తన నూరు మంది మేనల్లుళ్లకూ సేవ చేసుకుంటూ, అక్కడే ఉండిపోతానని చెబుతాడు శకుని. అందుకు అంగీకరించిన ధ్రుతరాష్ర్టుడు అప్పటి నుండి శకుని  మాటలు వింటూ, అతనికి తగ్గట్టుగా నడుచుకుంటూ, పాండవులను దెబ్బ తీయాలనుకుంటారు కౌరవులు. కానీ, కౌరవులకు అర్ధం కాని విషయం .. శకుని టార్గెట్ పాండవులు మాత్రమే  కాదు, మొత్తం కురు వంశమే. అలా తన బుద్ధి బలం ఉపయోగించి,  పాండవులను వనవాసానికి పంపిస్తాడు. కౌరవులను రెచ్చగొట్టి, కురుక్షేత్ర యుద్ధానికి ప్రేరేపిస్తాడు శకుని. శకునికి ఉన్న బలం.. ఎదుటి వారి బల, బలహీనతల్ని ముందుగానే పసిగట్టడం. కౌరవులు బలహీనతల్ని ఆసరాగా తీసుకుని, పాండవులను కష్టాల పాలు చేశాడు. అపారమైన తన తెలివితేటలు, రాజకీయ ఎత్తుగడలనూ కేవలం కుళ్లు, కుతంత్రాల కోసమే వాడి చరిత్రలో విలన్ గా నిలిచిపోయాడు శకుని. పాండవుల్లో చివరి వాడైన  సహదేవుని చేతుల్లో శకుని మరణం సంభవించింది. తుది శ్వాస విడిచే సమయంలో తాను చేసిన అకృత్యాలనన్నింటినీ సహదేవునికి చెప్పి చనిపోతాడు శకుని. అలా మహాభారతంలోని ప్రతీ ఒక్కరూ శకుని విలనిజం కారణంగా బాధపడినవారే. ఒక్క శ్రీ కృష్నుడు జోలికి మాత్రం పోలేదు శకుని. ఆయన సాక్ష్యాత్తూ విష్ణు మూర్తి స్వరూపమని శకునికి ముందే తెలుసు. అందుకే ఆయనను ఎప్పుడూ గౌరవ ప్రదంగానే భావించేవాడు శకుని. మహాభారత ఘట్టానికి శకుని విలన్ అయినా ఆయననూ దేవుడిగా కొలిచేవారు లేకపోలేదు.

 

కేరళ రాష్ర్టంలోని కొల్లం అనే జిల్లాలో పవిత్రేశ్వరం అనే ఊరులో శకుని దేవునిగా కొలుస్తారట.  కురవర్ తెగకు చెందిన ఓ గిరిజన జాతి శకునికి గుడి కట్టి, ఆయనను దేవుడిగా కొలుస్తున్నారనిట. నిజంగా ఇది నమ్మలేని నిజమే కదా.. కానీ, నమ్మి తీరాల్సిందే. ఆధారాలున్నాయి కాబట్టి.

 

Latest News

Related News