Ulte Hanuman: ఉల్టా హనుమాన్: తలకిందులుగా ఉన్న హనుమంతుడు ఎక్కడున్నాడో తెలుసా.?

Ulte Hanuman: అదేంటీ.. తలకిందులుగా ఉన్న హనుమంతుడా.? విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా.? అవునండీ, ఆ విచిత్రం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఉజ్జయినిలో ఈ తలకిందులు ఆంజనేయ స్వామి విశేషమైన పూజలందుకుంటున్నాడు. అసలెందుకు ఇక్కడ హనుమంతుడు తలకిందులుగా ఉన్నాడు.? ఆ స్థల పురాణ విశిష్టత ఏంతో తెలుసుకుందాం పదండి. ఉజ్జయినికి 15 కి.మీ దూరంలో ఉన్న తాన్వార్ అను ఊరిలో ఈ ఆంజనేయ స్వామి ఉన్నాడు. తలకిందులుగా ఉండడం వల్ల ఈ  ఆంజనేయ స్వామిని ఉల్టే ఆంజనేయ […].

By: jyothi

Published Date - Sun - 12 September 21

Ulte Hanuman: ఉల్టా హనుమాన్: తలకిందులుగా ఉన్న హనుమంతుడు ఎక్కడున్నాడో తెలుసా.?

Ulte Hanuman: అదేంటీ.. తలకిందులుగా ఉన్న హనుమంతుడా.? విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా.? అవునండీ, ఆ విచిత్రం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఉజ్జయినిలో ఈ తలకిందులు ఆంజనేయ స్వామి విశేషమైన పూజలందుకుంటున్నాడు. అసలెందుకు ఇక్కడ హనుమంతుడు తలకిందులుగా ఉన్నాడు.? ఆ స్థల పురాణ విశిష్టత ఏంతో తెలుసుకుందాం పదండి.

ఉజ్జయినికి 15 కి.మీ దూరంలో ఉన్న తాన్వార్ అను ఊరిలో ఈ ఆంజనేయ స్వామి ఉన్నాడు. తలకిందులుగా ఉండడం వల్ల ఈ  ఆంజనేయ స్వామిని ఉల్టే ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. అతి పురాతనమైన చర్రిత ఉంది ఈ ఆలయానికి. ఈ ఆలయం రామాయణ కాలం నాటిదని చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో పలువురు  మహర్షుల  మందిరాలు కూడా ఉన్నాయి.  1200 సంవత్సరాలుగా ఇక్కడి ఆంజనేయ స్వామితో పాటు, ఈ మహా రుషులు కూడా పూజలందుకుంటున్నారట.

అసలెందుకు హనుమంతుడు ఇక్కడ ఉల్టాగా ఉన్నాడు.?

 

హనుమంతుడు పాతాళ లోకానికి వెళ్లినందుకు నిదర్శనంగా ఈ ఆలయంలో హనుమాన్ విగ్రహం ఉల్టాగా ప్రతిష్టించబడిందట.

 

త్రేతా యుగంలో రామ రావణ సంగ్రామం జరుగుతున్న సమయంలో రామ, లక్ష్మణులు చాలా కష్టాలు పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హనుమంతుడు తన వానర సేనతో రామునికి అండగా ఉన్నాడు. అనుక్షణం రామునికి తోడు నీడగా ఉన్నాడు. అయినా, రావణుడి కపట వేషాలు ఏదో ఒక రూపంలో రాముడిని వెంటాడుతూనే ఉండేవి. అందులో భాగంగానే ఒక రోజు రావణాసురుడి మేనమామ రామ, లక్ష్మణులను మాయ చేసి, పాతాళ లోకంలో పడేసిన ఘటన ఒకటి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి.

రావణాసురుడు మేనమామకు తంత్ర విధ్యలు బాగా తెలుసు. ఆ మాయలతోనే  వానర వేషం ధరించి, వానర సేనలో కలిసిపోయాడు. అలా వానరుడిగా మారిన ఆయన అందరూ నిద్రించిన సమయం చూసుకుని, అర్ధరాత్రి సమయంలో రామ లక్ష్మణులను అపహరించి, పాతాళ లోకంలో పడవేస్తాడు. లేచి చూసేసరికి తన స్వామి కనిపించకపోవడంతో, హనుమంతుడికి అనుమానం వస్తుంది. ఏం జరిగిందని ఆరా తీయగా, అసలు విషయం తెలుసుకున్న హనుమంతుడు పాతాళ లోకానికి బయలుదేరుతాడు. పాతాళ లోకానికి వెళ్లేటప్పుడు హనుమంతుడు తలకిందులుగా వెళ్లాల్సి వుంటుంది. అంటే, తలభాగం కిందికి, కాళ్లు పైకి ఉంటాయి. ఆ భంగిమలోనే పాతాళ లోకం నుండి, రామ లక్ష్మణులను తిరిగి తీసుకొస్తాడు హనుమంతుడు. అందుకు నిదర్శనంగానే ఈ ప్రాంతంలో హనుమంతుడి విగ్రహం తల కిందులుగా ఉంటుందని అక్కడి స్థల పురాణం చెబుతోంది.

 

చాలా చోట్ల చాలా హనుమంతుల విగ్రహాలు చూశాం కానీ, ఈ తరహాలో ఉల్టాగా ఉన్న హనుమ విగ్రహాం గురించి ఎక్కడా వినలేదు కదా. అందుకే ఈ ఉజ్జయిని వాయు పుత్రుడు అంత విశిష్టమైనవాడు. ఇక్కడ హనుమంతుడి తల భాగం మాత్రమే ఉంటుంది. అది కూడా ఉల్టాగా. ఉల్టాగా ఉన్న హనుమంతుడి రూపం నిండుగా సింధూరంతో కప్పి ఉంచుతారు. ఈ హనుమంతుడిని వారంలో కనీసం మూడు సార్లు దర్శించుకుంటే, శరీరంలో సరికొత్త ఉత్సాహం నిండుతుందని అక్కడి భక్తులు విశ్వసిస్తారు.

అంతకాదు, ఈ హనుమంతుడు చాలా శక్తివంతమైన వాడని ఇక్కడి భక్తులు చెబుతుంటారు. ఎవరైనా మూడు లేదా ఐదు మంగళవారాలు స్వామి వారిని దర్శించి, ఎర్రటి గుడ్డను సమర్పించి పూజలు చేస్తే, వారు అనుకున్న ఎలాంటి కోరికలు అయినా నెరవేరుతాయట. అదీ ఈ ఉల్టా వాయు పుత్రుని విశిష్టత.

Latest News

Related News