Shiva Lingam: అది వేయి సంవత్సరాల కిందటి గుడి. అంతేకాదు అతిపెద్ద శివలింగం ఉన్న గుడి భారతదేశంలోనే ఉంది. ప్రపంచంలో అతిపెద్దదైన శివలింగాలలో ఇది ఒకటి. అదే మన తంజావూరులోని బృహదీశ్వరాలయం. అక్కడికి వెళితే ప్రతి అంశం ఓ మిస్టరీతో పాటు ఆశ్ఛర్యానికి లోనవుతాం. ఎక్కడా సిమెంట్ వాడకుండా, ఉక్కు లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీకి మనం ఫిదా అవుతాం. ఈ గుడి మొత్తాన్నికేవలం గ్రానైట్‌తోనే కట్టారు. ఈ ఆలయాన్ని నిర్మించింది రాజరాజచోళ అనే రాజు. ఏనుగుల సహాయంతో ఈ ఆలయాన్నినిర్మించారు. ఆశ్ఛర్యం, ఆసక్తి రేపుతున్న ఆ గుడి గురించి తెలుసుకుందాం..
13 అంతస్థుల ఆలయం
బృహదీశ్వరాలయం 216 అడగుల ఎత్తు, 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం. దాదాపు వేయి సంవత్సరాల క్రితం కట్టిన గుడి. భారతదేశంలో అతి పెద్ద శివలింగం ఉన్న క్షేత్రం. దక్షిణ కాశీగా పేరొందిన ఈ గుడిలో ఎన్నో మిస్టరీలు, వింతలు దాగి ఉన్నాయి. దాదాపుగా ఈ శివలింగం ఎత్తు 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. అక్కడ పెద్ద నంది విగ్రహాన్ని కూడా నిర్మించారు. ఈ విగ్రహం దాదాపుగా 20 టన్నులు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నంది విగ్రహం. ఇంకా ఆశ్ఛర్యకరమైన విశేషమేమంటే ఇది ఏకశిలా విగ్రహం. 2 మీటర్ల ఎత్తు, 2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ ఆలయం నిర్మించడానికి ఎటువంటి ఉక్కు గాని, సిమెంట్ గానీ వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టారు. 13 అంతస్థులు మొత్తం గ్రానైట్ రాయితోనే కట్టారు. 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఈ దేశానికే గర్వకారణం. 13 అంతస్థుల పైన ఎటువంటి వాలు లేకుండా నిలబడటమనేది ఇప్పటికీ అందర్నీ ఆశ్ఛర్యానికి గురి చేస్తుంది. ఎటువంటి బేస్‌మెంట్ లేకుండా, నేలపైనే నిర్మించారు. అంతేగాకుండా 16 ద్వార పాలక విగ్రహాలను కట్టారు. ఈ ఆలయం చుట్టూ 250 శివలింగాలు ఉన్నాయి.
నీడలేని గోపురం
మధ్యాహ్న సమయంలో ఆ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ మాత్రం కనబడుతుంది. కానీ గోపురం నీడ మాత్రం కనబడదు. ఇది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ గోపురాన్నే విమాన గోపురం అంటారు. 80 టన్నుల బరువు కలిగిన ఆ కలశాన్ని అక్కడికి తీసుకెళ్లడమనేదే ఒక వింత. వేద-శాస్త్రజ్ఞులు, రాజుల నైపుణ్యానికి అది ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణం పెద్దగా ఉంటుంది. మనసుకు ఆహ్లాదకరంగా, సువిశాలంగా ఉంటుంది. ఏ గుడిలోనేనా మనం మాట్లడుకుంటే ధ్వని ప్రతిధ్వనిస్తుంది. కానీ అక్కడ మనం మాట్లడుకునే మాటలు మళ్లీ ప్రతిధ్వనించబడవు. అంతటి శబ్ద పరిజ్ఙానంతో ఈ గుడిని నిర్మించారు. ఇక ఆలయం లోపలికి వెళితే అనేక సొరంగ మార్గాలు మనకు కనబడతాయి. ఇవి కొన్ని తంజావూరులో ఉన్న కొన్ని ఆలయాలోకి వెళతాయి. మరికొన్ని మాత్రం మరణానికి దారి తీసే గోతులు కలిగి ఉన్నాయి. అందుకే వాటిని మూసేశారు.
వంపుతో కూడిన రంధ్రాలు
ఇప్పటి టెక్నాలజీకి అంతుపట్టని విషయం ఏంటంటే ఈ గుడికి చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మీ. మీ కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు కనిపించడం. అవి అలా ఎందుకు పెట్టారన్నది మిస్టరీనే. ఈ బృహదీశ్వర ఆలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. అయితే వేయి సంవత్సరాల కిందిటి గుడులు దాదాపు కూలిపోయే స్థితిలో ఉంటాయి. ఈ గుడి మాత్రం చెక్కు చెదరకుండా అద్భుతంగా ఇప్పటికీ నిన్ననో, మొన్ననో కట్టినట్టు కనిపిస్తుంది.