Lord Shiva: శివలింగం ముక్కలై ఎక్కడ పడ్డాయో తెలుసా…?

Lord Shiva: సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగం ముక్కలై 5 ప్రదేశాల్లో పడింది. ఆ 5 క్షేత్రాలే పంచారామాలని అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరొందాయి. అవే తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం, కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, గుంటూరు జిల్లాలోని అమరారామం. అస‌లు జ‌రిగిన క‌థ‌.. క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపం ధరించి సురాసురులకు పంచుతుండ‌గా, పంపకంలో అన్యాయం జరిగిందని రాక్షసులు చెబుతారు.  రాక్ష‌సులు […].

By: jyothi

Published Date - Thu - 2 September 21

Lord Shiva: శివలింగం ముక్కలై ఎక్కడ పడ్డాయో తెలుసా…?

Lord Shiva: సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగం ముక్కలై 5 ప్రదేశాల్లో పడింది. ఆ 5 క్షేత్రాలే పంచారామాలని అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరొందాయి. అవే తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం, కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, గుంటూరు జిల్లాలోని అమరారామం.

అస‌లు జ‌రిగిన క‌థ‌..

క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపం ధరించి సురాసురులకు పంచుతుండ‌గా, పంపకంలో అన్యాయం జరిగిందని రాక్షసులు చెబుతారు.  రాక్ష‌సులు తీవ్రమైన త‌ప‌స్సును చేసి అమృతం కావాల‌ని వ‌రం కోర‌గా శివుడు మెచ్చి వారికి వరమిచ్చాడు. కొత్తగా సంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురి చేస్తారు. దాంతో దేవ‌త‌లు వారు మహాదేవుని శరణువేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి రాక్షసులనూ వారి రాజ్యాన్ని బూడిద చేస్తాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా పిలుస్తారు. ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురులు పూజ చేసిన ఒక పెద్ద లింగం మాత్ర‌మే చెక్కు చెద‌ర‌కుండా ఉన్న‌ది.  దీనిని మ‌హ‌దేవుడు ఐదు ముక్కలుగా చేసి ఐదు వేరు వేరు ప్ర‌దేశాల‌లో వేశాడు. ఆ ముక్క‌లనే పంచారామములు అంటారు.

అమరేశ్వరాలయం

అమ‌రావ‌తిలోని అమరేశ్వరస్వామి దేవాలయం ఉంది. గుంటూరుకు 35 కి.మీ. దూరంలో ఆ దేవాల‌యం ఉంది. ఇక్కడ నెలకొన్న శివలింగాన్ని ఇంద్రుడు నెలకొల్పడు. ఇక్కడ శివునికి అమరేశ్వరుడిగా పూజ‌లు చేస్తారు.

ద్రాక్షారామం

తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారమ ఆల‌యం ఉంది. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించారు. ఆలయ స్తంభాలపై, గోడలపై 800ల‌కు పైగా శాసనాలు ఉన్నాయి.  ఈ దేవాల‌యంలో స్వామి వారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ, క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు కొలువు దీరారు.

నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్యప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మించారు. బాహ్యప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి.  భీమేశ్వర లింగం 2.5 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆలయం మాత్రం రెండో అంతస్తులో ఉంటుంది. అభిషేకాలు పై అంతస్తులో లింగ భాగానికి చేస్తారు.

సోమారామము

పశ్చిమ గోదావరి భీమవరంలోనిఇ గునిపూడిలో సోమారామము ఆల‌యం ఉంది. ఈ దేవాల‌యంలో స్వామివారు సోమేశ్వరుడు (కోటీశ్వరుడు), అమ్మ వారు రాజరాజేశ్వరిగా కొలువై ఉన్నారు. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయమ‌ని కూడా  పిలుస్తారు.  మామూలు రోజుల్లో తెలుపు, నలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజున మాత్రం గోధుమ వర్ణంలోకి మారుతుంది. తిరిగి పౌర్ణమి నాడు యధారూపంలోకి వ‌స్తుంది. ఈ ఆలయం రెండు అంతస్తులతో ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులో, అన్నపూర్ణ దేవి అమ్మవారు పై అంతస్తులో కొలువ‌య్యారు.

కుమారభీమారామము

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపంలో కుమారభీమారామము ఆల‌యం ఉంది. ఈ దేవాల‌యంలో స్వామివారు భీమేశ్వరుడుగానూ, తల్లి బాలా త్రిపుర సుందరిగా కొలువై ఉన్నారు. ఈ దేవాల‌యంలో లింగం 60 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. దీనిని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడు. ఈయనే ద్రాక్ష‌రామ దేవాలయాన్నీ నిర్మించారు. అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే విధంగా ఉంటాయి.

క్షీరారామము

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో క్షీరామ‌ము దేవాయ‌లం ఉంది.  ఈ దేవాల‌యంలో స్వామి వారు రామలింగేశ్వర స్వామి, అమ్మ వారు పార్వతిగా వెలుగొందుతున్నారు. ఈ క్షేత్రంలోని లింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడ‌ని అంద‌రూ చెప్పుకుంటారు.  ఈ ఆల‌య గోపురం తొమ్మిది అంతస్తులతో 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్క‌డ శివ‌లింగం తెల్ల‌గా ఉంటుంది. రెండున్నర అడుగుల ఎత్తు క‌లిగి ఉంటుంది.

Latest News

Related News