Dwaraka Tirumala Real Story: ద్వారకా తిరుమల: చిన్న తిరుపతి పెద్ద కథ తెలుసుకుని తీరాల్సిందే..

Dwaraka Tirumala Real Story: పెద్ద తిరుపతి వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్న మొక్కులు, చిన్న తిరుపతిలో వెంకటేశ్వరస్వామికి చెల్లించుకోవచ్చు. కానీ, చిన్న తిరుపతి వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్న మొక్కులు, కేవలం చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలి. ఇదీ భక్తుల విశ్వాసం. అంతటి ప్రత్యేకత చిన్న తిరుపతికి ఎందుకు వచ్చింది.? అసలు ద్వారకా తిరుమల అనే పేరు ఈ దేవస్థానానికి ఎందుకు వచ్చింది.? ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటి.? తెలుసుకుందాం పదండిక. కలియుగ ప్రత్యక్స దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి.. కోరిన కోర్కెలు నెరవేర్చే […].

By: jyothi

Updated On - Fri - 8 October 21

Dwaraka Tirumala Real Story: ద్వారకా తిరుమల: చిన్న తిరుపతి పెద్ద కథ తెలుసుకుని తీరాల్సిందే..

Dwaraka Tirumala Real Story: పెద్ద తిరుపతి వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్న మొక్కులు, చిన్న తిరుపతిలో వెంకటేశ్వరస్వామికి చెల్లించుకోవచ్చు. కానీ, చిన్న తిరుపతి వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్న మొక్కులు, కేవలం చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలి. ఇదీ భక్తుల విశ్వాసం. అంతటి ప్రత్యేకత చిన్న తిరుపతికి ఎందుకు వచ్చింది.? అసలు ద్వారకా తిరుమల అనే పేరు ఈ దేవస్థానానికి ఎందుకు వచ్చింది.? ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటి.? తెలుసుకుందాం పదండిక.

కలియుగ ప్రత్యక్స దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి..

కోరిన కోర్కెలు నెరవేర్చే కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని కొలుస్తారు భక్తులు.  ఆ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు అనేక వ్యయప్రయాసలకోర్చి తిరుపతి వెళ్ళి, అక్కడి నుంచి తిరుమల కొండపై కొలువు దీరిన వెంకన్నని దర్శించుకుంటాం. అప్పటిదాకా ఎంత శ్రమ పడినా, వెంకటేశ్వరస్వామి నిలువెత్తు విగ్రహాన్ని గర్భ గూడిలో అలా చూస్తూనే ఆ శ్రమ అంతటినీ మర్చిపోతాం. మరి, అలాంటిది.. ఒకే గర్భ గుడిలో వెంకటేశ్వరస్వామి రెండుగా దర్శనమిస్తే.?

రెండు వెంకటేశ్వరస్వామి విగ్రహాల కథ ఇదీ..

స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని తెలుస్తోంది. ద్వారకుడు అనే రుషి, తపస్సు నాచరించి, స్వామివారి పాద సేవను కేరతాడు. ఆ తపస్సుని మెచ్చి, పాదములను పూజించే భాగ్యాన్ని ద్వారకుడికి కల్పిస్తారు వెంకటేశ్వరస్వామి. పై భాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు.. భక్తులు తమకూ వెంకటేశ్వరస్వామి పాద పూజ చేసే అవకాశం కల్పించాలని కోరడంతో, వైఖానసాగమం ప్రకారం స్వయంభువుగా వెలిసిన ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠం పై భాగాన ప్రతిష్టించారని స్థల పురాణం చెబుతోంది.

వెంకటేశ్వరస్వామికి అభిషేకం జరగదిక్కడ.. ఎందుకంటే..

పుట్టలో స్వామివారు వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది. పుట్టలో ఎర్ర చీమలు వుంటాయి. అందుకే, విగ్రహానికి అభిషేకం చేయరు. వెంకటేశ్వరస్వామికి అభిషేకం చేయని అరుదైన విషయం ఈ దేవాలయం విషయంలోనే కనిపిస్తుంది. ప్రతి యేడాదీ రెండు కళ్యాణోత్సవాలు వైశాఖ మరియు ఆశ్వయిజ మాసాలలో జరుపుతారు. స్వయంభూమూర్తి వైశాఖ మాసంలో దర్శనమిచ్చినందున ఆ మాసంలోనూ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయిజ మాసంలో ప్రతిష్టించినందున ఆ మాసంలోనూ కళ్యాణోత్సవాలు జరుపడం ఆనవాయితీగా వస్తోంది.

చిన్న తిరుపతి.. ద్వారకా తిరుమల.. ఆ పేరెలా వచ్చింది.?

ఉభయ గోదావరి జిల్లాలే కాదు, చుట్టుపక్కలున్న జిల్లాలకు చెందిన భక్తులు ద్వారకా తిరుమలను చిన్న తిరుపతిగా భావిస్తారు. రాష్ట్రం నలు మూలల నుంచీ, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా చిన్న తిరుపతికి భక్తులు వస్తుంటారు. ద్వారకుడనే రుషి కారణంగా ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చిందని చెబుతారు. దారువు చెట్లు ఎక్కువగా ఇక్కడ వుంటాయి గనుక, ద్వారక అనే పేరు వచ్చిందని కూడా అంటుంటారు.

దాదాపుగా అను నిత్యం రద్దీగానే కనిపిస్తుంది ద్వారకా తిరుమల దేవస్థానం. సంతానం కోరుకునే దంపతులు ఎక్కువగా ఈ దేవస్థానానికి వచ్చి స్వామివారిని వేడుకుంటారు. అలాగే, చాలామంది ఈ దేవస్థాన ప్రాంగణంలో తమ పిల్లలకు వివాహ వేడుకలు నిర్వహిస్తుంటారు.

రైలు లేదా రోడ్డు మార్గంలో ఏలూరుకి చేరుకుంటే, అక్కడి నుంచి ద్వారకా తిరుమలకు వెళ్ళేందుకు రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో వుంటుంది. దగ్గరలో వున్న విమానాశ్రయాలు రాజమండ్రి లేదా గన్నవరం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ద్వారకా తిరుమలకు చేరుకోవచ్చు.

 

 

 

Latest News

Related News