Feet Touching Rules : జనరల్‌గా ఏదేని పని ప్రారంభించే ముందర పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం సంప్రదాయం. పెద్దల పాదాలు తాకి వారి బ్లెస్సింగ్స్ తీసుకుని పని మొదలు పెట్టినట్లయితే ఆ పనిలో తప్పకుండా విజయం సాధిస్తారనేది నమ్మకం. ఇది ఒక సెంటిమెంట్ అని కొందరు అభిప్రాయపడుతుంటారు. సనాతన సంప్రదాయం ప్రకారం ఇలా చేయడం వలన చక్కటి ప్రయోజనాలుంటాయని పెద్దలు వివరిస్తున్నారు. తల్లిదండ్రులు, గురువులు పాదాలు తాకి వారి ఆశీర్వాదం తీసుకోవాలని పెద్దలు చెప్తుంటారు. ఇలా పాదాలు తాకి బ్లెస్సింగ్స్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజాలేంటో తెలుసుకుందాం.
touching feet
ఈ స్పర్శ సంప్రదాయం ప్రకారం..ముఖ్యంగా పెద్దల పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకునే ఆచారం ఇప్పటిది అయితే కాదు. ఎప్పటి నుంచో ఈ పద్ధతి ఉంది. మన పూర్వీకులు ఈ అలవాటును గురించి మనకు వివరించారు. అయితే, అంతకుముందే అనగా దేవుళ్ల కాలంలోనూ ఈ పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకునే పద్ధతి ఉంది. శ్రీకృష్ణభగవానుడు తన మిత్రుడు సుదాముని పాదాలను తాకడమే కాకుండా తన చేతులతో తన మిత్రుడి పాదాలను తాకాడు. అలా చేయడం ద్వారా సుదాముని ఆశీర్వాదం తనకు లభిస్తుందని నమ్మకం. అలా ఒక వ్యక్తి మరొకరి పాదాలను తాకడం ద్వారా వారికి గౌరవమిస్తున్నామనే సంకేతాలు ఇవ్వడంతో పాటు అది సంప్రదాయంగా వస్తోంది.
feet touching rules
ఇకపోతే ఇలా పాదాలను తాకి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వలన వారిలోని సానుకూల శక్తి మనకు వస్తుంది. తద్వారా మనం ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటామని విశ్వాసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఇలా పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా నవగ్రహ దోషాలూ తొలగిపోతాయి. పాదస్పర్శ అనగా పాదాలను తాకేప్పుడు రకరకాల పద్ధతులు ఉన్నాయి. పెద్దలు, దేవతలను నమస్కరించే క్రమంలో పాదాలను తాకడం, మోకరిల్లడం, సాష్టాంగ నమస్కారం చేయడం వంటివి చేస్తుంటారు. భక్తితో తలని రెండు పాదాల మీద ఉంచడం కూడా చేస్తుంటారు. అలా చేయడం వలన వారిని మనం చాలా గౌరవిస్తున్నామని చెప్పకనే చెప్తున్నామని అర్థం. సంప్రదాయం ప్రకారం పెద్దవారి పాదాలనే కాకుండా చిన్న పిల్లల పాదాలను తాకొచ్చు. ఆడపిల్లల ఆశీర్వాదం కూడా తీసుకుంటారు చాలా మంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్నయ్య పాదాలకు నమస్కరిస్తే బుధిని పాదాలను నమస్కరించినట్లే. సాధువుల పాదాలను తాకితే చాలా చక్కటి ప్రయోజనాలుంటాయని పెద్దలు చెప్తుంటారు. ఇకపోతే అయ్యగార్లు అనగా బ్రాహ్మణుల పాదాలకు నమస్కారం చేస్తే పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్మకం. హిందూ సంప్రదాయాల ప్రకారం.. బ్రాహ్మణులకు దాన ధర్మాలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటుంటారు. ఇకపోతే పెద్దల పాదాలను తాకడం ద్వారా చక్కటి ప్రయోజనాలుంటాయని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది.
Feet Touching Rules