kanipakam vinayaka:కాణిపాక వరసిద్ధి వినాయకుడిగా పేరు గాంచిన ఈ ఆలయం ఆంధ్ర్రపదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఐరాల మండలంలోని కాణిపాకం గ్రామంలో ఉంది. అసలు ఈ ఆలయం పేరు వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. అసలు కాణిపాకం గ్రామం పేరు కాణిపారకం. కాణి అంటే పావు ఎకరం భూమి, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం. చరిత్రలోకి వెళితే.. ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారు ముగ్గురు మూడు రకాల వైకల్యాలతో బాధపడేవారు. ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ, మరొకరు చెవుడు. వారికి ఉన్న చిన్న పొలాన్ని సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో బావి నుంచి నీళ్లను బకెట్లతో తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద ఉంటే ఇద్దరు పైన వుండి నీరు తోడేవారు. ఒక రోజు బావి ఎండిపోయింది. దాంతో ముగ్గురిలో ఒకరు బావిలో దిగి లోతుగా తవ్వడం మొదలెట్టాడు. కాసేపటికి గడ్డపారకు రాయిలాంటిది తగలటంతో పెద్దగా శబ్దం వచ్చింది. క్రిందకు వంగి చూశాడు. మళ్లీ గడ్డపాతతో పోటు వేయగా ఒక నల్లని రాతికి తగిలి ఆ రాయి నుంచి రక్తం కారింది. దాంతో ఆశ్ఛర్యానికి గురయ్యాడు. క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులోకి మారిపోయింది. వారి ముగ్గిరి వైకల్యం నయమై, పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా బావి వద్దకు చేరుకుని ఇంకా లోతు తవ్వడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం మధ్యలోనే వినాయక స్వామి విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు. రానురాను కాణిపాకంగా పిలిచారు. ఇప్పటికి స్వామివారి విగ్రహం బావిలోనే ఉంటుంది. అక్కడ పక్కనే మరొక బావి ఉంది. దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. ఆ బావి దగ్గర స్వామివారికి, మనకు ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని నమ్మకం.
kanipakam vinayaka Temple
పెరుగుతున్న స్వామివారు :
కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకునికి సజీవమూర్తిగా వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతున్నారు. స్వామి వారికి కిరిటాలు సరిపోక ఎప్పటికి పెద్దవిగా తయారు చేసి పెడతారు. చిన్నవి ఐన వాటిని ఆలయంలో పక్కన పెడతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత తవ్వినా స్వామివారి విగ్రహం మాత్రం పూర్తిగా కనపడదు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.
kanipakam vinayaka idol
సత్యప్రామాణికుడిగా వినాయకుడికి పేరు ఉంది. అదెలా అంటే? ఈ విశిష్టమైన దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ చేస్తారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. దేవాలయానికి ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు ఉంది. అది ఎంతో ప్రసిద్ధి. తిరుపతి దర్శనానికి వెళ్లినవారంతా కాణిపాకం వినాయకున్ని తప్పకుండా దర్శించుకుని వెళుతుంటారు. కోరిన కోర్కెలు తప్పకుండా నెరవేరుస్తారని భక్తుల నమ్మకం.
వినాయక చవితి పండుగను కన్నుల పండుగగా నిర్వహిస్తారు.