ఆంజనేయస్వామికి ఆకుపూజ చేస్తే .. !

ఆంజనేయస్వామి.. కలియుగంలో శ్రీఘ్రంగా వరాలను ప్రసాదించే దేవుడు. భారతదేశంలో ఆంజనేయుడు లేని గ్రామం ఉండదంటే అతిశయోక్తి లేదేమో. అటువంటి భక్త సులభుడు అయిన తమలపాకులతో పూజిస్తే స్వామి శ్రీఘ్రంగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. భక్తుల విశ్వాసం ఇలా పూజిస్తే కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం… ఆకుపూజ వెనుకు పురాణగాథ ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడం వెనుక కారణం ఇదే… ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ […].

By: jyothi

Published Date - Sat - 15 May 21

ఆంజనేయస్వామికి ఆకుపూజ చేస్తే .. !

ఆంజనేయస్వామి.. కలియుగంలో శ్రీఘ్రంగా వరాలను ప్రసాదించే దేవుడు. భారతదేశంలో ఆంజనేయుడు లేని గ్రామం ఉండదంటే అతిశయోక్తి లేదేమో. అటువంటి భక్త సులభుడు అయిన తమలపాకులతో పూజిస్తే స్వామి శ్రీఘ్రంగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. భక్తుల విశ్వాసం ఇలా పూజిస్తే కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం…

ఆకుపూజ వెనుకు పురాణగాథ

ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడం వెనుక కారణం ఇదే… ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు.అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది. ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. అదేవిధంగా సంసారంలో సుఖం లబిస్తుంది. స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు. ఆంజనేయస్వామిని భక్తితో తమలపాకులన పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి.

Tags

Latest News

Related News