Lemon under vehicles: కొత్త వాహ‌నాల టైర్ల కింద నిమ్మకాయలెందుకు పెడుతారో తెలుసా?

Lemon under vehicles: మనలో ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో తప్పక చూసేది బండ్ల కింద నిమ్మకాయలు పెట్టడం. చాలా మంది ఇలా ఎందుకు చేస్తున్నారనే విషయం గురించి ఆలోచించకుండా గుడ్డిగా ఫాలో అవుతారు. కొద్ది మంది మాత్రమే ఈ చర్య వెనుక ఉన్న సైన్స్ గురించి ఆలోచిస్తారు. మన పెద్దవాళ్లు సైన్స్ నే ఆచారంగా పాటిస్తున్నారని అంటుంటారు. అసలు విషయమేంటంటే… పూర్వపు కాలంలో ఇన్ని వాహనాలు ఉండేవి కాదట. కేవలం ఎద్దులు, గుర్రాలతో నడిచే బండ్లతోనే […].

By: jyothi

Published Date - Wed - 8 December 21

Lemon under vehicles: కొత్త వాహ‌నాల టైర్ల కింద నిమ్మకాయలెందుకు పెడుతారో తెలుసా?

Lemon under vehicles: మనలో ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో తప్పక చూసేది బండ్ల కింద నిమ్మకాయలు పెట్టడం. చాలా మంది ఇలా ఎందుకు చేస్తున్నారనే విషయం గురించి ఆలోచించకుండా గుడ్డిగా ఫాలో అవుతారు. కొద్ది మంది మాత్రమే ఈ చర్య వెనుక ఉన్న సైన్స్ గురించి ఆలోచిస్తారు. మన పెద్దవాళ్లు సైన్స్ నే ఆచారంగా పాటిస్తున్నారని అంటుంటారు. అసలు విషయమేంటంటే… పూర్వపు కాలంలో ఇన్ని వాహనాలు ఉండేవి కాదట. కేవలం ఎద్దులు, గుర్రాలతో నడిచే బండ్లతోనే దూర ప్రయాణాలు చేసేవారట. దూర ప్రయాణాలు చేసే సమయంలో ఎడ్లు, గుర్రాల పాదాలకు గాయాలు ఏర్పడి అవి నడిచేందుకు అనేక అవస్థలు పడేవట. కాబట్టి బయళ్దేరే ముందే వాహనాలను టైర్ల కింద అంటే అప్పటి గుర్రాలు, ఎడ్ల పాదాల కింద నిమ్మకాయలు ఉంచే వారట. అవి ఆ నిమ్మకాయలను తొక్కినపుడు అందులోని రసం వాటి పాదాల్లోని పోయి.. ఏమైనా పుల్లు ఉంటే శుభ్రం చేసేదట. ఆ నిమ్మకాయ రసం ఆ మూగజీవాల పుండ్లు మానేందుకు తోడ్పడేదట. అదే ఆచారం ఇప్పుడు పెట్రోల్ తో నడిచే వాహనాలు వచ్చనపటికీ కూడా కొనసాగుతుండటం గమనార్హం.


నీళ్లలో నాణేలెందుకు వేస్తారు..

coins-in-water

coins-in-waterమనలో చాలా మంది గుళ్లకు వెళ్లినపుడు అక్కడున్న నదులు, సరస్సులు, కొలనుల్లో చిల్లర వేయడం చూసే ఉంటాం. అందుకు గల నిర్ధిష్ట కారణాలు మనకు తెలియనప్పటికీ గుడ్డిగా ఆచారం పేరుతో డబ్బులను నీళ్ల పాలు చేస్తాం. ఎందుకు ఇలా వేస్తారంటే.. పూర్వపు రోజుల్లో ఇప్పటిలా కాకుండా అన్ని రాగితో చేసిన నాణేలు మాత్రమే ఉండేవి. పైగా అప్పటి రోజుల్లో ఇప్పటిలా నీటి ప్యూరిఫికేషన్ అందుబాటులో ఉండేది కాదు. అందుకోసం చెరువులు, మరియు దేవాలయాల్లోని కొలనుల్లో మన పెద్ద వాళ్లు పాత రోజుల్లో రాగి నాణేలు వదిలేవారు. ఆ రాగి నాణేల వలన నీరు పరిశుభ్రంగా మారుతుందనేది వారి ఆలోచన. కానీ నేటికీ మనం అదే పద్ధతిని పాటిస్తూ.. గుళ్లకు వెళ్లినపుడు మనకు తోచిన రీతిలో నాణేలను నీటిలో వదిలేస్తున్నాం. ఇప్పుడు చలామణిలో ఉన్న ఇనుప నాణేల వల్ల నీరు కలుషితమవడమే కాకుండా అందులో ఉండే జీవచరాలకు కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పటికైనా గుళ్లకు వెళ్తే.. డబ్బులు నీటిలో వేయడం మానండి.

పేడను చల్లడం వల్ల లక్ష్మీ దేవి వస్తుందా?

kallapu

kallapu


తెలుగు లోగిళ్లలో చాలా మంది పేడతో చేసిన కల్లాపి చల్లుతారు. ఇలా ఇంటి ముందు పేడతో చల్లడం, లేదా అలకడం వల్ల లక్ష్మీ దేవి ఇంటికి వస్తుందని పెద్దలు చెబుతారు. కానీ ఇది నిజం కాదు. అసలు పేడతో ఇల్లు ఎందుకు అలుకుతారంటే… ఇంట్లోకి క్రిములు, బ్యాక్టీరియాలు రాకుండా ఉండేందుకు పూర్వ కాలంలో ఇలా పేడతో కల్లాపి చల్లేవారట.. కానీ ప్రస్తుత కాలంలో క్రిములు, బ్యాక్టీరియాల అంతం కోసం అనేక మందులున్నాయి. అంతే కానీ పేడతో కల్లాపి చల్లితే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందనడంలో ఎటువంటి నిజం లేదు.

బళ్లకు, ఇళ్లకు ముందు మిరపకాయలెందుకు…

traditions

traditionsబండికి, ఇంటికి ముందు భాగంలో పచ్చి మిరప కాయలు, నిమ్మకాయలు కడతారు. అలా ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తే ఇలా చేయడం వల్ల శుభాలు కలిగి.. ఆస్తులు పెరుగుతాయని చెబుతారు. కానీ అలాంటిదేమీ లేదు. ఇలా నిమ్మకాయలు, పచ్చిమిర్చిని కాటన్ దారానికి కట్టడం వల్ల వాటిల్లో ఉండే గాటు, కొన్ని రకాల న్యూట్రియన్స్ ని కాటన్ దారం పీల్చుకొని బయటకు వదులుతుందట.. దీంతో ఇంటి లోపలికి చీమలు, దోమలు వంటి కీటకాలు రాకుండా ఉంటాయట. అంతే కానీ నిమ్మకాయలు, మిరపకాయలు కలిపి కడితే దురదృష్టం పోతుందనడంలో ఎంత మాత్రం నిజం లేదు.

Tags

Latest News

Related News