Lord Krishna : చిన్ని కృష్ణుడికి దేవకితో పాటు అంత మంది మాతృమూర్తులు..

Lord Krishna : భగవాన్ శ్రీకృష్ణుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరికలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. అయితే, దేవుళ్లలందరిలోనూ మోస్ట్ రొమాంటిక్ గాడ్‌గా భగవాన్ శ్రీకృష్ణుడు ఉన్నాడు. గోపికలకు అత్యంత ఇష్టమైన శ్రీకృష్ణుడు మహావిష్ణువు ఎనిమిదో అవతారమని అందరికీ తెలిసే ఉంటుంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు పోషించిన పాత్ర ప్రతీ ఒక్కరు తెలుసుకోదగినది. ఇక ఈ సంగతులు పక్కనబెడితే చిన్ని కృష్ణుడికి మాత్రమూర్తులుగా మహాభారతం ప్రకారం చాలా మంది ఉన్నారు.. వారు ఎవరెవరు.. ఎంత మందో..తెలుసుకుందాం. శ్రావణ […].

By: jyothi

Published Date - Tue - 9 November 21

Lord Krishna : చిన్ని కృష్ణుడికి దేవకితో పాటు అంత మంది మాతృమూర్తులు..

Lord Krishna : భగవాన్ శ్రీకృష్ణుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరికలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. అయితే, దేవుళ్లలందరిలోనూ మోస్ట్ రొమాంటిక్ గాడ్‌గా భగవాన్ శ్రీకృష్ణుడు ఉన్నాడు. గోపికలకు అత్యంత ఇష్టమైన శ్రీకృష్ణుడు మహావిష్ణువు ఎనిమిదో అవతారమని అందరికీ తెలిసే ఉంటుంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు పోషించిన పాత్ర ప్రతీ ఒక్కరు తెలుసుకోదగినది. ఇక ఈ సంగతులు పక్కనబెడితే చిన్ని కృష్ణుడికి మాత్రమూర్తులుగా మహాభారతం ప్రకారం చాలా మంది ఉన్నారు.. వారు ఎవరెవరు.. ఎంత మందో..తెలుసుకుందాం.

Lord Krishna

Lord Krishna

శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిథిన రోహిణి నక్షత్ర లగ్నమందు పుట్టిన శ్రీకృష్ణుడికి దేవకి, యశోద ఇద్దరు తల్లులు ఉన్నారని అందరు అనుకుంటారు. అది నిజమే కానీ, వారితో పాటు ఇంకొందరు శ్రీకృష్ణుడికి మాతృమూర్తులుగా ఉన్నారు. వసుదేవుడు, దేవకిలకు శ్రీకృష్ణుడు జన్మించాడు. చెరసాలలో పుట్టిన కన్నయ్యకు తల్లి దేవకి మాత్రమే కాదు. యశోద కూడా తల్లినే. గోకులంలో పెరిగిన సమయంలో శ్రీకృష్ణుడికి తల్లిగా యశోద ఉంది.

యశోద నందనుడి వద్ద శ్రీకృష్ణుడు పెరిగిన సందర్భంలో యశోద శ్రీకృష్ణుడు తన తనయుడని భావిస్తుంటుంది. దేవకి కంటే ముందు వసుదేవుడు రోహిణిని వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రోహిణిని శ్రీకృష్ణుడి తన తల్లిగా భావిస్తాడు. సందీపని ముని భార్య సుముఖి దేవిని కూడా శ్రీకృష్ణుడు తన మాతృమూర్తిగానే భావిస్తాడు. మహాభారతం ప్రకారం..బలరాముడు, సుదాముడు, శ్రీకృష్ణుడు సందీపని మహర్షి దగ్గర శిక్షణ పొందారు. ఈ నేపథ్యంలోనే సుముఖిదేవి శ్రీకృష్ణుడిని తన కుమారుడిగా ఉండాలని గురుదక్షిణ అడుగుతుంది. అలా సుముఖి దేవి కుమారుడిగా శ్రీకృష్ణుడు ఉంటాడు.

Lord Krishna

Lord Krishna

భాగవతం ప్రకారం.. చిన్న కృష్ణుడిని గోకులంలో హతమార్చేందుకుగాను కంసుడు పూతన అనే రాక్షసిని పంపడం గురించి అందరు తెలుసుకునే ఉంటారు. పాలు తాగే వయసులో ఉన్న చిన్ని కృష్ణుడిని చంపేందుకుగాను పూతన తన రొమ్ముల్లో విషాన్ని నింపుకుని కృష్ణుడి వద్దకు వస్తుంది. పసివాడి రూపంలో ఉన్న కృష్ణుడికి తన రొమ్ముపాలు తాగించి చంపాలని పూతన అనుకుంటుంది.

వేణు మాధవుడు పూతన రొమ్ములోనున్న విషపు పాలతో పాటు ఆమె రక్తాన్ని కూడా పీలుస్తాడు. అలా ఆమెను హతమారుస్తాడు. అనంతరం పూతన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాడు. ఆ టైంలో పూతన శరీరం నుంచి గంధపు చెక్కల వాసన రాగా, సంస్కారాలు పూర్తి చేస్తాడు కృష్ణుడు. ఆ తర్వాత పూతనను కూడా శ్రీకృష్ణుడు తన తల్లిలాగా భావిస్తాడు. ఆమెకు కూడా తన మాతృమూర్తి హోదాను ఇస్తున్నట్లు పేర్కొంటాడు చిన్ని కృష్ణుడు.

Tags

Latest News

Related News