Lord Krishna : గురువుకు దక్షిణగా శ్రీకృష్ణుడు ఏం ఇచ్చాడో మీకు తెలుసా?

Lord Krishna : భారతీయ సమాజంలో గురువుకు ఉండే పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ రంగంలోనూ ప్రతీ వ్యక్తికి ఎవరో ఒకరు గురువు ఉండే ఉంటారు. ఇకపోతే గురువును గౌరవించడం శిష్యుడి బాధ్యత. ఒక వేళ గురువుకు ఏదేని అనుకోని ఆపద వచ్చినట్లయితే శిష్యులు దగ్గరుండి ఆ టైంలో ఆదుకోవాల్సి ఉంటుంది. అలా చేయడం ఉత్తమ శిష్యుడి లక్షణం. కాగా, శ్రీకృష్ణుడు తన గురువుకు దక్షిణగా ఏం ఇచ్చాడో మీకు తెలుసా.. గురువు ఆ దక్షిణ […].

By: jyothi

Published Date - Fri - 12 November 21

Lord Krishna : గురువుకు దక్షిణగా శ్రీకృష్ణుడు ఏం ఇచ్చాడో మీకు తెలుసా?

Lord Krishna : భారతీయ సమాజంలో గురువుకు ఉండే పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ రంగంలోనూ ప్రతీ వ్యక్తికి ఎవరో ఒకరు గురువు ఉండే ఉంటారు. ఇకపోతే గురువును గౌరవించడం శిష్యుడి బాధ్యత. ఒక వేళ గురువుకు ఏదేని అనుకోని ఆపద వచ్చినట్లయితే శిష్యులు దగ్గరుండి ఆ టైంలో ఆదుకోవాల్సి ఉంటుంది. అలా చేయడం ఉత్తమ శిష్యుడి లక్షణం. కాగా, శ్రీకృష్ణుడు తన గురువుకు దక్షిణగా ఏం ఇచ్చాడో మీకు తెలుసా.. గురువు ఆ దక్షిణ ఇచ్చేందుకుగాను శ్రీకృష్ణుడు చాలా కష్టపడ్డాడట.

పురాణాలు, ఇతర ఇతిహాసాల కథనాల ప్రకారం.. రాజకుమారులు తమ గురువుల వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్నారని మనకు తెలుసు. ఈ క్రమంలోనే గురువులకు శిష్యులైనటుంటి రాజకుమారులు గురుదక్షిణ చెల్లించేవారు. అది రాజవంశీకుల అనాది సంప్రదాయ ఆచార వ్యవహారంగా ఉంది. కాగా శ్రీహరి శ్రీకృష్ణుడి అవతారంగా జన్మించినప్పుడు గురు దక్షిణగా ఇచ్చిన విషయం వెలకట్టలేనిదట.

శ్రీకృష్ణుడి అవతరాంలో ఉన్నపుడు శ్రీహరి గురువుల దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుని వారికి మంచి పేరు తీసుకొచ్చాడు. వివరాల్లోకెళితే.. శ్రీకృష్ణుడు చిన్ని అవతరాంలో ఉన్నపుడు విద్యాబుద్ధులు నేర్చుకునేందుకుగాను సాందీపముని ఆశ్రమంలో చేరాడు. సాందీప మహర్షి ఆశ్రమంలో విద్యాబుద్ధులను నేర్చుకుంటూ ఇతర విద్యార్థులతో కలిసి ఆశ్రమంలో హాయిగా గడిపాడు శ్రీకృష్ణుడు. ఈ క్రమంలోనే శ్రీకృష్ణుడు సాందీపముని ప్రియశిష్యుడిగా గుర్తింపు పొందాడు. సాందీపమునికి అత్యంత ఇష్టమైన శిష్యుడిగా శ్రీకృష్ణుడు ఉన్నాడు.

Lord Krishna sandeepamuniu

Lord Krishna sandeepamuniu

సాందీపముని వద్ద శ్రీకృష్ణుడు ఇతర శిష్యుల మాదిరిగానే సకల శాస్త్రాల్లో విద్యా బుద్ధులు నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే అందరూ గురుదక్షిణ సమర్పించుకుంటున్నారు. ఇక శ్రీకృష్ణుడి వంతు వచ్చింది. ఈ క్రమంలోనే గురువు సాందీపమునికి బదులుగా ఆమె భార్య దక్షిణ అడుగుతుంది. గురుపత్నిఅడిగిన ఆ దక్షిణ ఏమిటంటే.. తమ కుమారుడి తప్పిపోయాడని, అతడిని తమకు గురుదక్షిణగా ఇవ్వాలని అంటుంది. అయితే, ఆ గురు దక్షిణ ఇవ్వడం చాలా కష్టం. అయినప్పటికీ శ్రీకృష్ణుడు ఆ దక్షిణ ఇచ్చాడు.

సముద్రంలో సాందీపముని స్నానం చేస్తుండాగా ఆయన తనయుడిని పాంచజన్యమనే రాక్షసుడు అపహరించుకుపోతాడు. ఆ సంగతి తెలుసుకుని శ్రీకృష్ణుడు అతడితో భీకర పోరాటం చేసి ఆ రాక్షసుడిని అంతమొందిస్తాడు. అలా అతడి చెరలో నుంచి సాందీపముని కుమారుడిని బయటకు తీసుకొచ్చి సాందీపమునికి అప్పగిస్తాడు. అలా గురువుకు వెలకట్టలేని దక్షిణను శ్రీకృష్ణుడు సమర్పిస్తాడు. కాగా, సాందీపముని, ఆయన భార్య శ్రీకృష్ణుడు తమకు నిజమైన శిష్యుడని పొంగిపోయారు. కుమారుడిని గురుపత్ని కన్నీరుమున్నీరయి శ్రీకృష్ణుడికి కృతజ్ఞతలు తెలిపింది. శ్రీకృష్ణుడు అలా చరిత్రలోనే గొప్ప శిష్యుడిగా మిగిలిపోయాడు.

Tags

Latest News

Related News