Lord Krishna : భూమ్మీద జరుగుతున్న అన్యాయాలను అడ్డుకునేందుకుగాను భగవంతుడు పలు అవతారాలు ఎత్తుతాడని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి. త్రేతా, ద్వాపర, కలి..ఇలా యుగాలన్నిటిలోనూ మహావిష్ణువు అవతారాలు ఎత్తుతాడని పెద్దలూ చెప్తున్నారు.
శ్రీకృష్ణుడి అవతారం కూడా భగవంతుడి అవతారమే. కాగా, భగవంతుడు శ్రీకృష్ణుని రూపంలో భూమ్మీదకు వచ్చి తన చిన్నతనంలో మేనమామ కంసుడిని సంహరించినట్లు పేర్కొన్నాయి. కాగా, కంసుడిని ఎందుకు చంపాడు? అందుకు గల కారణాలేంటనే విషయాలు తెలుసుకుందాం.
పురాణ కథనాల ప్రకారం.. కంసుడికి శక్తిమంతమైన పాలకుడిగా పేరుంది. అయితే, కంసుడు తన పాలనలో అనేక చెడు పనులు చేశాడు. తన చెల్లెలికి పుట్టిన బిడ్డలు తనను చంపేస్తారని కంసుడికి ఆకాశవాణి చెప్తుంది. దాంతో కంసుడు తన చెల్లెలికి పుట్టిన పిల్లలను చంపేస్తాడు. దేవకి, వసుదేవుడిని చెరసాలలో బంధిస్తాడు. అలా చెరసాలలో శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. రేపల్లెలోని పిల్లలందరినీ కంసుడు చంపేస్తాడు.
Krishna kamsa kil
ఈ క్రమంలోనే శ్రీకృష్ణుడిని చంపేందుకు ప్లాన్ చేస్తాడు. రాక్షసిని ఊరి మీదకు పంపి తన పాల ద్వారా విషమిచ్చి కృష్ణుడిని చంపాలనుకుంటాడు. కానీ, కృష్ణుడు అదే సమయంలో తన పాలతో పాటు రాక్షసి రక్తాన్ని కూడా పీల్చి తనను చంపేస్తాడు. అలా కంసుడు ఎన్ని చెడు పనులు చేసినప్పటికీ మామయ్య అన్న కారణంగా కృష్ణుడు వదిలేస్తుంటారు. కాగా, ఇక పనులు మితిమీరిపోతున్నాయని భావించి చివరకు కంసుడిని చంపేస్తాడు. దాంతో మధుర రాజ్యానికి ఉగ్రసేనుడు రాజు అవుతాడు.
అలా రాక్షస అంశతో పుట్టి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి కంసుడిని శ్రీకృష్ణుడు చంపేస్తాడు. అలా చెడు వ్యక్తిని అంతం చేసినందుకుగాను చెడుపై మంచి సాధించిన విజయం అని ప్రజలు భావిస్తుంటారు. ఈ క్రమంలోనే కంసుడిని వధించిన రోజును పండుగలా భావించి సంబురాలు కూడా చేసుకుంటారు. అలా ప్రతీ సంవత్సరం నవంబర్ 24న ఈ పండుగ నిర్వహించుకుంటారు. ఈ తేదీ శ్రీకృష్ణుడు, ఆయన మేనమామ కంసుడి మధ్య జరిగిన యుద్ధాన్ని సూచిస్తుందని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి.
Lord Krishna
పర్టికులర్‌గా ఈ తేదీని పండితులు ధ్రువీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిందువులు కంసుడి వధను చెడు మీద మంచి సాధించిన విజయంగా భావిస్తుంటారు. ఈ రోజును భక్తులు శ్రీకృష్ణుడు, రాధా దేవీలకు ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు. వీధుల్లో ‘హరే రామ హరే కృష్ణ’ అని మంత్రాలను జపిస్తూ.. వివిధ రకాల స్వీట్స్ పంపిణీ చేస్తుంటారు.
Lord Krishna
ఈ నేపథ్యంలోనే కంసుడి విగ్రహాన్ని తయారు చేసి దానిని దహనం చేసి.. ‘హరే రామ హరే కృష్ణ’ అని నినదిస్తుంటారు. మొత్తంగా కంసుడి వధను సెలబ్రేట్ చేసుకుని భగవాన్ శ్రీకృష్ణుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు భక్తులు.