Lord Padmanabha Swamy : భక్తి భావనను ప్రపంచానికి అందించిన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. విదేశాల్లోనూ హిందూ దేవుళ్లకు ఆలయాలు ఉన్నప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాయలం ఇండియాలో ఉండటం విశేషం. ఆ టెంపుల్ ఎక్కడుంది? ఆ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం.
భారతదేశంలో ఉన్న ఆలయాల్లో కొన్నిటి రహస్యాలను మాత్రమే పురావస్తు శాఖ వారు ఛేదించగలిగారు. ఇంకా కొన్ని ఆలయాల నిర్మాణం వెనుక ఉన్న సీక్రెట్స్‌పై పురావస్తుశాఖ వారు, ఔత్సాహిక పరిశోధకులు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. అయితే, చరిత్రకారుల సహకారం, వారు కనుగొన్న ఆధారాల ద్వారా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంగతులు పక్కనబెడితే..కేరళలోని పద్మనాభస్వామి టెంపుల్ ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటిగా ఉంది. ఈ టెంపుల్‌లో ఆరు సీక్రెట్ రూమ్స్ ఉన్నాయని, ఇందులో టన్నుల కొద్ది బంగారు ఆభరణాలు, వజ్రవైడుర్యాలు, స్వర్ణ విగ్రహాలు ఉన్నాయని చరిత్రకారులు పేర్కొన్నారు.
ఈ ఆలయంలో హరినారాయణుడు శేషపాన్పుపై పవళించి ఉంటాడు. మహావిష్ణువుకు ఉన్న 108 దివ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ టెంపుల్‌ను హిందువులు అతి పవిత్రంగా భావిస్తారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న ఈ టెంపుల్ బాగా ఫేమస్ టెంపుల్. కొన్ని ఏళ్ల కిందట ఈ ఆలయ పరిసరాల్లో బయటపడ్డ బంగారం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపాద ఈ ఆలయంలో ఉండటం గమనార్హం.
Lord Padmanabha Swamy
పురాణ కథనాల ప్రకారం.. బలరాముడు మహావిష్ణువును ఆరాధించినట్లు, అందుకుగాను ఈ ఆలయాన్ని నిర్మించినట్లు సమాచారం. కలియుగం ఆరంభంలోనే ఈ టెంపుల్‌ను నిర్మించినట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ట్రావెన్ కోర్ సంస్థాన కుటుంబ వంశీకులు ఈ ఆలయ వ్యవహారాలు అప్పట్లో చూసుకునేవారని తెలుస్తోంది. ఇకపోతే ఈ ఆలయంలోనికి హిందువులకు మాత్రమే ప్రవేశముంటుంది. హిందూత్వాన్ని బలంగా నమ్మిన వారికి మాత్రమే టెంపుల్‌లోనికి ఎంట్రీ ఉంటుంది. స్పెషల్ వస్త్ర నిబంధన పాటించాల్సి ఉంటుంది. ఈ టెంపుల్‌లో ఉన్న స్వామి వారి మూల విరాట్ విగ్రహం మనం ఒకేసారి చూడలేం. అంత పెద్దగా దీనిని నిర్మించారు.
దాదాపు నాలుగు వేల మంది శిల్పకారులు, ఆరు వేల మంది కార్మికులు వంద ఏనుగులు, దాదాపు ఆరు నెలల పాటు శ్రమించి ఈ టెంపుల్‌లోని స్వామి వారి మూల విరాట్ విగ్రహం, ఇంకా ఇతర ప్రతిమలను చేసినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. టెంపుల్‌కు అవసరమైన శిలలను అప్పట్లో నేపాల్ దేశంలోని గండకి నది ఒడ్డు నుంచి తీసుకొచ్చారని అంటున్నారు పరిశోధకులు. ఆలయంలో కొలువు దీరి ఉన్న పద్మనాభ స్వామి వారు భక్తుల కోరికలు నెరవేర్చడంలో ఎప్పుడూ ముందుంటాడనేది భక్తుల నమ్మకం.