Astrology : ఏ పని మొదలుపెట్టినా ముందుకు సాగకపోవడం, ఎంత శ్రద్ధగా పని చేసినా విజయం సాధించకపోవడం మనలో చాలామందికి జరుగుతుంటుంది. దీంతో జీవితం మీద తీవ్ర నిరాశ వచ్చేస్తుంటుంది. దీని గురించి పెద్దలకు చెబితే.. వాళ్లు శని దేవుడి ప్రభావం ఉంటుంది, అందుకే ఇలా ప్రతి విషయంలో ఫెయిల్ అవుతుంటారని చెబుతుంటారు. నిజమే..
శని దేవుడి కోపం, శనిదేవుడి వక్ర దృష్టి ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్లకు కష్టాలు తప్పవు. మరి తాజాగా శని దేవుడి స్థానం కొన్ని రాశుల వారికీ లాభదాయకంగా ఉంటే మరికొన్ని రాశుల వారికీ ఇబ్బందులు ఎదురవుతాయి.. శని దేవుడు మకరం నుండి కుంభం లోకి ప్రవేశించ బోతున్నాడు. దీంతో శని ప్రభావం 3 రాశుల వారికీ కాస్త వ్యతిరేకంగా ఉంటుందట..
వృశ్చిక రాశి : ఈ రాశి వారికీ శని నాల్గవ ఇంట అస్తమించ బోతుంది.. దీంతో ఈ రాశి వారికీ శారీరక ఆనందం, తల్లి యొక్క ఆరోగ్యంపై ప్రభావం పడుతుందట.. అలాగే వ్యాపారస్తులు ఆర్ధిక లావాదేవీలను జాగ్రత్తగా చూసుకోవాలట.. అందుకే ఈ రాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్త వహించండి..
కర్కాటక రాశి : ఈ రాశి వారికీ శని దేవుడు కొంత చికాకులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశి వారికీ శని దేవుడి ఎనిమిదవ ఇంట సెట్ అవుతున్నాడు.. అందుకే మీరు ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.. ఆర్ధికంగా మునిగిపోయే అవకాశం కనిపిస్తుంది.
సింహ రాశి : ఈ రాశి వారికీ శని దేవుడి వల్ల కష్టాలు తప్పవు.. ఈ రాశి నుండి ఏడవ ఇంట్లో శని అస్తమించ నున్నాడు. వీరికి వైవాహిక జీవితంలో ఇబ్బందులు తప్పవు.. ఇంకా వృధా ఖర్చులు కూడా ఎక్కువుగా ఉంటాయి. దీని కారణంగా మీ బడ్జెట్ కూడా తారుమారు అవ్వొచ్చు..
Read Also : Allu Arha : అల్లు అర్హ ఎంత క్యూట్ గా ఉందో చూడండి ..!
Read Also : Sushmita : చరణ్ కు అబ్బాయే పుట్టాలంటున్న అక్క సుస్మిత.. కారణం తెలిస్తే షాక్!