Lord Shiva : ఆలయంలో దేవుడికి పూజలు భక్తులు శ్రద్ధతో చేస్తుంటారు. పవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావించే ఆలయానికి స్నానం చేసి కొబ్బరికాయలు ఇతర పూజా సామగ్రితో వెళ్తుంటారు. పొరపాటున కూడా స్నానం చేయకపోతే ఆలయంలోకి వెళ్లబోరు భక్తులు. అటువంటిది ఆ ఆలయంలో మాత్రం ఏకంగా సిగరెట్లనే పూజకు ఉపయోగిస్తున్నారు. నిజమేనా.. ఈ సంప్రదాయం ఎక్కడుందని అనుకుంటున్నారా? నిజమేనండోయ్.. భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ టెంపుల్‌లో భక్తులు సిగరెట్లతో పూజలు చేస్తున్నారు. ఆ విషయాలు తెలుసుకుందాం..
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలన్ జిల్లాలోని ఓ శివాలయంలో పూజలు సిగరెట్లతో చేస్తారు. అక్కడి స్థానికులు అలానే చేస్తారట. అభిషేకానికి పూలు, పండ్లు సమర్పించి నిష్టగా దేవుడిని ప్రార్థిస్తారు. అయితే, ఈ ఆలయంలోని వింత ఆచారం ప్రకారం.. శివుడికి సిగరెట్లతో అభిషేకం చేస్తారు. ఏళ్ల నుంచి ఈ వింత ఆచారం అక్కడ అమలులో ఉన్నట్లు స్థానికులు చెప్తున్నారు.
లూట్రా మహాదేవ్ ఆలయంలో ఇలా చేస్తుండటం చూసి ఇతర ప్రదేశాల నుంచి వారు ఆశ్చర్యపోతుంటారని, కానీ, అది తమకు సాధారణమైన విషయమేనని స్థానికులు వివరిస్తున్నారు. ఓ ఆలయంలో విస్కీని భక్తులు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన మాదరిగానే ఈ ఆలయంలో సిగరెట్లు దేవుడికి ప్రీతి పాత్రమైనవని భావించి భక్తులు సమర్పిస్తారని స్థానికులు వివరిస్తున్నారు.
Lord Shiva
భక్తులు ఇక్కడకు వచ్చి సిగరెట్లు వెలిగించి మొక్కులు సమర్పించుకుంటారు. అయితే, కొందరు భక్తులు గర్భగుడిలోకి సిగరెట్లును విసిరేస్తారు కూడా. అలా విసిరేసిన సిగరెట్లు వాటంతట అవే వెలుగుతాయనేది భక్తుల నమ్మకం. అయితే, అలా విసిరేయబడిన సిగరెట్లు వెలుగుతాయని కూడా స్థానికులు చెప్తున్నారు. ఇలా సిగరెట్లతో అభిషేకం, పూజలు చేయడం గురించి తెలుసుకుని చాలా మంది భయపడిపోతుంటారు. కానీ, అది తమకు స్థానికంగా రెగ్యులర్‌గా చూసి చూసి అలవాటు అయిపోయిందని స్థానికులు చెప్తున్నారు. భారతదేశంలో ఈ ఒక్క చోటే కాదు..మిగతా చాలా చోట్ల కూడా కొన్ని వింత ఆచారాలు ఉన్నాయి. కాగా, ఇలా సిగరెట్లతో పూజలు, అభిషేకాలు చేయడం వెరీ డిఫరెంట్ విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా సిగరెట్ తాగిన వ్యక్తిని లేదా తాగుతున్న వ్యక్తిని ఇంట్లోకి అనుమతించడానికే అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. బహిరంగ ప్రదేశాలు ధూమపానం చేయొద్దని ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. అటువంటి సిగరెట్లను దేవుడి గుడిలోకి ఏకంగా గర్భ గుడిలోకి విసిరేయడం నిజంగా వింత ఆచారమేనని అనుకుంటున్నారు. అయితే, అలా ఆలయంలోకి విసిరేయబడిన సిగరెట్లు వెలుగుతాయని చెప్పడం భక్తుల నమ్మకం అయినప్పటికీ అందులో ఏదైనా మిస్టరీ ఉండొచ్చని, దానని ఛేదించాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు.