Lord Shiva : శివునికి ఈ వస్తువులతో పూజలు చేయొద్దట.. తెలుసా?

Lord Shiva : శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని పెద్దలు చెప్తుంటారు. ముల్లోకాలకు అధిపతి అయిన శివుడు లోక కల్యాణం కోసం శ్మశానంలో నిద్రిస్తాడని, ఆయన భక్తుల కష్టాలు నెరవేరుస్తాడని వివరిస్తుంటారు. హిందువుల ఆరాధ్య దైవం అయిన శివుడిని అందరు దేవుళ్ల మాదిరిగానే పూజిస్తుంటారు. కానీ, శివుడిని పూజించే ఈ విషయాల పట్ల జాగ్రత్త వహించాలట. అవేంటంటే.. పండితుల చెప్తున్న దాని ప్రకారం.. ఇతర దేవుళ్ల పూజలకు శివుడి పూజలకు చాల తేడాలుంటాయి. లోకేశ్వరుడికి తిలకం […].

By: jyothi

Updated On - Wed - 27 October 21

Lord Shiva : శివునికి ఈ వస్తువులతో పూజలు చేయొద్దట.. తెలుసా?

Lord Shiva : శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని పెద్దలు చెప్తుంటారు. ముల్లోకాలకు అధిపతి అయిన శివుడు లోక కల్యాణం కోసం శ్మశానంలో నిద్రిస్తాడని, ఆయన భక్తుల కష్టాలు నెరవేరుస్తాడని వివరిస్తుంటారు. హిందువుల ఆరాధ్య దైవం అయిన శివుడిని అందరు దేవుళ్ల మాదిరిగానే పూజిస్తుంటారు. కానీ, శివుడిని పూజించే ఈ విషయాల పట్ల జాగ్రత్త వహించాలట. అవేంటంటే..

పండితుల చెప్తున్న దాని ప్రకారం.. ఇతర దేవుళ్ల పూజలకు శివుడి పూజలకు చాల తేడాలుంటాయి. లోకేశ్వరుడికి తిలకం అనగా బొట్టు అస్సలు వాడరు. మీరు ఎక్కడైనా శివాలయంలో కాని శివలింగంపైన కాని తిలకం పెట్టి ఉండటం చూసి ఉండబోరు. ఇతర దేవుళ్లను పూజించిన మాదిరిగా అదే వస్తువులతో శివుడిని పూజిస్తే ఫలితముండదని అంటున్నారు. పండితులు స్పష్టం చేసిన విషయాలం ప్రకారం కొన్ని వస్తువులతో శివుడిని అస్సలు పూజించకూడదు. కొబ్బరి నీళ్లు, శంఖం, తులసి ఆకులు, ఎర్రని రంగులో ఉండే ఫ్లవర్స్‌తో శివుడిని పూజించొద్దట. అలా చేస్తే మీరు అనుకున్న కోరికలు నేరవరవట. శివుడి అనుగ్రహం ఆ వస్తువులతో పూజించడం వల్ల కలగదని వివరిస్తున్నారు.

శివుడిని లింగ రూపంలో పూజించడం గురించి మనకు తెలుసు. ఇతర దేవుళ్లకు ప్రతిమలు ఉన్నప్పటికీ మహాశివుడిని మాత్రం లింగాకారుడిగానే పూజిస్తాం. ఇకపోతే భోళాశంకరుడు, అమరేశ్వరుడు, మంజునాథుడు అని రకరకాల పేర్లున్న శివుడికి లింగాకార దర్శన భాగ్యం చేత అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల నమ్మకం. కాగా, ఇతర దేవుళ్ల విగ్రహాలకు తిలకం దిద్దిన మాదిరిగా లింగరూపంలోనున్న శివుడికి కుంకుమ కాని తులసి ఆకులు కాని సమర్పించకూడదు.

Lord Shiva

Lord Shiva

మామూలుగా అయితే ఇతర దేవుళ్లకు సింధూరం అంటే ప్రీతిపాత్రమే. కానీ, శివుడి విషయంలో అలా కాదు. ఈ విషయమై పండితులు చెప్తుంటారు కూడా. అయితే, విశ్వాసాల ఆధారంగా ఏ శివాలయంలో కాని శివ లింగాకారంపై కాని లింగానికి తిలకం దిద్దబోరు. ఇక ప్రతీ ఒక్కరు పవిత్రంగా భావించే పసుపును.. శుభసూచకంగా భావిస్తుంటాం.

దేవుళ్లకు పూజలు చేసే క్రమంలో కంపల్సరీగా పసుపు, కుంకుమ తీసుకెళ్తుండటం మనం చూడొచ్చు. మహిళలకు పసుపు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అయితే, పసుపునకు ఇంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ అది శివుడిని పూజించే సమయంలో మాత్రం ఉపయోగించరాదు. ఈ నేపథ్యంలోనే పొరపాటున కూడా శివ పూజ సమయంలో పసుపు ఉపయోగించొద్దట. పసుపు ఉపయోగించి పూజలు చేయడం వలన ఆ పూజా ఫలాలు అసలు దక్కకపోగా, పూజ నిరూపయోగమవుతుందని పెద్దలు పేర్కొంటున్నారు. శంఖతో నీరు పోయడం, ఎరురు రంగు పూలు వేయడం, తులసి ఆకులు పెట్టడం కూడా చేయొద్దు.

Tags

Related News