Lord Shiva : ఈ చిన్న పనితో ఏడాది పాపాలు మాయం..

Lord Shiva : కార్తీక మాసంలో మహా శివుడిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. కాగా, ఈ కార్తీక మాసంలోని కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అత్యంత పవిత్రమైన రోజు అని పెద్దలు చెప్తున్నారు. ఈ పవిత్రమైన రోజున తులసి కోట ముందర దీపం వెలిగిస్తే మంచి ప్రయోజనాలుంటాయి. తులసి కోట ఎక్కడ ఉంటే అక్కడ విష్ణువు ఉంటాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇకపోతే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి […].

By: jyothi

Published Date - Tue - 16 November 21

Lord Shiva : ఈ చిన్న పనితో ఏడాది పాపాలు మాయం..

Lord Shiva : కార్తీక మాసంలో మహా శివుడిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. కాగా, ఈ కార్తీక మాసంలోని కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అత్యంత పవిత్రమైన రోజు అని పెద్దలు చెప్తున్నారు. ఈ పవిత్రమైన రోజున తులసి కోట ముందర దీపం వెలిగిస్తే మంచి ప్రయోజనాలుంటాయి. తులసి కోట ఎక్కడ ఉంటే అక్కడ విష్ణువు ఉంటాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఇకపోతే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. అందుచేత ఈ ఏకాదశిని ఉద్దాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అని పిలుస్తుంటారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి.. ద్వాదశి నాడు స్వయం పాకం చేసి ఉపవాసం వదులుతారు భక్తులు. ఈ క్షీరాబ్ది ద్వాదశి.. నవంబర్‌ 15 సోమవారం ఉదయం 6.39 గంటల నుంచి 16 ఉదయం 8.01 గంటల వరకు ఉంటుంది.


కార్తీక సోమవారం భోళా శంకరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వారం కాగా ద్వాదశి విష్ణువుకూ ఇష్టమైన వారం కావడం విశేషం. ఈ క్రమంలోనే ఈ రోజున భక్తులు ఉసరి చెట్టు మొదల్లో దీపం పెడితే చక్కటి ప్రయోజనాలుంటాయి. నెల రోజుల పాలు పూజించని వారు ఒక్క రోజు అనగా సోమవారం పూజ చేస్తే కనుక అంతటి ప్రయోజనాలుంటాయని పెద్దలు వివరిస్తున్నారు. సోమవారం రోజున గుడికి వెళ్లి శివుడికి దీపం పెట్టినట్లయితే కోరిక కోరికెలు నెరవేరడంతో పాటు పుణ్యం కూడా వస్తుందట.

Lord Shiva 1

Lord Shiva 1

ఈ రోజు శివాలయంలో అడుగు పెడితే చాలు..చాలా మంచి జరుగుతుంది. ఇక ఆ రోజు దానధర్మాలు చేస్తే కనుక ఏడాది పాపాలతో పాటు సర్వ దరిద్రాలు తొలగిపోతాయి. ద్వాదశి రోజున భక్తులు తులసి కోట ముందర దీపాలు వెలిగించాలి. అలా చేస్తే కనుక యజ్ఞ ఫలితం దక్కుతుంది. ద్వాదశి రోజున ఎర్లీ మార్నింగ్ లేచి తులసి కోటను అలంకరించుకుని సూర్యుడు అస్తమించే సమయంలో పూజలు చేస్తే కనుక అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయట.

Lord Shiva

Lord Shiva

ఇకపోతే ఏవేని దోషాలు ఉన్నాయని అనుకునే వారు తులసి కోట వద్ద 365 వత్తిలను అక్కడ వెలిగిస్తే కనుక ఏడాది పాపాలు తొలగిపోతాయట. ఇకపోతే గృహిణులు భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తే చాలు.. మాంగళ్య బలం చేకూరుతుంది. శైవ భక్తులు కచ్చితంగా శివనామస్మరణ చేస్తూనే ఉండాలి.సూర్యోదయానికి ముందరే స్నానం చేసి హరహర శంభో అనుకున్న మాత్రం చేతనే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇకపోతే దీపారాధన అనంతరం తప్పకుండా శివుడికి అభిషేకం కూడా చేయాలి. అలా చేస్తే యాగాలు చేసినంత ఫలితం దక్కుతుంది.

Tags

Latest News

Related News