Lord Shiva : శివుడి ఆజ్ఞ లేనిది చీమ అయినా ఎవరినీ కుట్టదని పెద్దలు అంటుంటారు. లోకం మొత్తం పరమశివుడి కంట్రోల్‌లోనే ఉంటుందని వివరిస్తుంటారు. ఈ క్రమంలోనే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడికి పూజలు చేస్తుంటారు. అయితే, సాధారణ సమయాల్లో కంటే కూడా కార్తీక మాసంలో నీలకంఠుడికి పూజలు చేస్తే చక్కటి ప్రయోజనాలుంటాయని పెద్దలు చెప్తున్నారు. మంజునాథుడికి ఇష్టమైన కార్తీకమాసంలో పరమేశ్వరుడిని ఇలా పూజించాలి…
Lord Shiva 2
కార్తీక మాసంలో శివుడికి పూజలు చేస్తే చక్కటి ఫలితాలుంటాయని, అంతా శుభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలలో ఆ భోళా శంకరుడికి పూజలు చేస్తే చక్కటి ప్రయోజనాలుంటాయని పండితులు వివరిస్తున్నారు. ఆ రోజున ప్రతీ ఒక్కరు అనగా స్త్రీ, పురుష అనే లింగ భేదం లేకుండా అందరూ పరమ శివుడికి పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. సర్వ దు:ఖాలు తొలగిపోయి ఆనందంగా జీవించొచ్చు.
ఏదేని విషయంలో చాలా కాలం నుంచి బాధపడుతున్న వారయితే కనుక కార్తీక సోమవారాలలో శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయాలి. వారు అలా చేస్తే వారికి ఆ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. గంగా జలంతో అభిషేకం చేస్తే కనుక అనుకున్న కోరికలన్ని నెరవేరుతాయి. దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది.
Lord Shiva
ఇటీవల కాలంలో చాలా మంది శనిదోషం గురించి తెలుసుకుని బాధపడతుంటున్నారు. వారి కార్తీక మాసంలో సోమవారాలలో శివ ధ్యానం చేస్తే మంచి జరుగుతుంది. కాలసర్పదోషాలున్న వారు సైతం కార్తీక మాసంలోని సోమవారాలలో శివుడిని పూజించడంతో పాటు ధ్యానం చేస్తే ఆ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఇక శత్రు భయం ఉన్న వారు ఆ బాధలు పోవాలంటే కనుక మహా మృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష మాలతో జపం చేసి పూజలు చేస్తే కనుక వారికి ఎటువంటి ఆపదలు కలుగబోవు. అలా చేయడం వలన మీ బాధలతో పాటు మృత్యు భయం తొలగిపోతుంది.
Lord Shiva 1
చాలా మంది కార్తీక మాసంలోని సోమవారాలలో పరమ శివుడిని పూజించడానికి వెళ్తుండటం మనం చూడొచ్చు. ఈ మాసంలోని సోమవారాలలో త్రినేత్రుడు అయినటువంటి నీలకంఠుడిని పూజిస్తే కనుక సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు పేర్కొంటున్నారు. శివ శివ అని జపిస్తూ శివాలయంలో శైవ భక్తులు కార్తీక మాసంలో శివాలయాల వద్దకు పోటెత్తుతుంటారు. భక్తి శ్రద్ధలతో ఈ మాసంలో పూజలు చేస్తే మిగతా సమాయాల్లో చేసిన పూజల కంటే కూడా ఎక్కువ ఫలితాలుంటాయని పండితులు చెప్తున్నారు. రుద్రాక్ష మాలతో శివుడికి ఇష్టమైన సోమవారం రోజున శైవాలయంలో జపం చేస్తే భక్తులకు మంచి జరుగుతుంది.