Lord Shiva : పరమ శివుడిని భక్తులు అత్యంత భక్తి, శ్రద్ధలతో పూజిస్తుంటారు. లోకాలను పాలించే భోళా శంకరుడు తన మహిమలను భక్తులను కాపాడేందుకు ఉపయోగిస్తుంటాడని పెద్దలు చెప్తుంటారు. లోకేశ్వరుడు నిత్యం ప్రజల చేత పూజలందుకుంటాడు. అయితే, శాస్త్రం, హిందూ పురాణాల ప్రకారం మ్యారేజ్ కాని యువతులు పరమ శివుడిని పూజించొచ్చా? శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? శివలింగం అర్థమేమిటి అనే విషయాలు తెలుసుకుందాం.
Lord Shiva 2
హిందువుల ఆరాధ్య దైవమైన పరమ శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సోమవారం. ఆ రోజున హిందువులు అతి పవిత్రంగా ఉంటారు. మాంసాహారం తినబోరు. కూరగాయల ఆహారం తీసుకుంటూ శివుడి చిత్రపటాలను, విగ్రహాలను పూజిస్తుంటారు. అయితే, చాలా దేవాలయాల్లో శివుడు లింగరూపంలోనే ఉండటం మనం చూడొచ్చు. ఏ శివాలయానికి వెళ్లినా అక్కడ శివుని విగ్రహం ఉండదు. లింగం మాత్రమే ఉండటం మనం చూడొచ్చు. పెళ్లి కాని యువతులు శివలింగాన్ని పూజించొద్దని పెద్దలు చెప్తున్నారు. వారు ఎటువంటి శివుడిని పూజించాలంటే..
శివలింగం అంటే కేవలం ఒక భాగం మాత్రమే కాదు. అది మూడు భాగాలను కలిగి ఉంటుంది. శివలింగం కింది భాగం బ్రహ్మదేవుని రూపంగా, మధ్య భాగం విష్ణు రూపంగా, పై భాగం శివరూపంగా పిలుస్తారు. లింగం కింద ఉండే భాగాన్ని యోని అని పిలుస్తారు. యోని-లింగం సంగమమైన శివలింగం విశ్వాసానికి ప్రతీక అని భక్తులు కొలుస్తుంటారు. సమస్త విశ్వం ఇందులోనే ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అనగా శివలింగంలో ఉండేటువంటి లింగం, యోని భాగాలు హ్యూనర్ రీ ప్రొడక్షన్ సిస్టమ్ అనగా ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అవయవాలను సూచిస్తాయి.
Shiva-lingam
హిందూ పురణాల ప్రకారం.. లింగం అనగా నాశనం లేనిది, స్థిరమైనది, దృఢమైనదని అర్థం. శక్తిని జనింపజేసే శక్తి లింగానికి ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అనంతమైన శక్తి లింగం నుంచి ఉద్భవించబడుతుందని భక్తులు భావిస్తుంటారు. అయితే, ఓం నమ:శివాయ అనే మంత్ర స్మరణ చేతనే లింగారాధన జరిగినట్లు భావించాలని పెద్దలు చెప్తున్నారు. మంత్ర ఉచ్ఛరణ చేతనే సాక్షాత్తు శివుడు తన శక్తిని భక్తుల్లోకి ప్రవహింపజేస్తాడు.
Lord Shiva
మ్యారేజ్ కాని యువతులు శివలింగాన్ని కాకుండా పార్వతీ దేవితో కలిసి ఉన్నటువంటి శివున్ని పూజించాలి. అలా చేయడం వలన సత్ప్రయోజనాలుంటాయి. పార్వతీ దేవీ సమేతంగా ఉన్నటువంటి శివుడిని 16 రోజుల పాటు సోమవారాలు ఉప వాసం ఉండి పూజలు చేస్తే చక్కటి ప్రయోజనాలుంటాయి. శివుడు అలా ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన యువతులకు అత్యంత తక్కువ సమయంలోనే మంచి వరుడిని ప్రసాదిస్తాడు.