Lunar Eclipse : ఈ నెల 19న చంద్రగ్రహణం ఏర్పడనుందని ఇప్పటికే వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అందరికీ ఈ విషయం తెలిసింది కూడా. కాగా, ఈ రోజున ఏ నియమాలు జ్యోతిష్య, వాస్తు శాస్త్ర నిపుణులు ఏం చెప్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం.
ఈ ఏడాది నవంబర్ 19న అనగా శుక్రవారం రోజున కార్తీకపౌర్ణమి రోజున వృషభరాశిలో రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఇది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 18, 19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనపడనుంది. ఇకపోతే ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని ఉత్తర అమెరికా ఖండంలోని 50 కంట్రీస్ పీపుల్ పూర్తిగా వీక్షించొచ్చు.
దక్షిణ అమెరికా ఖండంలోని మెక్సికోలోనూ ఈ గ్రహం కనబడుతుంది. ఈ గ్రహణం 3.28 గంటల పాటు కొనసాగనున్నది. భారత కాలమానం ప్రకారం.. ఈ నెల 19న మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రగ్రహణం పీక్ స్టేజ్‌కు వెళ్తుంది. 2001 నుంచి 2100 మధ్య ఏర్పడిన అత్యంత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఇదే కావడం గమనార్హం. ఇది పాక్షిక చంద్ర గ్రహణమే అయినప్పటికీ ఏకంగా 3 గంటల 28 నిమిషాల పాటు ఈ గ్రహణం ఉండనుంది. అంతసేపు ఈ గ్రహణం ప్రజలకు కనువిందు చేయనుంది.
Lunar Eclipse
ఇకపోతే ఈ గ్రహణం ఉభయ తెలుగు రాష్ట్రాలకు వర్తించబోదని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం 2.27 గంటలకు చంద్రగ్రహణం ఏర్పడుతుందన్నారు. కాగా, ఎవరూ ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. పౌర్ణమి గడియలు ఉన్నప్పటికీ అస్సలు ఆందోళన చెందొద్దు. ఎందుకంటే ఇది మన దేశంలో ఏర్పడే గ్రహణం కానే కాదు. గర్భిణులు కాని సాధారణ మహిళలు కాని ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు.
ఈ చంద్రగ్రహణానికిగాను ఎటువంటి సంప్రదాయ ఆచారాలు ఏవీ కూడా పాటించాల్సిన పని లేదు. గర్భిణులు కూడా ఎటువంటి భయాందోళనలు పడాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ప్రతీ రోజు మాదిరిగానే ఆ రోజు కూడా ఉండొచ్చు. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడి ఉపరితలం మొత్తం కూడా 97 శాతం రెడిష్‌గా కనబడుతుంది. చంద్రుడు ఎవరికీ కనబడకుండా పాక్షిక గ్రహణం అడ్డుకుంటుంది. అయితే, అరుణ వర్ణంలో ఉన్నటువంటి చంద్రుడు బ్లడ్ , సూపర్ మూన్‌గా కనబడతాడు. ఈ బ్లడ్ మూన్ ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అరుణాచల్ ప్రదేశ్, అస్సాంతో పాటు తదితర రాష్ట్రాల్లో స్వల్పంగా కనిపించనున్నారు. సూర్యునికి, భూమికి చంద్రుడు ఒకే స్ట్రెయిట్ లైన్‌లో రేఖలో ఉన్నపుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందన్న సంగతి అందరికీ విదితమే.