Makar Sankranti : న్యూ ఇయర్ సంబరాలు ముగిసాయి.. ఇక మరో రెండు రోజుల్లో సంక్రాంతి సంబరాలు మొదలు కానున్నాయి.. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా సంక్రాంతిని బాగా జరుపు కుంటారు.. మన తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగల్లో ఇది ఒకటి.. సంక్రాంతి రోజున సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుండి మకరరాశిలో సంచరిస్తాడు..
అందుకే ఈ పండుగను మకర సంక్రాంతి అని పిలుస్తారు.. ఇక ఈ పండుగ రోజు మీరు ఇప్పుడు చెప్పుకోబోయే పనులను అస్సలు చేయకండి.. అలా చేస్తే మంచిది కాదు అరిష్టం అని చెబుతున్నారు. మరి ఆ పనులేంటో ఇప్పుడు చూద్దాం.
దాతృత్వ సంప్రదాయం : ఈ పండుగ రోజున దానము చేసిన నదీ స్నానం చేసిన మంచిది ఫలితం దక్కుతుంది అని నమ్ముతారు. ఈ రోజున ఎవ్వరు వచ్చిన ఖాళీ చేతులతో పంపించ కూడదట.. అలా దానం చేస్తే మీకు మంచిది అంటున్నారు.
స్నానం చేయకుండా తినకూడదు : మకర సంక్రాంతి రోజు స్నానం చేయకుండా ఆహారం తీసుకోకూడదు.. అలాగే సాయంత్రం, రాత్రి వేళల్లో కూడా తినకూడదు.
వెల్లుల్లి-ఉల్లి తినకూడదు : మకర సంక్రాంతి రోజును హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు.. ఈ రోజున వెల్లుల్లి-ఉల్లి తింటే కోపంతో చెడ్డ మాటలు మాట్లాడతారని పెద్దలు చెబుతుంటారు..
చెట్లను నరకకూడదు : మకర సంక్రాంతి రోజున చెట్లను నరకడం మంచిది కాదట. రైతులు ఈ పండుగను జరుపుకుంటారు.. అందుకే దీనిని ప్రకృతి పండుగ అంటారు.. మరి అలాంటి పవిత్రమైన రోజున ఇలా చేస్తే పాపం తగులుతుందని పండితులు చెబుతున్నారు.
మాంసం, మద్యం జోలికి పోకూడదు : మకర సంక్రాంతి రోజున మాంసం, మద్యం వంటి పనులు చేయకూడదు.. అలాగే మకర సంక్రాంతి రోజున పశువుల నుండి పాలు తీయకూడదు అని కనుమ రోజున మనం పశువులను పూజిస్తాం.. కాబట్టి అలాంటి పండుగ రోజున పాలు పితకకూడదు..
Also Read : Aarthi Agarwal : ఆ నిర్మాత గెస్ట్ హౌస్ లో రెండేండ్లు ఉన్న ఆర్తి అగర్వాల్.. ఆ పని కోసం..!
Also Read : Chandra Mohan : చంద్రమోహన్ మేనల్లుడు స్టార్ ప్రొడ్యూసర్ అని మీకు తెలుసా..?