Mantra: కోరిక లేని మనిషి ఉన్నాడంటే అతడు తప్పక పరిపూర్ణ జ్ఞాని లేదా సన్యాసి అయి ఉండవచ్చు. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఒక కోరిక ఉంటూనే ఉంటుంది. అది తీరిపోగానే మరొకటి వస్తుంది. అయితే ధర్మబద్ధమైన కోరికలు అయితే భగవంతుడి అనుగ్రహంతో వాటిని తీర్చుకోవచ్చు. దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం…
మనకు ఉన్న ప్రతి కోరిక నెరవేరాలంటే ప్రతి ఒక్కరు దేవతారాధన చేయాల్సిందే. దీనివల్ల మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ప్రత్యేకమైన మంత్రాలతో భగవధారాధన చేయడం వల్ల మనకు ఉన్న కోరికలు నెరవేరుతాయి. దానిలో మొదటగా తెలుసుకోవలసినవి ఏమిటంటే ఇది స్త్రీలకు. సుమంగళి స్త్రీలు, వివాహం కాని అమ్మాయిలు ఎవరైనా చేసుకోవచ్చు. ప్రతి సుమంగళి స్త్రీలు మనసులో కోరుకునే కోరిక ఎల్లప్పటికీ సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటారు. వారివారి భర్తతో పిల్లలతో కలిసిమెలిసి సుఖంగా దీర్ఘ సుమంగళిగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి సౌభాగ్యం ఎప్పటికీ ఉండాలంటే అమ్మవారికి సంబంధించిన చిన్న మంత్రం ఉంది. ఉదయాన్నే స్నానం చేసి ఈ అమ్మవారి మంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి. అమ్మవారి కృప వల్ల మాంగల్య బలం గట్టిగా ఉంటుంది. కొంతమంది స్త్రీలకి జాతక చక్రంలో అప మృత్యు దోషాలు ఉంటాయి. మరికొందరికి అపమృత్యు సమయం కొన్నిసార్లు వస్తుంది. అయితీ ఇటువంటి వారు అందరూ ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం మంచిది. లేదంటే ప్రతిరోజు చేయలేనివారు మంగళవారం రోజు, శుక్రవారం రోజు పౌర్ణమి గడియల్లో, అష్టమి, నవమి తిథుల్లో మరచిపోకుండా తప్పక జపించి నట్లయితే ఈ మంత్రం మంచి ఫలితాన్నిస్తుంది.
ఆ మంత్రం ‘‘ ఓం హ్రీం శ్రీం సువాసిని అర్చన ప్రీతయే నమః’’ ఈ మంత్రం అర్థం ఏమిటంటే ఐ బీజానికి అర్థం సరస్వతి అమ్మవారు అని అర్థం హ్రీం అనగా దుర్గామాత శక్తి అని అర్థము, శ్రీ అనగా లక్ష్మీ అమ్మవారు అని అర్థము సరస్వతి పార్వతి లక్ష్మి అమ్మవార్లను ఈ ముగ్గురు అమ్మవార్లను ఒకటే సారి పూజిస్తాము. కనీసం 21 లేదా 11 సార్లు అయినా జపిస్తే మంచి ఫలితం వస్తుంది. సువాసిని అర్చన నమః అంటే పెళ్ళయిన స్త్రీలు అమ్మవారిని పూజించడం వల్ల మీ మాంగల్యబలం ని గట్టిగా ఉంచుతుంది. ఐదోతనం పెరుగుతుంది. అవివాహిత స్త్రీలకు ఇష్టమైన వరుడు రావాలంటే 11 సార్లు ఈ మంత్రాన్ని జపించడం వల్ల అమ్మవారి కటాక్షం వల్ల మంచి వరుడు వస్తాడు. జీవితమంతా కళకళలాడుతుంది. ఏ పని చేసిన ఈ జపం చేసిన గట్టి నమ్మకంతో విశ్వాసంతో చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ మంత్రం స్నానం చేసిన అనంతరం శుచి, శుభ్రతతో జపించాలి. నమ్మకం లేదా విశ్వాసం ప్రధానం. అమ్మవారి ఎదుట కూర్చొని నిర్మలమైన మనస్సుతో ఈ మంత్రాన్ని జపించాలి.