Siddha Ganesha: విజయం.. ప్రతి ఒక్కరు జీవితంలో చేసే పనులలో విజయం సాధించాలనుకుంటారు. చదువు, ధన సంపాదన, పోటీపరీక్షలు.. ఇలా చేపట్టిన పనులలో అపజయం లేకుండా జయం పొందాలని భావిస్తారు. అయితే దీనికి మన పూర్వీకులు కష్టపడి శ్రమించాలి, దీంతోపాటు భగవత్ అనుగ్రహం కావాలి అని పేర్కొన్నారు.. దీనికోసం అనేక పరిహారాలు తెలిపారు.. దీనిలో గణపతి ఆరాధన అందులోనూ సిద్ధి గణపతి రూపాన్ని ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుందని తెలిపారు. ఆ ఆరాధన విశేషాలు తెలుసుకుందాం…
Need Success Pray to Siddha Ganesha
సిద్ధిగణపతి రూపం : ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పండిన మామిడిపండు, ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు. ఈయనను….
‘‘పక్వచుత ఫల పుష్పమంజరీ
ఇక్షుదండ తిలమోదకై స్సహ
ఉద్వహన్ పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత హేమం పింగల
అనే మంత్రంతో స్తుతించాలి.’’
ఈ సిద్ధి గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు. భక్తి, శ్రద్ధలతో ఈ గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.