Pydithalli Ammavaru: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడితల్లి ఘన చరిత్ర ఇదీ.!

Pydithalli Ammavaru: గజపతిరాజుల ఆడపడుచు మాత్రమే కాదు.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు అయిన పైడితల్లి అమ్మవారి భక్తగణం తెలుగు నేల మీదనే కాదు, పొరుగు రాష్ట్రాల్లోనూ వున్నారు. విదేశాల్లోని తెలుగువారూ పైడితల్లి సిరిమానోత్సవం చూసేందుకు ప్రత్యేకంగా వస్తుంటారు. కోరిన కోరికలు నెరవేర్చే కల్పవల్లిగా పైడితల్లి అమ్మవారిని పూజిస్తారు భక్తులు. ప్రతి ఏడాదీ విజయదశమి తర్వాత వచ్చే తొలి సోమ, మంగళవారాల్లో విజయనగరంలో పైడిమాంబ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా సిరిమానోత్సవాన్ని నిర్వహిస్తోంది. లక్షల సంఖ్యలో […].

By: jyothi

Published Date - Thu - 14 October 21

Pydithalli Ammavaru: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. పైడితల్లి ఘన చరిత్ర ఇదీ.!

Pydithalli Ammavaru: గజపతిరాజుల ఆడపడుచు మాత్రమే కాదు.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు అయిన పైడితల్లి అమ్మవారి భక్తగణం తెలుగు నేల మీదనే కాదు, పొరుగు రాష్ట్రాల్లోనూ వున్నారు. విదేశాల్లోని తెలుగువారూ పైడితల్లి సిరిమానోత్సవం చూసేందుకు ప్రత్యేకంగా వస్తుంటారు. కోరిన కోరికలు నెరవేర్చే కల్పవల్లిగా పైడితల్లి అమ్మవారిని పూజిస్తారు భక్తులు. ప్రతి ఏడాదీ విజయదశమి తర్వాత వచ్చే తొలి సోమ, మంగళవారాల్లో విజయనగరంలో పైడిమాంబ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా సిరిమానోత్సవాన్ని నిర్వహిస్తోంది. లక్షల సంఖ్యలో భక్తులు సిరిమానోత్సవానికి విచ్చేస్తారు.. అమ్మవారి కృపాకటాక్షాలు పొందుతారు.

చరిత్రలోకి తొంగి చూస్తే..

గజపతిరాజుల ఆడపడుచు అయిన పైడిమాంబ, బొబ్బిలి యుద్ధం తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆత్మబలిదానం చేసుకుంటుంది. వివరాల్లోకి వెళితే, 1757 జనవరి 23 బొబ్బిలిపై విజయనగరం రాజు పెద్ద విజయరామరాజు, బొబ్బలి సంస్థానాధీశుడు రాజా గోపాల కృష్ణ రంగారావుపై దండెత్తుతారు. విజయనగర సేనలకు ఫ్రెంచ్ సేనాధిపతి బుస్సీ అండగా నిలుస్తాడు. యుద్ధమంటే వినాశనమని అన్న విజయరామరాజుని వారిస్తుంది. అయితే సోదరి మాటను విజయగజపతి పెడచెవిన పెట్టారు. యుద్ధంలో బొబ్బలి కోట ధ్వంసమవుతుంది. మరోపక్క, తనకు అనారోగ్యం సంభవించడంతో అన్నకు కబురు పెడుతుంది పతివాడ అప్పలనాయుడు అనే సైనికుడితో పైడిమాంబ. యుద్ధాన్ని ఆపేందుకు తాను కూడా బయల్దేరుతుంది అనారోగ్యంతో వున్నప్పటికీ. అయితే, తాండ్ర పాపారాయుడు, విజయరామరాజుని హతమార్చాడన్న వార్త తెలుసుకున్న పైడిమాంబ, అన్న లేని లోకంలో తాను జీవించలేనంటూ పెద్ద చెరువులోకి దూకి ఆత్మబలిదానం చేసుకుంటుంది. అనంతరం అప్పలనాయుడు కలలో కనిపించి, పెద్ద చెరువుకి పశ్చమం వైపు తన విగ్రహం దొరుకుతుందని, దానికి ఆలయం కట్టించాల్సిందిగా చెబుతుంది పైడిమాంబ. ఆమె చెప్పినట్టుగానే పెద్ద చెరువులో వెతకగా, పైడితల్లి విగ్రహం దొరుకుతుంది. విగ్రహాన్నే చెరువు ఒడ్డున ప్రతిష్టించి దేవాలయాన్ని నిర్మించారు.

పైడిమాంబనే అన్నీ ఆజ్ఞాపిస్తుంది..

జాతరకు కొన్ని రోజుల ముందు ప్రధాన అర్చకుడికి కలలో దర్శనమచ్చి, జాతరకు సంబంధించి ఏమేం చెయ్యాలో పైడిమాంబ సూచిస్తుంటుంది. సిరిమాను కోసం ఉపయోగించే కలప లభించే చెట్టు దగ్గర్నించి, అన్ని విషయాలూ పైడిమాంబ చెబుతుంది. ఆమె చెప్పినట్లే అన్నీ జరుగుతాయి. 50 అడుగుల సిరిమాను, సిరిమానోత్సవంలో ప్రత్యేక ఆకర్షణ. బండిపై సిరిమానుని అమర్చుతారు. సిరిమాను చివర్న పూజారిని అమ్మవారి ప్రతినిథిగా కూర్చబోడెతారు. పూజారికి ఫలాల్ని, పువ్వుల్ని సమర్పిస్తుంటారు భక్తులు. గుడి దగ్గర్నుంచి కోటవరకు సిరిమాను సంబరం జరుగుతుంది.

భక్తుల కోరికలు నెరవేర్చే కల్పవల్లి పైడిమాంబ..

సంతానం లేనివారు పైడిమాంబని మొక్కుకుంటారు. ఉద్యోగాన్వేషణలో వున్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు.. ఇలా నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పైడిమాంబని వేడుకుంటారు. తమ కోరికలు నెరవేరినవారు, అమ్మవారికి మొక్కుకున్న తర్వాత కష్టాలు తీరినవారు.. తిరిగి అమ్మవారిని మరోసారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. వ్యాపారాభివృద్ధి కోసం ఎక్కువమంది భక్తులు పైడిమాంబ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంటుంది. ఆషాఢ మాసంలో, శ్రవాణ మాసంలో, సంక్రాంతి సమయంలో దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది.

విజయనగరం వెళ్ళడానికి బస్సు, రైలు మార్గం అందుబాటులో వుంది. విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటే, అక్కడి నుంచి విజయనగరం చేరుకోవడం తేలిక.

Tags

Latest News

Related News