Ram Setu ఒకప్పడు దేవుళ్లు నివసించిన, తిరిగిన ప్రదేశాలనే దేవాలయాలుగా నిర్మించారు. దేవుళ్లు తిరిగిన ప్రదేశాలు అంటే కొంతమంది నమ్మరు. కొన్నింటిని సైంటిఫిక్ గా చూస్తారు. అప్పుడు ఇంత పరిజ్ఞానం, టెక్నాలజీ లేకున్నా పెద్ద పెద్ద రాళ్లతో, జీవకళ ఉట్టి పడేటట్టు దేవాలయాలు నిర్మించారు. అవి ఎలా సాధ్యం అయ్యాయని అందరి మదిలో వేధించే ప్రశ్న.
హిందువుల దృష్టిలో రాముడు దేవుడు. పురాతనంలో ఆయన ఒక రాజు. అందుకే రామాయణంలో పేర్కొన్న ప్రాంతాలు, సంఘటనల్లో కొంతవరకు వాస్తవం ఉందని నమ్ముతారు. ముందుగా నమ్మకమైనది రామసేతుబంధనం.
రామాయణంలోని యుద్ధం జరిగేటప్పుడు రామసేతు నిర్మాణం ముఖ్యమైనది, వానరుని నేతృత్వంలో కోటిమంది వానరులు కలిసి అయిదు రోజుల్లో లంకకు పోయేందుకు వారధిని నిర్మించారు. ఈ వారధి రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటి నుంచి శ్రీలంక దగ్గర ఉన్న మన్నార్ తీరం వరకు నిర్మించారు. అందుకనే అప్పట్లో రామేశ్వరాన్ని ‘సేతుబంధ రామేశ్వరం’ అని పిలిచేవారు. రామాయణం అయిపోయాక కూడ శతాబ్దాల నుంచి ఈ వారధి నడవడానికి అనువుగానే ఉండేది. 10వ శతాబ్దంలో మన దేశాన్ని సందర్శించిన అరబ్ యాత్రికులు సైతం ఇక్కడ ఒక వారధి నిర్మించినట్లు తెలిపారు. అయితే 14వ శతాబ్దం వరకు ఈ వంతెన అలానే ఉంది. కానీ 1480లో పెను తుఫాను రావడంతో ఈ వంతెన ధ్వంసమైంది. ఆ తరువాత రామసేతు గురించి అందరూ మర్చిపోయారు. ఏదైన మన కండ్ల ముందు ఉన్నంత వరకే దాని ఉపయోగం. అది కనపడకపోతే కనుమరుగైనట్టే. మాట్లాడుకోవడం తప్ప ఏమీ ఉండదు. ఇప్పుడు రామసేతు పరిస్థితి అలానే ఉంది.
2002లో నాసా అంతరిక్షం నుంచి తీసిన ఒక చిత్రంలో రామసేతు స్పష్టంగా కనిపించింది. దాంతో ఈ వంతెన గురించి మళ్లీ చర్చ మొదలుపెట్టారు. ఈ వారధి గురించి శాస్త్రీయ కారణాలను వెతికేందుకు ఎంతో ప్రయత్నం చేశారు.
రామసేతు దగ్గర కనిపంచే రాళ్లు నీళ్లలో తేలుతాయి. లావాతో ఏర్పడే ప్యూమిస్ రాళ్లని, అందుకే అవి నీటిలో తేలుతున్నాయనీ కొందరు వాదిస్తున్నారు. కానీ ప్యూమిస్ రాళ్లు కొద్దిసేపు మాత్రమే నీటిలో తేలుతాయి. ఇవి రాముని మహిమతోనే వేల ఏళ్లు నీటిపై తేలుతున్నాయన్నది భక్తుల నమ్మకం. పైగా ఈ రాళ్లను పరీక్షించినప్పుడు అవి రామాయణ కాలానివే అని తేలింది. దాంతో నాసా కూడా రామసేతు జోలికి రాలేదు. ఈ వివాదంతో తనకేమీ సంబంధం లేదంటూ తప్పుకొంది.
ఇక్కడో ఇంకో ట్విస్టు ఏమిటంటే శ్రీలంక ప్రభుత్వం కూడా ఇది రాముడు నిర్మించిన వారధే అని ఇప్పటికీ ప్రచారం చేస్తోంది. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన ఇప్పటికీ సముద్రం మీద తేలుతూ కనిపిస్తుంది. దాన్ని చూస్తే అది రాముడు నిర్మించిన నిర్మాణమే అన్న నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకనే గత ప్రభుత్వం ఈ వారధని తవ్వి శ్రీలంకకు దారి నిర్మించే ప్రయత్నం చేశారు. ఆస్తికులంతా ఒక్కటై నిర్మించవద్దని అడ్డుకున్నారు. మరో ఆశ్ఛర్యకరమైన విషయమేమిటంటే శ్రీలంకలోని కొందరు ఈ వంతెనను రావణాసురుడు నిర్మించినదని నమ్ముతారు. రావణుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు భారతదేశంలోకి ప్రవేశించేలా ఈ వారధిని నిర్మించాడని వారు భావిస్తారు. రావణాసురుడు కోరుకున్నప్పుడల్లా ఈ వారధి పైకి తేలుతుందనీ, అవసరం లేనప్పుడు అది నీటి అడుగున ఉండిపోతుందనీ శ్రీలంకేయులు చెప్పుకుంటారు. రావణాసురుడు శ్రీలంక వారికి దేవుడు. రావణాసురుడిని వారు దేవునిగా కొలుస్తారు. ఆయనకు పూజలు చేస్తారు. రావణాసురుడు అంటే వారికి అమితమైన భక్తి.
అసలు తేలే రాళ్ల వెనుక ఉన్న రహస్యమేంటో ఇంతవరకూ ఎవరికి అంతుచిక్కని ప్రశ్న.
శాస్త్ర విజ్ఞానికి, ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న ఘర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది.