Kolhapur Mahalaxmi Temple: కొల్హాపూర్ మహాలక్హ్మీ ఆలయం: ఒక్కరోజులోనే వెలసిందా.?

Kolhapur Mahalaxmi Temple: లక్ష్మీదేవిని పూజించని హిందువులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అమ్మవారికి ఇష్టమైన శుక్రవారంను మహిళలు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. అయితే, లక్హ్మీదేవికి విడిగా ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. వైష్ణవాలయాల్లో శ్రీ మహా విష్ణువుతో కలిసి, మహా లక్హ్మి అమ్మవారు కూడా కొలువై కనిపిస్తారంతే. చాలా అరుదుగా మాత్రమే సిరి గల తల్లి లక్ష్మీదేవికి ఆలయాలు కడుతూ ఉంటారు. అలాంటి వాటిలో ప్ర్యతేకమైనది కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయం. ఈ ఆలయం మహారాష్ర్ట […].

By: jyothi

Published Date - Sun - 26 September 21

Kolhapur Mahalaxmi Temple: కొల్హాపూర్ మహాలక్హ్మీ ఆలయం: ఒక్కరోజులోనే వెలసిందా.?

Kolhapur Mahalaxmi Temple: లక్ష్మీదేవిని పూజించని హిందువులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అమ్మవారికి ఇష్టమైన శుక్రవారంను మహిళలు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. అయితే, లక్హ్మీదేవికి విడిగా ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. వైష్ణవాలయాల్లో శ్రీ మహా విష్ణువుతో కలిసి, మహా లక్హ్మి అమ్మవారు కూడా కొలువై కనిపిస్తారంతే. చాలా అరుదుగా మాత్రమే సిరి గల తల్లి లక్ష్మీదేవికి ఆలయాలు కడుతూ ఉంటారు. అలాంటి వాటిలో ప్ర్యతేకమైనది కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయం. ఈ ఆలయం మహారాష్ర్ట లోని పంచ గంగా నది ఒడ్డున ఉన్నది. శ్రీ మహావిష్ణువుకీ, లక్ష్మీదేవికి ఇది అవిముక్త క్షేత్రం. అంటే ఎప్పుడూ ఈ క్షేత్రంలోనే అమ్మవారు, స్వామితో కలిసి ఉంటుందన్న మాట. పరమ శివుడికి కాశీ ఎలాగో, శ్రీ మహావిష్ణువుకీ, లక్ష్మీదేవికి ఈ క్షేత్రం అలాంటిదని నమ్ముతారు. అమ్మవారి శక్తి పీఠాల్లో ఈ క్షేత్రం ఒకటిగా పిలుస్తారు. సతీదేవి అవయవాల్లో  అమ్మవారి రెండు నయనాలు ఇక్కడ పడ్డాయని అంటారు. అంతేకాదు, భ్రుగు మహర్షి చేసిన పనికి, విష్ణువుపై ఆగ్రహించిన లక్ష్మీదేవి, ఈ కొల్హాపూర్ లోయల్లోనే తపస్సు చేసిందనీ, అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చిన స్వామివారు, అమ్మతో కలిసి అక్కడే కొలువై ఉండిపోయారనీ అంటారు.

ఈ ప్రాంతానికి కొల్లాపూర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే..

పూర్వం కొల్హాసురుడు అనే రాక్షసుడుండేవాడట. ఆయనే ఈ ప్రాంతాన్నిపాలించేవాడట. ఒకనాడు శివుని తపస్సు కోసం కొల్హాసురుడు, అడవికి వెళ్లగా, ఆయన సోదరుడు ఈ ప్రాంతాన్ని అపహరించాడట. తపస్సు అనంతరం అద్వితీయ శక్తులు పొంది వచ్చిన కొల్హాసురుడు, తన సోదరున్ని చంపి, తన రాజ్యాన్ని వెనక్కి తీసుకున్నాడట. కాల క్రమంలో ఆ ప్రాంతాన్ని తన కొడుకు కరవీరుడిని ఈ నగరానికి రాజును చేశాడు. ఆ తర్వాత దేవతలతో జరిగిన యుద్ధంలో శివుడు ఈ కరవీరుడిని సంహరిస్తాడు. కరవీరుడు చనిపోతున్న సమయంలో శివుని నుండి ఓ వరం పొందుతాడు. తాను చనిపోయిన తర్వాత ఈ నగరం తన పేరు మీదుగా కరవీర పురంగా ప్రసిద్ధి చెందాలని కోరుకున్నాడట. తథాస్తు అన్నాడట పరమ శివుడు. పుత్రుని మరణం తర్వాత ఆగ్రహం వ్యక్తం చేసిన కోల్హాసురుడు దేవతలకు మహాలక్ష్మి అండ ఉండడంతోనే తమపై యుద్ధం గెలుస్తున్నారని, కఠోరమైన తపస్సు చేసి, మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకుని, వరం పొందాడట. 100 సంవత్సరాలు లక్ష్మీదేవి ఆ నగరంలో అడుగు పెట్టకూడదని వరం కోరాడట. లక్ష్మీదేవి తథాస్తు అన్నది. దాంతో కోల్హా సురుడు దేవతలపై అరాచకం సృష్టించాడట.

దేవతలు అమ్మవారిని మొరపెట్టుకోగా, రాక్షసుడికిచ్చిన మాట ప్రకారం 100 ఏళ్లు తాను ఆ ప్రాంతంలో అడుగు పెట్టనని చెప్పింది. ఆ గడువు గడిచిన తర్వాత, కొల్లాపూర్ చేరి, అమ్మవారే స్వయంగా ఈ రాక్షసుడిని అంతం చేసింది. అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా వెలిసిందంటారు. అంతేకాదు, ఒక్కరోజులోనే ఈ ప్రాంతం సృష్టించబడిందట. అమ్మవారి శక్తి పీఠాల్లో ఏడవ శక్తి పీఠంగా పిలవబడే ఈ క్షేత్రం అత్యంత ప్రసిధ్ధి చెందిందట.

సూర్య గ్రహణం రోజు స్నానం..

మూడున్నర కోట్ల తీర్ధాలు ఇక్కడ కొలువై ఉంటాయని అంటారు. అందుకే సూర్య గ్రహణం రోజు ఇక్కడ స్నానం చేస్తే, పంచ మహా పాతుకాలు పోతాయని భక్తుల నమ్మకం. అమ్మవారు కొలువై ఉన్న ఈ ప్రాంతంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా, శివుడు రాయి రూపంలోనూ, విష్ణువు జల రూపంలోనూ, మహర్షులు ఇసుక రేణువులుగానూ కొలువై ఉంటారనీ నమ్ముతారు.

 

పూజలు – ఉత్సవాలు విశిష్టత..

ఇక్కడి దానానికి విశేషమైన ప్రత్యేకత ఉంది. గోరంత దానం చేసినా, మేరు పర్వతమంత పుణ్యం దక్కుతుందని అంటారు. ఇక్కడ జరిగే కిరణోత్సవానికి విశేష ప్రాధాన్యత ఉంది.ఏడాదిలో మూడు రోజులు ప్రత్యేకంగా సూర్య భగవానుడు గర్భాలయంలోని అమ్మవారిపై కిరణాలను డైరెక్టుగా ప్రసరిస్తాడట. మొదటి రోజు కాళ్ల పైనా, రెండో రోజు నడుము భాగానా, మూడో రోజు తల భాగం పైనా సూర్య కిరణాలు ప్రసరిస్తాడట. ఈ అద్భుతం చూసేందుకు ఆ సమయంలో భక్తులు పోటెత్తుతారనీ చెబుతారు. అలాగే,  శ్రావణ మాసం, పౌర్ణమినాడు  ఇక్కడ జరిగే పూజలకూ ప్రత్యేక విశిష్టత ఉంది.

 

Latest News

Related News