Renuka Yellamma Temple : వింత ఆచారం: రేణుక ఎల్లమ్మ ఆలయానికి అలాగే ఎందుకు వెళ్లాలి.?

Renuka Yellamma: గుడికి వెళ్లాలంటే, సాంప్రదాయ దుస్తులు ధరించాలి.. అనే నియమం మన హిందూ సమాజంలో బాగా నాటుకుని ఉంది. అయితే, ఈ సాంకేతిక యుగంలో అమ్మాయిలు కాస్త ట్రెండీ దుస్తులను వాడుతున్నారనుకోండి. కొన్ని ప్రత్యేక దేవాలయాల్లో ఇప్పటికీ సాంప్రదాయ వస్ర్త ధారణ ఖచ్చితంగా అమలులో ఉంది. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మవారి గుడికి వెళ్లాలంటే, ఖచ్చింతగా నగ్నంగానే వెళ్లాలట. ఇదెక్కడి వింత ఆచారం అనుకుంటున్నారా.? అవునండీ నిజంగానే ఇది వింత ఆచారం. ఇప్పటికీ ఈ […].

By: jyothi

Published Date - Fri - 24 September 21

Renuka Yellamma Temple : వింత ఆచారం: రేణుక ఎల్లమ్మ ఆలయానికి అలాగే ఎందుకు వెళ్లాలి.?

Renuka Yellamma: గుడికి వెళ్లాలంటే, సాంప్రదాయ దుస్తులు ధరించాలి.. అనే నియమం మన హిందూ సమాజంలో బాగా నాటుకుని ఉంది. అయితే, ఈ సాంకేతిక యుగంలో అమ్మాయిలు కాస్త ట్రెండీ దుస్తులను వాడుతున్నారనుకోండి. కొన్ని ప్రత్యేక దేవాలయాల్లో ఇప్పటికీ సాంప్రదాయ వస్ర్త ధారణ ఖచ్చితంగా అమలులో ఉంది. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మవారి గుడికి వెళ్లాలంటే, ఖచ్చింతగా నగ్నంగానే వెళ్లాలట. ఇదెక్కడి వింత ఆచారం అనుకుంటున్నారా.? అవునండీ నిజంగానే ఇది వింత ఆచారం. ఇప్పటికీ ఈ ఆచారం అమలులో ఉందా.? అసలింతకీ ఈ వింత ఆచారం గల గుడి ఎక్కడుంది.? ఇప్పుడు తెలుసుకుందాం.

కర్ణాటక రాష్ర్టం శివమొగ్గ ప్రాంతంలోని చంద్ర గుట్ట అనే కొండపై ఈ దేవాలయం ఉంది. ఈ ప్రాంతంలోని  అర్ధ చంద్రాకార గుహలో ఈ అమ్మవారు  కొలువై ఉంది. ఈ కొడను గుత్తి కొండ అని కూడా అంటారు. ఈ గుహలో కొలువై ఉన్న అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారు.

పురాణ గాధ..

రేణుక, జమదగ్ని మహర్షి భార్య. ఆమె మహా పతివ్రత. కానీ, భర్త జమదగ్ని ముని అయినప్పటికీ మహా కోపిష్టి. భార్యను ఎక్కువగా వేధిస్తుంటాడు. కానీ, రేణుక మాత్రం సహనంతో ఆయనను ఓర్చుకుంటూ వస్తుంది. ఒకరోజు రేణుక పూజ కోసం నీటిని తెచ్చేందుకు ఒక కొలనుకు వెళుతుంది. అక్కడ గాంధర్వ జంట స్నానమాడుతుంటే, అలా చూస్తూ మైమరిచిపోతుంది. ఇంతలో సమయం దాటిపోతుంది. చీకటి పడుతుంది. ఉలిక్కి పడి ఇంటికి వెళ్లిన రేణుకను భర్త నిలదీస్తాడు. అనుమానిస్తాడు. ఆయన అనుమానంతో, భర్తను సంహరించాలనుకుంటాడు. కానీ, ఆ పని తాను చేయడు. కొడుకైన పరశురామునికి అప్పగిస్తాడు, తల్లి తలను నరికి నాకు బహుమతిగా ఇవ్వమని ఆజ్ణాపిస్తాడు. అంతట తండ్రి ఆజ్నను శిరసా వహిస్తాడు కొడుకు. తల్లిని ఓ కొండ గుహలోనికి తీసుకెళ్లి తన ఆయుధం అయిన గండ్ర గొడ్డలితో శిరస్సు ఖండిస్తాడు. ఆ తలను తెచ్చి తండ్రికి బహుమతిగా ఇస్తాడు. అది చూసిన తండ్రి పట్టరాని సంతోషంతో, కొడుకుకు ఏం వరం కావాలో కోరుకొమ్మంటాడు. తన తల్లిని తిరిగి బ్రతికించమని కోరుకుంటాడు పరశురాముడు. ఎంతటి కోపిష్టి అయినా జమదగ్ని చాలా శక్తివంతుడైన మహర్షి కావడంతో, తన శక్తితో తిరిగి రేణుకను బతికిస్తాడట. అలా అప్పుడు రేణుక శిరస్సు ఖండించిన కొండ గుహే ఇప్పుడు శివమొగ్గలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం. ఈ ఆలయానికి చాలా ప్రాచీన చరిత్ర ఉంది. ఆ ప్రాచీన కాలంలోనే ఈ గుడికి భార్య భర్తలిద్దరూ నగ్నంగా వెళ్లి పూజ చేసేవారట. అలా చేయడం వల్ల తమ కాపురం సజావుగా సాగుతుందని, శ్రేష్టమైన సంతానం కలుగుతుందనీ, సుఖ సంతోషాలు నిండుగా తేజరిల్లుతాయనీ నమ్మేవారట. కానీ ఇప్పుడు ఆ ఆచారాన్ని నిలిపివేశారట. మామూలు దర్శనమే జరుగుతోందట.

దర్శన వేళలూ విలక్షణమే..

ఈ అమ్మవారిని అన్నివేళలా దర్శించుకోవడం సాధ్య పడదట. కేవలం శుక్రవారం, మంగళవారంలలో మాత్రమే ఈ అమ్మవారిని పూర్తి సమయం దర్శించుకునే వీలుందట. మిగిలిన రోజుల్లో కేవం ఉదయం రెండు గంటలు మాత్రమే అనుమతిస్తారట. అదీ సంగతి.

Latest News

Related News