science : మూఢ నమ్మకాల వెనుక అసలు సైన్స్ ఉందా?

Science : ప్రతి ఒక్కరూ పుట్టిన నాటి నుంచి అనేక మూఢ నమ్మకాల గురించి.. వినడమో…. చూడటమో.. చేస్తుంటారు. కొంత మంది గత్యంతరం లేక మూఢ నమ్మకాలను పాటిస్తే.. కొంత మంది ఇష్టపూర్వకంగా పాటిస్తున్నారు. రాకెట్ వేసుకుని అంతరిక్ష యాత్రలకు వెళ్తున్న ఈ రోజుల్లో కూడా.. మారుమూల పల్లెల్లో ఎక్కడో ఓ చోట మూఢ నమ్మకాలను పాటిస్తూ.. ప్రాణాలు కోల్పోయిన వారిని.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారి గురించి.. తరచూ.. మనం వింటూ, చూస్తూ ఉంటాం. కానీ […].

By: jyothi

Updated On - Mon - 6 December 21

science : మూఢ నమ్మకాల వెనుక అసలు సైన్స్ ఉందా?

Science : ప్రతి ఒక్కరూ పుట్టిన నాటి నుంచి అనేక మూఢ నమ్మకాల గురించి.. వినడమో…. చూడటమో.. చేస్తుంటారు. కొంత మంది గత్యంతరం లేక మూఢ నమ్మకాలను పాటిస్తే.. కొంత మంది ఇష్టపూర్వకంగా పాటిస్తున్నారు. రాకెట్ వేసుకుని అంతరిక్ష యాత్రలకు వెళ్తున్న ఈ రోజుల్లో కూడా.. మారుమూల పల్లెల్లో ఎక్కడో ఓ చోట మూఢ నమ్మకాలను పాటిస్తూ.. ప్రాణాలు కోల్పోయిన వారిని.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారి గురించి.. తరచూ.. మనం వింటూ, చూస్తూ ఉంటాం. కానీ ఆ సమయంలో మనం చెప్పింది వినే పరిస్థితుల్లో ఎవరు ఉండకపోవడంతో మనం ఏం చేయలేక నిల్చుండి చూడాల్సి వస్తుంది. పల్లెల్లో మరీ దారుణంగా మంత్రాల నెపంతో అమాయకులను పొట్టన పెట్టకుంటున్న వార్తలను చూసి మనం అయ్యో అనుకుంటాం. ఎన్ని సంస్థలు పల్లె ప్రజల్ని మూఢ నమ్మకాల నుంచి బయట పడేయాలని ప్రయత్నించినా.. వారి శ్రమ బూడిదలో పోసిన పన్నీరులా వృథాగా మారిపోతుంది. ఈ మూఢ నమ్మకాలు మన తాతల కాలం నుంచి వస్తున్నాయి. సైన్స్ పుట్టక ముందే ఈ మూఢ నమ్మకాలు పుట్టాయని అందరూ అంటుంటారు.


చనిపోయిన మనిషి కూడా వదల్లేదా..

గ్రామాల్లో ఎవరైనా కాలం చేస్తే.. వారికి మైల ఉంటుందని 10 రోజుల పాటు వారిని ఎవరూ ముట్టుకోవద్దని చెప్పడం మనం చూస్తాం. అలా ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తే.. మాత్రం పాత కాలం నాటి నుంచి ఉన్న ఆచారమని పెద్దలు చెబుతారు. అంతే కాని దాని వెనుక దాగి ఉన్న సైన్స్ ను గురించి చెప్పరు… చనిపోయిన మనిషి కుటుంబంలో ఎవరికైనా ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా.. మరెవరికీ వ్యాపించకుండా ఉండేందుకు ఈ ఆచారాన్ని కనిపెట్టారట. ఈ ఆచారం వల్ల లాభమే కాని నష్టం మాత్రం లేదు.


తులసి ఆకులతో ఏమొస్తుంది…

tulasi

tulasi


తెలుగు లోగిళ్ల లో ప్రతి ఒక్కరి ఇంటి ముందో, లేక పెరట్లోనో తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది. తులసి ఆకులను చప్పరించాలని మన పెద్దలు మనకు చెబుతారు. దానికి కారణం తులసిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయని వాటి వల్ల శరీరంలో ఎటువంటి రోగాలున్నా.. నయమవుతాయనే నమ్మకం. అందుకే ప్రతి ఆలయంలోని తీర్థ ప్రసాదంలో తప్పనిసరిగా తులసి ఆకులు వేసి ఉంచడం మనం గమనించవచ్చు.

సూర్యాస్తమయం తర్వాత గోళ్లు తీస్తే.. ఏం జరుగుతుంది…

nails

nails


సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడిస్తే… అలా చేయకూడదని మన పెద్దవాళ్లు చెబుతారు. అలాగే గోర్లు కత్తిరించుకున్నా… కసురుతారు. సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేయొద్దని కండీషన్ పెడతారు. ఇది కూడా మూఢ నమ్మకమే అని మనం లైట్ తీసుకుంటాం కానీ ఇందులో కూడా మన ఊహకందని సైన్స్ దాగి ఉంది.. పూర్వపు రోజుల్లో ఇప్పటిలా కరెంట్ ఉండేది కాదు కావున రాత్రి పూట కాంతి ఉండే చాన్సే లేదు. ఎవరైనా సరే చీకటి పడిన తర్వాత గోర్లు కత్తిరిస్తే సరిగా కనబడక వేళ్లు తెగుతాయని పెద్దవాళ్లు అలా చెప్పేవారు. అంతే కాకుండా చీకట్లో ఇల్లు ఊడ్వడం కన్నా వేరే పని చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే ఈ ఆచారాలు పుట్టాయని పేర్కొంటారు.

రాత్రి పూట రావి చెట్టు వద్దకు వెళ్తే.. ఏం జరుగుంది..

ravi chettu

ravi chettu


రాత్రయితే రావి చెట్టు వద్దకు వెళ్లొద్దని పెద్దలు అనేకులు చెబుతారు. ఎందుకు అని అడిగితే సరైన సమాధానం మాత్రం చెప్పరు. దీని వెనుక కూడా సైంటిఫిక్ కారణం ఉందని తెలిస్తే షాక్ అవుతాం. అసలు విషయమేంటంటే… రాత్రి పూట చెట్లు ఆక్సిజన్ ను పీల్చుకుని.. కార్బన్ డయాక్సైడ్ ని విడుదల చేస్తాయి. రావి చెట్టు మరింత ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ని విడుదల చేస్తుంది. ఈ కారణం చేతే రాత్రిపూట రావిచెట్టు వద్దకు వెళ్లొద్దని పెద్దలు వారిస్తారు.

Tags

Latest News

Related News