Kumkum: నుదిటిపై స్త్రీలు ఎందుకు బొట్టు ధరించాలి !

Kumkum: బొట్టు… హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రధానమైనది. సౌభాగ్యానికి, సుమంగళి తనానికి ప్రతీకగా దీన్ని ఆడవారు ధరిస్తారు. ఇక మగవారు కర్మసిద్ధాంతానికి ప్రతీకగా దీన్ని ధరిస్తారు.ప్రతి నిత్యం కుంకుమ లేదా సింధూరం లేదా భస్మం, గంధం ఇలా అనేక రకాలుగా బొట్టు లేదా ఆయా చిహ్నాలను ధరించడం పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. అయతే ఈ బొట్టును ధరించడం వల్ల ఏం ప్రయోజనాలు కలుగుతాయి అనేది చాలామందికి సందేహం. దీనిగురించి తెలుసుకుందాం… స్త్రీలు ప్రతిరోజు ప్రాత కాలంలో […].

By: jyothi

Published Date - Wed - 5 May 21

Kumkum: నుదిటిపై స్త్రీలు ఎందుకు బొట్టు ధరించాలి !

Kumkum: బొట్టు… హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రధానమైనది. సౌభాగ్యానికి, సుమంగళి తనానికి ప్రతీకగా దీన్ని ఆడవారు ధరిస్తారు. ఇక మగవారు కర్మసిద్ధాంతానికి ప్రతీకగా దీన్ని ధరిస్తారు.ప్రతి నిత్యం కుంకుమ లేదా సింధూరం లేదా భస్మం, గంధం ఇలా అనేక రకాలుగా బొట్టు లేదా ఆయా చిహ్నాలను ధరించడం పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. అయతే ఈ బొట్టును ధరించడం వల్ల ఏం ప్రయోజనాలు కలుగుతాయి అనేది చాలామందికి సందేహం. దీనిగురించి తెలుసుకుందాం…

Significance of a kumkum on the forehead

Significance of a kumkum on the forehead

స్త్రీలు ప్రతిరోజు ప్రాత కాలంలో స్నానం చేసి మొట్ట మొదట పాపిటలోను, నుదిటి మీద బొట్టును పెట్టుకోవడం మంచిది, లేదంటే భర్త యొక్క ఆయుష్షు తగ్గుతుంది, కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే బొట్టు, కాళ్ళకు పసుపు రాసుకొని దేవుడి గదిలోకి వెళ్లి దీపం పెట్టడం మంచిది, మన భారతీయులు వెనకటి నుంచి స్త్రీలు కాళ్ళకు పసుపు రాయడాన్ని సాంప్రదాయంగా పెట్టారు, ఎందుకంటే ఎలాంటి అనారోగ్యమైన పాదాల నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ పసుపు అనేది ఒక యాంటీబయటిక్ గా పనిచేస్తుంది. ఆడవారు నీళ్లతో పని ఎక్కువగా చేస్తారు కాబట్టి కాళ్ళ పగుళ్ళు దాని ద్వారా ఏ ఇతర అనారోగ్యాలు రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి పసుపును ధరిస్తారు.

కాబట్టి స్త్రీలు ఆరోగ్యంగా ఉండడం వల్ల ఆ గృహంలో ఎల్లప్పటికీ లక్ష్మీ కటాక్షం ఉంటుంది స్త్రీలు పాపిట మీద నుదిటి మీద బొట్టు పెట్టుకోకుండా ఉంటే మీరు ప్రాత కాలంలో సింహద్వారం తెరవగానే దరిద్ర లక్ష్మి మీ గృహంలోకి ఆ వాహనం అవుతుంది. కాబట్టి భారతీయ సాంప్రదాయంగా స్త్రీలు బొట్టు ధరించడం మంచిది. అంతేకాదు శాస్త్రీయంగా పూర్వకాలంలో మన పూర్వీకులు తయారుచేసుకున్నట్లు కుంకుమా లేదా సింధూరం, పసుపును తయారుచేసుకుని వాటిని ధరించడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. మనలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. డీ విటమిన్ను తీసుకునే శక్తి పెరుగుతుంది అని పలువురు శాస్త్రవేత్తలు ఆయా సందర్భాలలో పేర్కొన్నారు.

బయట దొరికే కృత్రిమ బొట్టు అంటే కుంకుమలను ధరించడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి శాస్త్రీయంగా సహజ సిద్ధంగా తయారుచేసిన కుంకుమ లేదా భస్మం, సింధూరాన్ని ధరించండి. భగవంతుని అనుగ్రహాన్ని పొందండి.

Latest News

Related News