Ekalavya: శ్రీకృష్ణుడి తమ్ముడే ఏకలవ్యుడు.
ఏకలవ్యుడు అంటేనే గురుభక్తి గుర్తుకువస్తుంది. శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడి సోదరుడే దేవశ్రవుడు. ఆయన కుమారుడే ఏకలవ్యుడని.. చిన్నప్పుడు తప్పిపోయి నిషాదరాజైన హిరణ్యధనుడికి దొరికాడని ..ఆయన ఏకలవ్యుడిని దత్తత తీసుకున్నాడని కొన్నిగ్రంథాల్లో ఉంది. అందుకే ఏకలవ్యుడిని శ్రీకృష్ణుడి సోదరుడిగా, యాదవుడని చెబుతుంటారు.
చివరకు ఏకలవ్యున్ని శ్రీకృష్ణుడే చంపేస్తాడు.
Shrikrishna kill Eklavya
కథలోకి వెళితే:
రామాయణ, భారతాలు, పురాణాలు చదవని వాళ్ళక్కూడా కొన్ని పాత్రల గురించి కొంతయినా తెలుస్తుంది. అలాంటి లోక ప్రసిద్ధి చెందిన వారిలో ఏకలవ్యుడు ఒకరు. మరి ఏకలవ్యుడికి అంత ప్రాధాన్యత ఎలా వచ్చిదో తెలియాలంటే ఆయన గురించి తెలుసుకుందాం.
ఏకలవ్యుడు ఒక నిషాధ (ఎరుకల) కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి హిరణ్యధన్వుడు. సహజంగానే ఎరుకలవారికి విలువిద్యలో ప్రవేశం ఉంటుంది. ఏకలవ్యుడికి అందులో మరీ ప్రావీణ్యం ఉంటుంది. తాను నిషాద (ఎరుకల) కుటుంబంలో పుట్టినప్పటికీ విలువిద్యలో అగ్రగణ్యుడిగా నిలవాలని అనుకుంటాడు.
ekalavya learning secretly
ద్రోణాచార్యుని దగ్గర విలువిద్య నేర్చుకోవాలనుకుంటాడు. ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని విలువిద్యను అభ్యసిస్తాడు. విలువిద్యలో ఆరితేరిన అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సాధిస్తాడు. ఏకలవ్యునికి విలువిద్యలో ఎంత నైపుణ్యం ఉందంటే, కళ్ళతో చూడకుండా, కేవలం శబ్దాన్ని బట్టే బాణాన్నిప్రయోగిస్తాడు. కంటితో చూసి వేసిన వారికే ఎన్నోసార్లు గురి తప్పుతుంది. కానీ ఏకలవ్యుడు మాత్రం శబ్దవేది విద్యలో ఆరితేరినవాడు కావడంతో గురి తప్పదు. ఒకసారి విలువిద్య సాధనకు అర్జునుడు, ద్రోణుడు ఇతరులు కలిసి అడవికి వేట కుక్కలను వేటడానకి వేటకు వెళతారు. అందులోని ఒక కుక్క వేగంగా, ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్లింది. కొత్త వేషధారణతో ఏకలవ్యుడు కనిపంచే సరికి కుక్క గట్టిగా అరిచింది. “నన్ను చూసి అరుస్తావా” అనుకున్న ఏకలవ్యుడు కుక్క నోరు తెరచి మూసే లోపు దాని నోట్లోకి 7 బాణాలు కొట్టాడు. తరువాత కుక్క అర్జునికి కనిపించింది. విషయం విచారించగా ఈ ప్రాంతంలో ఏకలవ్యుడు అనే అతను విలువిద్య నేర్చుకుంటున్నాడని తెలుకుంటాడు.
అర్జునిడి పన్నాగం:
ఏకలవ్యుని గురించి తెలుసుకున్న అర్జునుడు ద్రోణాచార్యులు వారికి సేవ చేసే సమయంలో ఇక్కడ నా కన్న బాగా విలువిద్య చేసే వారు ఉన్నారని తెలుపుతాడు. తరువాత రోజు ద్రోణాచార్యులు ఏకలవ్యుడిని చూడటానికి అతని వద్దకు వెళ్లాడు. ఏకలవ్యుడు తన గురువుకు స్వాగతం పలికాడు. ఏకలవ్యుడి విలువిద్య చూసి ఏంతో సంతోషిస్తాడు. కానీ ఒక కుక్క తనను చూసి అరచిందనే చిన్న కారణానికి దాని నోట్లోకి 7 బాణాలు కొట్టావని, ఇలా కోపాన్ని అదుపులో ఉంచుకోలేని, ధర్మం, అధర్మం తేడా తెలియకుండా అధర్మం వైపు మొగ్గే అతని వద్ద ఇంతటి విలువిద్య ఉంటే లోకానికి ప్రమాదం జరుగుతుందని రాబోయే ప్రమాదాలను ముందే నివారించుటకు ఏకలవ్యుడు విలువిద్య ప్రదర్శించుటకు వీలుకాకుండా అతని కుడి చేతి బొటనవేలు గురుదక్షిణగా అడుగుతాడు. అడగగానే ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక, తన కుడి చేతి బొటన వేలుని కోసి గురుదక్షిణగా సమర్పిస్తాడు.
ekalavya giving his thumb finger as gurudakshina
మరణం:
ద్రోణాచార్యులు అనుకున్నదే నిజమైంది. ధర్మం వైపు మొగ్గకుండా అధర్మం వైపు వెళ్లాడు. తరువాత ఏకలవ్యుడు జరాసంధునికి చాలా విశ్వాసపాత్రుడిగా వ్యవహరించాడు. రుక్మిణీ స్వయంవరం సమయంలో జరాసంధుని కోరిక మేరకు, శిశుపాలుడికి, రుక్మిణీ దేవి తండ్రియైన భీష్మకునికి మధ్యవర్తిగా వ్యవహరించాడు. భీష్మకుడు రుక్మిణి శిశుపాలుడిని పెళ్ళి చేసుకోవాలని కోరాడు. కానీ రుక్మిణీ శ్రీకృష్ణుని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. తరువాత ఒకసారి జరాసంధుని సైన్యంతో యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు పైకి ఏకలవ్యుడు ఒక రాయి విసరడంతో శ్రీకృష్ణుడే అతన్ని చంపేశాడు.
krishna kill ekalavya