Temple Circling : ఆలయంలో ప్రదక్షిణం ప్రాముఖ్యత, లాభాలు మీకు తెలుసా?

Temple Circling : ఆలయ సందర్శన మాత్రం చేతనే మానసిక ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెప్తుంటారు. ఇకపోతే ప్రతీ రోజు వేల సంఖ్యలో భక్తులు తమ దగ్గరలోని ఆలయాలను సందర్శిస్తుంటారు. అలా భగవంతుడి నామస్మరణ చేసి ఆలయంలో కాసేపు అయినా ప్రశాంతంగా కూర్చొని తమ కోసం భగవంతుని వేడుకుంటుంటారు. దేవాలయం వెళ్లిన ప్రతీ ఒక్కరు కంపల్సరీగా దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఈ మేరకు పెద్దలతో పాటు ఆలయ అర్చకులు కూడా సూచిస్తుంటారు. ఇంతకీ ప్రదక్షిణం ప్రాముఖ్యత […].

By: jyothi

Published Date - Tue - 26 October 21

Temple Circling : ఆలయంలో ప్రదక్షిణం ప్రాముఖ్యత, లాభాలు మీకు తెలుసా?

Temple Circling : ఆలయ సందర్శన మాత్రం చేతనే మానసిక ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెప్తుంటారు. ఇకపోతే ప్రతీ రోజు వేల సంఖ్యలో భక్తులు తమ దగ్గరలోని ఆలయాలను సందర్శిస్తుంటారు. అలా భగవంతుడి నామస్మరణ చేసి ఆలయంలో కాసేపు అయినా ప్రశాంతంగా కూర్చొని తమ కోసం భగవంతుని వేడుకుంటుంటారు.

దేవాలయం వెళ్లిన ప్రతీ ఒక్కరు కంపల్సరీగా దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఈ మేరకు పెద్దలతో పాటు ఆలయ అర్చకులు కూడా సూచిస్తుంటారు. ఇంతకీ ప్రదక్షిణం ప్రాముఖ్యత ఏంటి? ప్రదక్షిణం వల్ల కలిగే లాభాలు ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం.

ఆలయం చుట్టూత అనగా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా గ్రహాచారాలు బాగాలేకపోతే సరి అవుతాయట. హిందూ ధర్మ శాస్త్రాలు ఈ మేరకు చెప్తున్నాయి. ఇకపోతే ప్రదక్షిణలు శ్రద్ధతో చేతులు జోడించి చేయడం వలన మేలు జరుగుతుందట. అయితే ప్రదక్షిణలు చేయమన్నారు కదా.. అని ఎన్ని అంటే అన్ని అస్సలు చేయకూడదట. నియమిత సంఖ్యలోనే ప్రదక్షిణలు చేయాలని, అలా చేయడం ద్వారానే ఫలితముంటుందని పెద్దలు చెప్తున్నారు.

Temple Circling

Temple Circling

ఇకపోతే ప్రదక్షిణం అనే పదంలోని ప్రతీ అక్షరానికి అర్థముందని పెద్దలు వివరిస్తున్నారు ప్ర అంటే పాప నాశనమని, ద అనగా కోరికలను నెరవేర్చుటని, క్ష అనగా భవిష్యత్తు జన్మల నుంచి విమోచనమని, ణ అనగా జ్ఞానం ద్వారా ముక్తి మార్గంలో పయనించాలని, ముక్తిని ప్రసాదించాలనే అర్థం. అలా ప్రదక్షిణలకు అర్థం ఉంది. ఇకపోతే ప్రదక్షిణం చేయడం వృత్తాకారంలోనేనన్న సంగతి అందరికీ విదితమే. అలా వృత్తాకారంలో ప్రదక్షిణం చేయాలనడంలో ఉద్దేశమేమిటంటే.. మనందరి జీవితాలకు కేంద్రం, ఆధారం, సారం, భారం భగవంతుడే కాబట్టి కేంద్రంలోనే ప్రదక్షిణం ఉంటుందనే అర్థం చెప్పబడుతుందట. ఇకపోతే భగవంతుడు అందరినీ సమానం చూస్తాడని చెప్పడమే ప్రదక్షిణ అర్థం అని కూడా పెద్దలు వివరిస్తున్నారు.

ప్రదక్షిణ ఎడమ నుంచి కుడి వైపునకు చేయాలి. అలా చేయడంలో ఉద్దేశమేమిటంటే..కుడి వైపు శుభప్రదతను తెలపడమే. గర్భాలయం కుడి వైపుగా ఉంచి ప్రదక్షిణం చేయడం వలన అన్ని వేళలా సాయం, శక్తి, మార్గదర్శకం ఇచ్చి భగవంతుడు సన్మార్గంలో నడిపిస్తాడనే నమ్మకం. ఇకపోతే సాధారణంగా కూడా మనకు కుడి చేతికి ఉన్నంత బలం ఎడమ చేతికి ఉండకపోవడం మనకు తెలిసిందే. కాగా, అలా మనం కుడివైపున అత్యంత ఎక్కువ ప్రయారిటీ ఉన్న ఐటమ్స్ పెట్టుకుని, ఎడమ వైపున లీస్ట్ ప్రయారిటీ ఉన్న వాటిని క్యారీ చేస్తుంటాం. అది మన సంప్రదాయంగా వస్తోంది. ఆ క్రమంలోనే ప్రదక్షిణం కుడి వైపునకు చేయడం వల్ల మేలు జరుగుతుందట. ఇకపోతే ప్రదక్షిణల వల్ల అధర్మ మార్గం నుంచి ధర్మ మార్గంలోకి మానవులు మార్చబడతారనేది నమ్మకం.

Tags

Latest News

Related News