Vaishaka Masam: వైశాఖం.. మాధవమాసం ఇలాచేస్తే అన్నిశుభాలే !

Vaishaka Masam:(మే 12 నుంచి వైశాఖమాసం సందర్భంగా) తెలుగు నెలలో రెండో నెల వైశాఖమాసం. దీనికి ఆ పేరు వచ్చిన కారణం.. పౌర్ణమిరోజు… చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్నందున ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చింది. దీనినే మాధవమాసం అని కూడా పిలుస్తారు. అన్ని మాసాల కంటే వైశాఖ మాసం శ్రీవిష్ణు భక్తులకు ఉత్తమమైనది. ఈ మాసం శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసిదళాలతో శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని కలిపి పూజించినవారికి మోక్షదాయకమైనదని […].

By: jyothi

Published Date - Mon - 10 May 21

Vaishaka Masam: వైశాఖం.. మాధవమాసం ఇలాచేస్తే అన్నిశుభాలే !

Vaishaka Masam:(మే 12 నుంచి వైశాఖమాసం సందర్భంగా) తెలుగు నెలలో రెండో నెల వైశాఖమాసం. దీనికి ఆ పేరు వచ్చిన కారణం.. పౌర్ణమిరోజు… చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్నందున ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చింది. దీనినే మాధవమాసం అని కూడా పిలుస్తారు. అన్ని మాసాల కంటే వైశాఖ మాసం శ్రీవిష్ణు భక్తులకు ఉత్తమమైనది. ఈ మాసం శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసిదళాలతో శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని కలిపి పూజించినవారికి మోక్షదాయకమైనదని పురాణాలలో పేర్కొన్నారు.

Things to do in Vaishaka Masam

Things to do in Vaishaka Masam

పురాణ విశిష్టత

వైశాఖ మాసం మొదలుకొని మూడునెలలపాటు శ్రీమహావిష్ణువు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. ఈ మాస మహత్యాన్ని శ్రీమహావిష్ణువే లక్ష్మీదేవికి వివరించినట్లు పురాణాల్లో ద్వారా మనకు తెలుస్తుంది.

ఏం చేయాలి ?

వైశాఖం అంటే మాధవమాసం కాబట్టి ఈ మాసంలో ఒంటిపూట భోజనం, నక్తం ఆయాచితంగా భుజించడం చేస్తే మంచిది. ఈ మాసంలో సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేయాలి. అటువంటి వారు ఉత్తమగతులు పొందుతారు. అదే విధంగా వైశాఖ మాసం పరమేశ్వరుడికి ధార పాత్ర ద్వారా అభిషేకం చేసినట్లయితే అత్యంత శుభఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అశ్వత్థ వృక్షం అంటే రావిచెట్టు మొదళ్ళను ఎక్కువ మొత్తం నీటితో తడిపి ప్రదక్షిణాలు చేసినవారి పూర్వీకులు అంటే పితృదేవతలందరూ తరిస్తారు. ఎంతో శ్రేష్ఠమైనదని తెలుపబడింది. ఈ మాసంలో యజ్ఞాలు, తపస్సులు, పూజలు, దానధర్మాలకు, నదీ స్నానాలకు ఉత్తమమైన మాసం. నదీ స్నానం చేయలేనివారు గంగ, గోదావరి, యమునా మొదలైన పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువలలో, చెరువులలో, బావుల దగ్గర లేకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి.

ఒకవేళ వైశాఖ మాసం మొత్తం స్నానం చేయలేనివారు కనీసం మూడు రోజులు అయినా స్నానం చేయాలి అవి శుక్లపక్ష త్రయోదశి, చతుర్ధశి, పూర్ణిమ తిథులలో అయినా నదీస్నానం ఆచరించడానికి ప్రయత్నించాలి. అదీ వీలుకాకుంటే స్నానం చేసేటప్పుడు ‘‘గంగ, యమునా, కృష్ణా, గోదావరి ఇలా పవిత్రనదులను, పుండరకాక్ష అనే పేర్లు తలుచుకుంటూ స్నానం ఆచరించాలి. ఈ మాసంలో నీరు, గొడుగు, విసనకర్ర, చెప్పులు దానం చేయడం అత్యంత శ్రేష్ఠం.

వైశాఖంలో పండుగలు!

వైశాఖ మాసంలో అక్షయతృతీయ, పరశురామ జయంతి, ఆదిశంకర జయంతి, భగవద్రామానుజ జయంతి, నారసింహ జయంతి, సత్యనారాయణ స్వామి కల్యాణం, మోహిని ఏకాదశి, హనుమత్ జయంతి, బుద్ధపూర్ణిమ, సంపద్ గౌరీ వ్రతం వంటి పర్వదినాలు ఉన్నాయి.

ఏం దానం చేయాలి ?

ఈ మాసంలో అన్నదానాలు, వస్త్ర దానాలు, బియ్యం, మంచం, మామిడిపళ్ళు, మజ్జిగ, ఆవునెయ్యి, చెరుకురసం, అరటిపళ్ళు దానం చేసిన వారు అనంతమైన పుణ్యఫలాలు పొందుతారు. మానవసేవనే మాధవసేవగా చేస్తే విష్ణువు అనుగ్రహం కలుగుతుంది.

Latest News

Related News