Godess lakshmidevi: వాస్తు శాస్త్రాన్ని చాలా మంది నమ్ముతారు. ఇంటి నుంచి కాలు తీసి బయట పెట్టాలన్నా కూడా కొంత మంది వాస్తును ఫాలో అవుతారు. ఈ టైంలో బయటికి వెళ్లాలి. లేకుంటే అన్నీ అశుభాలే జరుగుతాయని చెబుతారు. మరి అటువంటి వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు మన ఇంట్లో ఎప్పటికీ అయిపోకుండా ఉంచుకోవాలట. లేకపోతే మనకు అనేక ఆర్థిక సమస్యలతో పాటుగా వ్యక్తిగత సమస్యలు కూడా వస్తాయని పలువురి నమ్మకం. మన ఇల్లు గడిచేందుకు ప్రధాన కారణం ధనం. అటువంటి ధనానికి అధిపతి అయిన ధనలక్ష్మీ దేవిని జాగ్రత్తగా పూజించాలి.
లక్ష్మీ దేవికి కోపం కలిగించే పనులను మనం అస్సలు చేయకూడదు. ఒక వేళ లక్ష్మీ దేవికి కోపం తెప్పించే పనులను మనం చేస్తే ఆమె కోపానికి గురికాక తప్పదు. లక్ష్మీ దేవికి కనుక కోపం వస్తే మనం ఎంతటి ధనంతో కళకళలాడినా సరే రోడ్డు మీదకు రావడం ఖాయంగా చెబుతారు. ఒక వేళ అమ్మ అనుగ్రహిస్తే అడుక్కు తినే బిచ్చగాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎటువంటి వస్తువులు ఇంటిలో అయిపోకుండా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
goddess lakshmidevi
మనకు ప్రతి ఇంటిలో పిండి దర్శనం ఇస్తుంది. అది వరిపిండి కావొచ్చు, గోధుమ పిండి కావొచ్చు, జొన్న పిండి కావొచ్చు. కానీ ఏదో ఒక రకం పిండి మాత్రం ఉంటుంది. మన ఇంట్లో ఎప్పుడూ పిండి అయిపోకుండా చూసుకోవాలని వాస్తు శాస్త్రం ప్రకారం చెబుతున్నారు. పిండి కనుక అయిపోతే మన గౌరవం కూడా కోల్పోతారని చాలా మంది చెబుతున్నారు. కావున పిండి అయిపోకుండా చూసుకోవాలి. పసుపు. పసుపును చాలా మంది యాంటీ బ్యాక్టిరియల్ గా కూడా ఉపయోగిస్తారు. పుండ్లను పూర్తిగా తగ్గించడంలో పసుపు ప్రముఖ పాత్రను పోషిస్తుంది. పసుపును యాంటీ బ్యాక్టీరియల్ గా ఉపయోగించినా కానీ పసుపును ఎక్కువగా వాడేది కూరల్లోనే.
goddess lakshmidevi
పసుపును వేసుకోవడం వలన కూరలకు మంచి రంగు వస్తుంది. రంగుతో పాటుగా టేస్ట్ కూడా మారిపోతుంది. అటువంటి పసుపును అందరూ తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకుంటారు. ఒక వేళ పసుపు కనుక అయిపోతే దరిద్రానికి దారి తీస్తుందని, అనుకున్న శుభకార్యాలు సమయానికి పూర్తి కావని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇక ఇవి మాత్రమే కాకుండా మన ఇంటిలో ఉప్పు కూడా పూర్తిగా నిండుకోకుండా చూసుకోవాలి. ఉప్పుతో పాటుగా బియ్యాన్ని కూడా పూర్తిగా అయిపోనివ్వకూడదు. ఇవి పూర్తిగా నిండుకోక ముందే తీసుకురావడం చాలా మంచిది.