Srikrishna Temple: దేవుడు నేరుగా ప్రసాదాన్ని స్వీకరించే దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా !

Srikrishna Temple:ఈ దేవాలయంలో రోజుకు ఏడుసార్లు నైవేద్యం ! భక్తులు ప్రతి నిత్యం దేవుడిని ఆరాధిస్తారు. చాలామంది దేవుడికి షోడశోపచార పూజలు చేస్తారు. దీనిలో ప్రధానగా భక్తితో నైవేద్యాన్ని స్వామికి లేదా దేవతకు సమర్పిస్తారు. అయితే దేవుడు నైవేద్యాన్ని నేరుగా స్వీకరించడు. ఇది యుగధర్మం. కేవలం కంటితో చూసి సంతృప్తి చెందడం ఈ యుగలక్షణం. కానీ ఈ యుగంలో కూడా నేరుగా భక్తులు సమర్పించిన ప్రసాదాన్ని స్వీకరించే దేవాలయం గురించి తెలుసుకుందాం… కలియుగం అంటే దైవారాధనలో ఒక […].

By: jyothi

Published Date - Thu - 13 May 21

Srikrishna Temple: దేవుడు నేరుగా ప్రసాదాన్ని స్వీకరించే దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా !

Srikrishna Temple:ఈ దేవాలయంలో రోజుకు ఏడుసార్లు నైవేద్యం !

భక్తులు ప్రతి నిత్యం దేవుడిని ఆరాధిస్తారు. చాలామంది దేవుడికి షోడశోపచార పూజలు చేస్తారు. దీనిలో ప్రధానగా భక్తితో నైవేద్యాన్ని స్వామికి లేదా దేవతకు సమర్పిస్తారు. అయితే దేవుడు నైవేద్యాన్ని నేరుగా స్వీకరించడు. ఇది యుగధర్మం. కేవలం కంటితో చూసి సంతృప్తి చెందడం ఈ యుగలక్షణం. కానీ ఈ యుగంలో కూడా నేరుగా భక్తులు సమర్పించిన ప్రసాదాన్ని స్వీకరించే దేవాలయం గురించి తెలుసుకుందాం…

కలియుగం అంటే దైవారాధనలో ఒక విగ్రహం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇదే కలియుగంలో ఒక దేవాలయంలో భగవంతుడు నేరుగా ప్రసాదాన్ని స్వీకరిండం అనేది మీరెప్పుడైనా చూశారా లేదా ఎప్పుడైనా విన్నారా ? ఈ లీలలన్నీ శ్రీ కృష్ణుడి దేవాలయంలోని జరుగుతాయి. ఆ దేవాలయం గ్రహణ సమయంలో కూడా తెరుస్తారు. అది ఇంత అద్భుతమైన ఆలయం. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటో దాని రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం …

శ్రీకృష్ణ దేవాలయం

ఈ ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం. అర్ధరాత్రి ఏకాంత సేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన ఏకైక ఆలయం ఇది. ఇక్కడ వెలసిన శ్రీకృష్ణ భగవానులు ఎప్పుడు చాలా ఆకలితో ఉంటారు. ఈ స్వామికి ప్రతిరోజు ఇక్కడి పూజారులు ఏడు సార్లు మహా నివేదన చేస్తారు. ఏడు సార్లు స్వామివారికి నివేదన పెట్టినప్పుడు ఆ పాత్రలో నుంచి కొంచెం కొంచెం ప్రసాదం తగ్గడం అక్కడి వారు చూస్తారు. స్వామి వారు పెట్టిన నైవేద్యం నుంచి స్వయంగా తింటారని ఇక్కడి భక్తుల నమ్మకం. అందరూ చూస్తుండగా ప్రసాదం కొంచెం మాయమవుతుంది. ఈ ఆలయం తెల్లవారుజామున రెండు గంటల సమయానికి తెరుస్తారు. సాధారణంగా ప్రతి దేవాలయంలో స్వామివారికి అభిషేకం అలంకరణ తర్వాతనే నైవేద్యం సమర్పిస్తారు. కానీ ఈ ఆలయంలో మొదట నే నైవేద్యం సమర్పించిన తర్వాతనే అభిషేకం అలంకరణ లాంటివి చేస్తారు. నైవేద్యం పెట్టడానికి కొంచెం ఆలస్యమైనా పూజారులు గుడి తలుపులు తెరవడం కొంచెం ఆలస్యమైనా చాలా తప్పుగా దోషంగా భావిస్తారు. అందుకే ప్రధాన అర్చకులు గుడి తలుపులు తీసేటప్పుడు చేతిలో గొడ్డలి పట్టుకొని ఉంటారు. ఏదైనా సమస్య వల్ల తాళం పని చేయకపోయినా ఆ గొడ్డలితో తాళాన్ని పగలగొట్టి తలుపులు తెరవడం ఇక్కడి ఈ ఆలయ ఆనవాయితీ. ఆ శ్రీ కృష్ణ పరమాత్మకి చేసే నివేదన కూడా చాలా రుచిగా ఉంటుంది. స్వామివారికి నివేదన చేసిన తర్వాత భక్తులందరికీ ఆ ప్రసాదాన్ని కొంచెం కొంచెంగా పెడతారు. ఏ భక్తులు కూడా ఈ ఆలయంలో ప్రసాదం తీసుకోకుండా ఆకలితో వెళ్లకూడదనేది ఇక్కడి నియమం. ఆలయ పూజారులు మైకుల్లో ఇంకా ప్రసాదం తీసుకొని వారు ఎవరైనా ఉన్నారా అని పలు మార్లు అడుగుతారు. అట్లా ఉన్నవారు తీసుకోండి అని చెబుతారు, పెద్దగా అరుస్తారు.

స్వామికి సమర్పించే నైవేద్యానికి కొంచెం ఆలస్యమైనా స్వామివారి నడుము చుట్టూ ఉన్న తాడు కొద్దిగా కిందికి జారుతుంది అని మనం గమనించవచ్చు. ఎప్పుడో ఒకసారి గ్రహణ సమయంలో ఇలాంటి అపశృతి అక్కడ చోటుచేసుకుంది. ఈ ఆలయాన్ని ఒక గ్రహణ సమయం లోనే కాకుండా ఎప్పుడూ కూడా మూసి వేయరు. గ్రహణం సమయంలో ప్రతి ఒక్క ఆలయం మూసివేస్తారు. కానీ ఈ శ్రీకృష్ణ మందిరాన్ని గ్రహణ సమయంలో కూడా మూసి వేయరు. గ్రహ దోషాలు గ్రహణ దోషాలు, సర్పదోషాలు, ఇతర దోషాలు, వ్యాపారంలో నష్ట దోషాలు, వివాహ దోషాలు బ్రహ్మ హత్య మహాపాతక దోషాలు ఇలాంటివి ఏవి ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఆ శ్రీకృష్ణభగవానుని దర్శించి పూజిస్తే అన్ని దోషాలు దూరం అవుతాయి. అన్నీ నివారింపబడతాయి. ఇక్కడికి వచ్చి స్వామివారికి నమస్కరించుకుని దర్శించుకోవడం వల్ల ఎలాంటి గ్రహదోషాలు ఉండవని, జాతక దోషాలు పోతాయిన భక్తులు ఇక్కడి స్వామి వారిని భక్తితో కొలుస్తారు.
పురాణ ప్రశస్తి ఈ అద్భుతమైన ఆలయం మహాభారత కాలంలో వనవాసం అజ్ఞాతవాసం సమయంలో నాలుగు చేతులతో కూడిన విగ్రహాన్ని ప్రత్యక్షంగా శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులకు ఇచ్చాడు అని స్థలపురాణం చెబుతుంది. అజ్ఞాతవాసం తరవాత పాండవులు వెళ్లే సమయంలో స్థానిక ప్రజలు తమకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని ప్రార్థించడంతో ప్రాధేయ పడడంతో అక్కడి వారికి ఇవ్వడం జరిగినది. అతడే ఒక మందిరాన్ని నిర్మించి భగవంతుని ఆ మందిరంలో ప్రతిష్టించాడు. కేరళలోని ఈ తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం కొట్టాయం జిల్లా రైల్వే స్టేషన్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మరెన్నో అద్బుత రహస్యాలు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

Tags

Related News